ఉత్పత్తికి సిద్ధమైన మెర్సిడెస్-ఎఎమ్‌జి ప్రాజెక్ట్ వన్ హైపర్ కార్; ఎఫ్1 ఇంజన్‌తో..

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ మరియు దాని పెర్ఫార్మెన్ విభాగం ఏఎమ్‌జిలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్ట్ వన్ హైపర్ కారు త్వరలోనే మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. మెర్సిడెస్-ఎఎమ్‌జి ప్రాజెక్ట్ వన్ హైపర్ కార్ ఉత్పత్తికి సిద్ధంగా ఉందని కంపెనీ తన ఫేస్‌బుక్ పేజీలో ఒక వీడియోను కూడా విడుదల చేసింది.

ఉత్పత్తికి సిద్ధమైన మెర్సిడెస్-ఎఎమ్‌జి ప్రాజెక్ట్ వన్ హైపర్ కార్; ఎఫ్1 ఇంజన్‌తో..

మెర్సిడెస్-ఎఎమ్‌జి ప్రాజెక్ట్ వన్ హైపర్ కారులో ఫార్ములా వన్ కార్లలో ఉపయోగించే తరహా ఇంజన్‌ను ఉపయోగించాచు. ఈ ప్రాజెక్ట్ వన్ హైపర్‌కార్ ఇప్పుడు ఉత్పత్తికి సిద్ధంగా ఉంది మరియు త్వరలో ఇది మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు.

ఉత్పత్తికి సిద్ధమైన మెర్సిడెస్-ఎఎమ్‌జి ప్రాజెక్ట్ వన్ హైపర్ కార్; ఎఫ్1 ఇంజన్‌తో..

మెర్సిడెస్-ఎఎమ్‌జి ప్రాజెక్ట్ వన్‌ను తొలిసారిగా 2017లో ఒక కాన్సెప్ట్ రూపంలో వెల్లడించారు. ఇది స్ట్రీట్ లీగల్ ఫార్ములా 1 కారులా ఉంటుందని మెర్సిడెస్-ఎఎమ్‌జి పేర్కొంది. ఈ హైపర్ కారు ఎఫ్ 1 తరహా సస్పెన్షన్‌ను మరియు ఎఫ్ 1 ఇంజన్ లాంటి శక్తిని అందిస్తుందని కంపెనీ ప్రకటించింది.

MOST READ:మీకు తెలుసా.. భారతదేశపు మొట్టమొదటి కమర్షియల్ పైలట్ ఈ యువతి

ఉత్పత్తికి సిద్ధమైన మెర్సిడెస్-ఎఎమ్‌జి ప్రాజెక్ట్ వన్ హైపర్ కార్; ఎఫ్1 ఇంజన్‌తో..

మెర్సిడెస్-ఎఎమ్‌జి తమ హైపర్ కారు విషయంలో ఈ వాగ్దానాలు చేసి చాలా కాలం అయింది. కాగా, ఇప్పుడు అవి త్వరలోనే నిజం కానున్నాయి. ప్రపంచంలోని ఉత్తమ పనితీరు గల కార్లను తయారు చేసే సంస్థలలో మెర్సిడెస్-ఎఎమ్‌జి కూడా ఒకటి. ఈ బ్రాండ్ ఇప్పటికే కొన్ని అద్భుతమైన స్పోర్ట్స్ కార్లు, పెర్ఫార్మెన్స్ సెడాన్లు మరియు ఎస్‌యూవీలను తయారు చేసింది.

ఉత్పత్తికి సిద్ధమైన మెర్సిడెస్-ఎఎమ్‌జి ప్రాజెక్ట్ వన్ హైపర్ కార్; ఎఫ్1 ఇంజన్‌తో..

అంతేకాకుండా, ఈ బ్రాండ్ కూడా చాలా విజయవంతమైన ఫార్ములా 1 జట్టును కలిగి ఉంది. ఇది 2014 నుండి 2020 వరకు వరుసగా ఏడు కన్స్ట్రక్టర్ల ఛాంపియన్‌షిప్‌లను సొంతం చేసుకుంది. తాజాగా, 2021 ఛాంపియన్‌షిప్ కోసం కూడా గట్టిగా ప్రయత్నిస్తోంది.

MOST READ:విధుల్లో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ తన తల్లి మరణ వార్త విన్నాడు.. తరువాత ఏం జరిగిందంటే?

ఉత్పత్తికి సిద్ధమైన మెర్సిడెస్-ఎఎమ్‌జి ప్రాజెక్ట్ వన్ హైపర్ కార్; ఎఫ్1 ఇంజన్‌తో..

ఈ బ్రాండ్ 2014, 2015, మరియు 2016లో ఫార్ములా వన్ రేసును గెలిచిన తరువాత, ఆ కార్లలో ఉపయోగించిన మెర్సిడెస్-ఎఎమ్‌జి ఛాంపియన్‌షిప్-విన్నింగ్ డ్రైవ్‌ట్రెయిన్‌ను స్ట్రీట్ లీగల్ హైపర్‌కారులో కూడా ఉంచాలని కంపెనీ నిర్ణయించుకుంది. ఈ ఆలోచన నుండే మెర్సిడెస్-ఎఎమ్‌జి ప్రాజెక్ట్ వన్ హైపర్ కార్ కాన్సెప్ట్ ఉద్భవించింది.

ఉత్పత్తికి సిద్ధమైన మెర్సిడెస్-ఎఎమ్‌జి ప్రాజెక్ట్ వన్ హైపర్ కార్; ఎఫ్1 ఇంజన్‌తో..

ఇది కాన్సెప్ట్ నుండి ఉత్పత్తి దశకు చేరుకోవటానికి దాదాపు ఐదేళ్ల సమయం పట్టింది. ఇప్పుడు ప్రాజెక్ట్ వన్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా విడుదలైన ఓ వీడియోలో, మెర్సిడెస్-ఎఎమ్‌జి యొక్క చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జోచెన్ హెర్మన్ తమ కంపెనీ ప్లాంట్‌లో ఈ కారును నడుపుతున్నట్లు కనిపించారు.

MOST READ:ప్రజల కోసం తన కారును అంబులెన్సుగా మార్చిన కాంగ్రెస్ నాయకుడు, ఎవరో తెలుసా?

ఉత్పత్తికి సిద్ధమైన మెర్సిడెస్-ఎఎమ్‌జి ప్రాజెక్ట్ వన్ హైపర్ కార్; ఎఫ్1 ఇంజన్‌తో..

మెర్సిడెస్-ఎఎమ్‌జి ప్రాజెక్ట్ వన్ హైపర్ కారులో పెట్రోల్-హైబ్రిడ్ ఇంజన్ ఉంటుంది. ఇందులో నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లతో పాటుగా 1.6-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ వి6 ఇంజన్ కూడా ఉంటుంది. ఈ కారు రహదారి వెర్షన్ కావటంతో, ఇది మరింత నమ్మదగినదిగా ఉండటానికి 1.6-లీటర్ ఇంజిన్ ఫార్ములా 1 కారు నుండి అనేక మార్పులతో నేరుగా తీయబడుతుంది.

ఉత్పత్తికి సిద్ధమైన మెర్సిడెస్-ఎఎమ్‌జి ప్రాజెక్ట్ వన్ హైపర్ కార్; ఎఫ్1 ఇంజన్‌తో..

ఈ కారులోని ఫార్ములా వన్ ఇంజన్ మరియు నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు అన్నీ కలిపి గరిష్టంగా 1,000 బిహెచ్‌పి కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తాయని భావిస్తున్నారు. డిజైన్ మరియు స్టైలింగ్ పరంగా చూసుకుంటే, ఇందులోని ప్రతి బిట్ కూడా మోటర్‌స్పోర్ట్ ప్రేరిత హైపర్‌కార్ కోసం ఖచ్చితంగా రూపొందించబడినట్లుగా అనిపిస్తుంది.

MOST READ:పనికిరాని సీట్ బెల్టులతో వ్యాపారం.. మిలియన్ల కొద్దీ సంపాదన.. ఎలా అనుకునుటున్నారా?

ఉత్పత్తికి సిద్ధమైన మెర్సిడెస్-ఎఎమ్‌జి ప్రాజెక్ట్ వన్ హైపర్ కార్; ఎఫ్1 ఇంజన్‌తో..

ప్రాజెక్ట్ వన్ హైపర్ కారు పైకప్పు స్కూప్‌తో సెంట్రల్ క్యాబిన్‌ను పొందుతుంది, పైకప్పు వెనుక వైపుకు వాలుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దాని వీల్ ఆర్చెస్ చాలా శక్తివంతంగా కనిపిస్తాయి. ఎయిర్ డ్రాగ్ కోసం దీని వెనుక భాగంలో ఒక ప్రత్యేకమైన వింగ్ కూడా ఉంటుంది.

ఉత్పత్తికి సిద్ధమైన మెర్సిడెస్-ఎఎమ్‌జి ప్రాజెక్ట్ వన్ హైపర్ కార్; ఎఫ్1 ఇంజన్‌తో..

ఇందులోని ఇంటీరియర్స్ కూడా చాలా ఆధునికమైనవి మరియు ఎక్కువగా డిజిటల్ రూపంలో ఉంటాయి. అయితే, ఫార్ములా వన్ ఫీలింగ్ కోసం దీని స్టీరింగ్ వీల్‌ను మాత్రం స్టాండర్డ్ ఫార్ములా 1 కారులో కనిపించిట్లుగా డిజైన్ చేయబడి ఉంటుంది. రేస్ట్రాక్‌ల పైనే కాకుడా సాధారణ హైవేలపై కూడా నడిపేందుకు ఈ ప్రాజెక్ట్ వన్ ఒక అద్భుతమైన కారుగా చెప్పొచ్చు.

ఉత్పత్తికి సిద్ధమైన మెర్సిడెస్-ఎఎమ్‌జి ప్రాజెక్ట్ వన్ హైపర్ కార్; ఎఫ్1 ఇంజన్‌తో..

తాజా నివేదికల ప్రకారం, మెర్సిడెస్-ఎఎమ్‌జి ప్రాజెక్ట్ వన్ హైపర్‌కార్ డెలివరీలు ఈ ఏడాది చివర్లో ప్రారంభం కావచ్చని అంచనా. ఈ జర్మన్ కార్ బ్రాండ్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో ఈ మెర్సిడెస్-ఎఎమ్‌జి ప్రాజెక్ట్ వన్ కూడా ఒకటి.

Most Read Articles

English summary
Mercedes-AMG Project One Hypercar With F1 Engine Is Ready For Production, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X