భారత మార్కెట్లో బెంజ్ AMG E53 & E63 S లాంచ్: ధర & పూర్తి వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లో కొత్త ఎఎమ్‌జి ఇ53 మరియు ఇ63 ఎస్ పర్ఫామెన్స్ సెడాన్లను విడుదల చేసింది. ఈ కొత్త లగ్జరీ కార్ల ప్రారంభ ధర రూ. 1.70 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా). బ్రాండ్ యొక్క ఎఎమ్‌జి మోడల్స్ సింగిల్-ఫుల్ లోడెడ్ వేరియంట్లలో లభిస్తాయి. కంపెనీ ఈ కార్ల కోసం బుకింగ్స్ కూడా ప్రారంభించింది.

భారత మార్కెట్లో బెంజ్ AMG E53 & E63 S లాంచ్: ధర & పూర్తి వివరాలు

మెర్సిడెస్ బెంజ్ యొక్క ఈ కొత్త సెడాన్లు రెండు వేరియంట్లలో లభిస్తాయి. అవి ఇ 53 4మ్యాటిక్ ప్లస్ ప్రీమియం మరియు ఇ 63 ఎస్ 4మ్యాటిక్ ప్లస్ ప్రీమియం అనే వేరియంట్లు. వీటి ధరలు వరుసగా రూ. 1.02 కోట్లు మరియు రూ. 1.70 కోట్లు. ఈ ధరలు ఇండియా ఎక్స్-షోరూమ్ ప్రకారం నిర్దారించబడినవి.

భారత మార్కెట్లో బెంజ్ AMG E53 & E63 S లాంచ్: ధర & పూర్తి వివరాలు

ఈ కొత్త వేరియంట్స్ యొక్క కలర్ వోషయానికి వస్తే, ఇ53 వేరియంట్ మోజావే సిల్వర్, డిజైనో హైసింత్ రెడ్ అనే రెండు కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. అదే విధంగా ఇ63 ఎస్ మాత్రం 'డిజైనో సెలెనైట్ గ్రే' కలర్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

భారత మార్కెట్లో బెంజ్ AMG E53 & E63 S లాంచ్: ధర & పూర్తి వివరాలు

కొత్త ఎఎమ్‌జి ఇ53 మరియు ఇ63 ఎస్ వేరియంట్లు ఇటీవల ప్రారంభించిన కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ యొక్క స్పోర్టియర్ వెర్షన్లపై ఆధారపడి ఉంటాయి. అయితే డిజైన్ మాత్రం ఎస్-క్లాస్ కంటే చాలా భిన్నంగా ఉంటుంది.

భారత మార్కెట్లో బెంజ్ AMG E53 & E63 S లాంచ్: ధర & పూర్తి వివరాలు

ఎఎమ్‌జి ఇ53 యొక్క ఎక్స్టీరియర్ డిజైన్ చాలా దూకుడుగా ఉంటుంది. ఇందులో ఎఎమ్‌జి యొక్క ఐకానిక్ స్టైలింగ్ మరియు డిజైన్ ఉపయోగించబడింది. ఇందులో ఫ్రంట్ ఆప్రాన్ విత్ ఎయిర్ ఇంటెక్ వెంట్స్, ఎఎమ్‌జి సైడ్ సిల్ ప్యానెల్స్, ఎఎమ్‌జి రియర్ ఆప్రాన్ విత్ రియర్ డిఫ్యూజర్, ఎఎమ్‌జి రేడియేటర్ గ్రిల్, మెర్సిడెస్ బెంజ్ లోగో, ఎఎమ్‌జి బ్యాడ్జ్, 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటివి వున్నాయి.

భారత మార్కెట్లో బెంజ్ AMG E53 & E63 S లాంచ్: ధర & పూర్తి వివరాలు

ఇక ఎఎమ్‌జి ఇ63 ఎస్ విషయానికి వస్తే, ఇది కూడా చాలా స్పోర్టి డిజైన్ కలిగి ఉంటుంది. కావున ఇది చాలా విలాసవంతంగా కనిపిస్తుంది. ఈ మోడల్‌లో చాలా చోట్ల అల్యూమినియం ఫినిషింగ్ ఇవ్వబడింది. సైడ్ స్కర్ట్స్, ఫ్రంట్ మరియు రియర్ ఆప్రాన్ కారుకు అల్యూమినియం ఫినిషింగ్ ఇచ్చారు. ఇందులో ఎఎమ్‌జి అక్షరాలతో రెడ్ రియర్ బ్రేక్ కాలిపర్, ట్విన్ పైప్ ఎగ్జాస్ట్, 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, హై గ్లోస్ బ్లాక్ ఎక్స్‌టర్రియర్ మిర్రర్ హౌసింగ్, హై గ్లోస్ మెర్సిడెస్ బెంజ్ లోగో, ఎఎమ్‌జి బ్యాడ్జ్ వంటివి ఉన్నాయి.

భారత మార్కెట్లో బెంజ్ AMG E53 & E63 S లాంచ్: ధర & పూర్తి వివరాలు

బెంజ్ యొక్క ఈ రెండు కార్లు లోపలి భాగం కూడా అప్డేటెడ్ ఫీచర్స్ తో చాలా స్పోర్టిగా ఉంటుంది. ఇవి రెండూ కూడా పర్ఫామెన్స్ సెడాన్లు కలిగి ఉండవలసిన అన్ని ఫీచర్స్ కలిగి ఉన్నాయి.

వీటిలో 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ప్లే, 12.3 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్ప్లే, ఎంబియుఎక్స్ కనెక్టెడ్ టెక్నాలజీ విత్ వాయిస్ అసిస్టెన్స్, బర్మెస్టర్ ఆడియో సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎఎమ్‌జి స్పోర్ట్స్ సీట్లు, మెమరీ ఫంక్షన్‌తో ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ సీట్లు, 64 కలర్ యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

భారత మార్కెట్లో బెంజ్ AMG E53 & E63 S లాంచ్: ధర & పూర్తి వివరాలు

ఎఎమ్‌జి ఇ53 మరియు ఎఎమ్‌జి ఇ63 ఎస్ సెడాన్ రెండూ కూడా అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటాయి. వీటిలో యాక్టివ్ బోనెట్, యాక్టివ్ బ్రేకింగ్ అసిస్ట్, అడాప్టివ్ బ్రేక్ సిస్టమ్, బ్లైండ్ స్పోర్ట్ అసిస్ట్, ప్రీ సేఫ్ యాంటిసిపేటరీ సిస్టమ్, 8 ఎయిర్ బ్యాగ్స్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ వంటివి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.

భారత మార్కెట్లో బెంజ్ AMG E53 & E63 S లాంచ్: ధర & పూర్తి వివరాలు

ఎఎమ్‌జి ఇ53 సెడాన్ 3.0-లీటర్ 6-సిలిండర్ ట్విన్ టర్బోచార్జ్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 429 బిహెచ్‌పి పవర్ మరియు 5,800 ఆర్‌పిఎమ్ వద్ద 520 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 9-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. ఎఎమ్‌జి ఇ53 యొక్క టాప్ స్పీడ్ గంటకు 249 కిలోమీటర్లు.

భారత మార్కెట్లో బెంజ్ AMG E53 & E63 S లాంచ్: ధర & పూర్తి వివరాలు

ఇక ఎఎమ్‌జి ఇ63 ఎస్ సెడాన్ పవర్ పుల్ 4.0-లీటర్ ట్విన్ టర్బో వి 8 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 603 బిహెచ్‌పి పవర్ మరియు 4,500 ఆర్‌పిఎమ్ వద్ద 850 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ కారు కేవలం 3.4 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. దీని ఆగ్రవేగం గంటకు 299 కిలోమీటర్లు.

Most Read Articles

English summary
Mercedes-AMG E53 & E63 S Launched In India. Read in Telugu.
Story first published: Thursday, July 15, 2021, 15:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X