భారత్‌లో విడుదలైన Mercedes-AMG GLE 63 S Coupe; ధర & వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ అయిన Mercedes Benz భారతీయ మార్కెట్లో తన పోర్ట్‌ఫోలియోను నిరంతరం విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ Mercedes Benz AMG GLE 63 S Coupe (మెర్సెడెస్ బెంజ్ ఏఎమ్‌జి జిఎల్ఈ 63 ఎస్ కూపే) పెర్ఫార్మెన్స్ SUV ని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త Mercedes Benz AMG GLE 63 S Coupe ధర రూ. 2.07 కోట్లు (ఎక్స్-షోరూమ్).

భారత్‌లో విడుదలైన Mercedes-AMG GLE 63 S Coupe; ధర & వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త Mercedes Benz AMG GLE 63 S Coupe అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా మరియు చాలా స్పోర్టిగా కూడా కనిపిస్తుంది. ఈ కారు డిజైన్ విషయానికి వస్తే, ఈ కారు ముందు భాగంలో పనామెరికానా గ్రిల్‌ను పొందుతుంది.

భారత్‌లో విడుదలైన Mercedes-AMG GLE 63 S Coupe; ధర & వివరాలు

Mercedes Benz AMG GLE 63 S Coupe (మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జిఎల్ఈ 63 ఎస్) దాదాపుగా GLE కూపేలాగా అనిపిస్తుంది. ఈ కొత్త SUV ఎక్స్టీరియర్ విషయానికి, ఇందులో క్వాడ్ ఎగ్జాస్ట్ టిప్స్, 22 ఇంచెస్ లైట్-అల్లాయ్ వీల్స్ మరియు స్పోర్ట్స్ బాడీ కిట్‌ కలిగి ఉండటం వల్ల ఇది ఈ SUV ని మరింత అద్భుతంగా చూపిస్తుంది.

భారత్‌లో విడుదలైన Mercedes-AMG GLE 63 S Coupe; ధర & వివరాలు

Mercedes Benz AMG GLE 63 S Coupe యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులోని సీట్లు నాప్పా లెదర్ తో ఉంటాయి. దీనితో పాటు, ఇది స్పోర్టి AMG స్టీరింగ్ వీల్, కార్బన్ ఫైబర్ ట్రిమ్, ఎంబియుఎక్స్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో డ్యూయల్ స్క్రీన్ సెటప్ మరియు అనేక ఇతర ఫీచర్స్ కూడా ఉంటాయి.

భారత్‌లో విడుదలైన Mercedes-AMG GLE 63 S Coupe; ధర & వివరాలు

Mercedes Benz AMG GLE 63 S Coupe కంపెనీ యొక్క GLE 53 పై ఆధారపడి ఉంటుంది. కంపెనీ యొక్క GLE 53 SUV ఇప్పటికే భారత మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉంది. భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కొత్త SUV చాలా అధునాతన ఫీచర్స్ కలిగి, వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత్‌లో విడుదలైన Mercedes-AMG GLE 63 S Coupe; ధర & వివరాలు

AMG GLE 63 S కూపేలోని ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 4.0-లీటర్, టర్బోచార్జ్డ్ వి8 ఇంజిన్‌ ఉంటుంది. ఈ ఇంజిన్ 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 603 బిహెచ్‌పి శక్తిని మరియు 2,500 మరియు 4,500 ఆర్‌పిఎమ్ మధ్య 850 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ కొత్త SUVలోని ఇంజిన్ లో 48V EQ బూస్ట్ హైబ్రిడ్ సిస్టమ్ కూడా ఉపయోగించబడింది. ఇది అవసరమైనప్పుడు 21 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను పెంచుతుంది. Mercedes Benz AMG GLE 63 S Coupe ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది.

భారత్‌లో విడుదలైన Mercedes-AMG GLE 63 S Coupe; ధర & వివరాలు

Mercedes Benz AMG GLE 63 S Coupe కేవలం 3.8 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వరకు వేగవంతమవుతుంది.. AMG GLE 63 S యొక్క గరిష్ట వేగం గంటకు 280 కిలోమీటర్లు అని కంపెనీ పేర్కొంది. ఇది మంచి ఇంధన సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది.

భారత్‌లో విడుదలైన Mercedes-AMG GLE 63 S Coupe; ధర & వివరాలు

Mercedes Benz AMG GLE 63 S (మెర్సెడెస్ బెంజ్ ఏఎమ్‌జి జిఎల్ఈ 63 ఎస్) కూపేలో అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్త, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, యాక్టివ్ బ్రేక్ అసిస్ట్, ఈఎస్పి, డైనమిక్ హ్యాండ్లింగ్ కంట్రోల్ సిస్టమ్, యాక్టివ్ రోల్ స్టెబిలైజేషన్, ఏఎమ్‌జి ఎలక్ట్రానిక్ రియర్-యాక్సిల్ లిమిటెడ్-స్లిప్ డిఫరెన్షియల్, ఏఎమ్‌జి సిలిండర్ మేనేజ్‌మెంట్ మరియు యాక్టివ్ రైడ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహనదారుని భద్రతను నిర్థారిస్తాయి.

భారత్‌లో విడుదలైన Mercedes-AMG GLE 63 S Coupe; ధర & వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త Mercedes Benz AMG GLE 63 S Coupe(మెర్సెడెస్ బెంజ్ ఏఎమ్‌జి జిఎల్ఈ 63 ఎస్ కూపే) చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, చాలా వరకు అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలు కలిగి ఉంటుంది. ఈ కొత్త SUV ఇతర లగ్జరీ వాహనాలను మంచి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఈ కారు యొక్క అమ్మకాలు ఎలా ఉంటాయి అనే విషయం ముందు ముందు తెలుస్తుంది.

Most Read Articles

English summary
Mercedes benz amg gle 63 s coupe performance suv launched at rs 2 07 cr details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X