భారత్‌లో విడుదలైన 2021 జిఎల్‌ఎ & ఎఎమ్‌జి జిఎల్‌ఎ 35; ధర & వివరాలు

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ దేశీయ మార్కెట్లో కొత్త జిఎల్‌ఎ, ఎఎమ్‌జి జిఎల్‌ఎ 35 ఎస్‌యూవీలను విడుదల చేసింది. ఈ కొత్త 2021 జిఎల్‌ఎ ధరలు రూ. 41.10 లక్షల(ఎక్స్‌షోరూమ్, ఇండియా) నుంచి ప్రారంభమవుతాయి.

ప్రస్తుతం దేశంలో కరోనా అధికంగా విజృంభిస్తున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించబడింది. కావున ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ కి ప్రభావితం కాని రాష్ట్రాల్లో ఈ కొత్త ఎస్‌యూవీ డెలివరీలు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

భారత్‌లో విడుదలైన 2021 జిఎల్‌ఎ & ఎఎమ్‌జి జిఎల్‌ఎ 35; ధర & వివరాలు

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఈ ఎస్‌యూవీ గత 2021 ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఆలస్యం అయింది. కానీ ప్రస్తుతం కూడా కరోనా వ్యాప్తి ఉన్నప్పటికీ కంపెనీ ఈ ఎస్‌యూవీని ఇప్పుడు విడుదల చేసింది.

భారత్‌లో విడుదలైన 2021 జిఎల్‌ఎ & ఎఎమ్‌జి జిఎల్‌ఎ 35; ధర & వివరాలు

మెర్సిడెస్ బెంజ్ విడుదల చేసిన ఈ జిఎల్‌ఎ ఎస్‌యూవీ 200ఏ ప్రోగ్రెసివ్ లైన్, 220 డి ప్రోగ్రెసివ్ లైన్, 220 డి 4 మాటిక్ ఎఎమ్‌జి లైన్ మరియు రేంజ్-టాపింగ్ జిఎల్‌ఎ 35 4 మాటిక్ అనే వేరియంట్లలో లభిస్తుంది. మెర్సిడెస్ బెంజ్ యొక్క కొత్త ఎస్‌యూవీల ధరల విషయానికి వస్తే, జిఎల్‌ఎ 220 డి రూ. 43.7 లక్షలు, జిఎల్‌ఎ 220 డి 4 మ్యాటిక్ ధర రూ. 46.7 లక్షలు మరియు ఎఎమ్‌జి జిఎల్‌ఎ 35 మాటిక్ ధర. 57.3 లక్షల వరకు ఉంటుంది.

MOST READ:భారత్‌లో అడుగుపెట్టిన 2021 ట్రయంఫ్ బోన్‌విల్ బాబర్‌ బైక్; ధర & వివరాలు

భారత్‌లో విడుదలైన 2021 జిఎల్‌ఎ & ఎఎమ్‌జి జిఎల్‌ఎ 35; ధర & వివరాలు

బెంజ్ ఎఎమ్‌జి జిఎల్‌ఎ 35 సికెడి యూనిట్‌గా భారతీయ తీరాలకు తీసుకురానున్నారు. ఈ కొత్త ఎస్‌యూవీ భారతదేశంలో అడుగుపెట్టనున్న మూడవ ఎఎమ్‌జి మోడల్‌ కానుంది. అయితే కంపెనీ అందించిన సమాచారం ప్రకారం 2021 జూలై నుండి రూ. 1.5 లక్షలు పెంచనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

భారత్‌లో విడుదలైన 2021 జిఎల్‌ఎ & ఎఎమ్‌జి జిఎల్‌ఎ 35; ధర & వివరాలు

2021 ఎఎమ్‌జి ఇప్పుడు దాని మునుపటి మోడల్ కంటే 104 మిమీ పొడవు మరియు 30 మిమీ ఎత్తు ఎక్కువగా ఉంటుంది. ఈ కొత్త ఎస్‌యూవీల యొక్క చివర్లో కొత్త బంపర్ డిజైన్, రివైజ్డ్ గ్రిల్ మరియు పెద్ద అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అంతే కాకుండా ఈ 2021 బెంజ్ ఎఎమ్‌జి జిఎల్‌ఎ 35 లో వర్టికల్ స్లాట్‌లతో పనామెరికానా గ్రిల్, కొత్త రూప్ స్పాయిలర్ లార్జర్ వీల్స్ మరియు పెద్ద ఎగ్జాస్ట్ టిప్స్ మరియు లోపల మరియు వెలుపల ఎఎమ్‌జి బ్యాడ్జ్‌లు ఉంటాయి.

MOST READ:ప్రమాదంలో రెండు ముక్కలైన 5 స్టార్ రేటింగ్ పొందిన కారు; పూర్తి వివరాలు

భారత్‌లో విడుదలైన 2021 జిఎల్‌ఎ & ఎఎమ్‌జి జిఎల్‌ఎ 35; ధర & వివరాలు

2021 జిఎల్‌ఎ 200 లో 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది ఇది 5500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 161 బిహెచ్‌పి మరియు 1620 ఆర్‌పిఎమ్- 4000 ఆర్‌పిఎమ్ మధ్య 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. జిఎల్‌ఎ 200 ఎ 8.7 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగవంతం చేయగలదు. అంతే కాకుండా ఇది గంటకు 210 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

భారత్‌లో విడుదలైన 2021 జిఎల్‌ఎ & ఎఎమ్‌జి జిఎల్‌ఎ 35; ధర & వివరాలు

ఇక బెంజ్ 200 డి మరియు 200 డి 4 మ్యాటిక్ విషయానికి వస్తే ఇందులో 2.0-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది 3800 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 189 బిహెచ్‌పి మరియు 1600-2600 ఆర్‌పిఎమ్ వద్ద 400 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ డిసిటి తో జతచేయబడింది.

MOST READ:లాక్‌డౌన్ ఉన్నా.. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి.. అయితే భూమ్మీద కాదు.. మరెక్కడనుకుంటున్నారా?

భారత్‌లో విడుదలైన 2021 జిఎల్‌ఎ & ఎఎమ్‌జి జిఎల్‌ఎ 35; ధర & వివరాలు

బ్రాండ్ యొక్క 4 మ్యాటిక్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ కేవలం 200 డి ఎఎమ్‌జి లైన్ ట్రిమ్ లో మాత్రమే అందించబడుతుంది. 200 డి కేవలం 7.4 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం కాగా, 200 డి 4 మ్యాటిక్ కేవలం 7.3 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వేగవంతం అవుతుంది.

భారత్‌లో విడుదలైన 2021 జిఎల్‌ఎ & ఎఎమ్‌జి జిఎల్‌ఎ 35; ధర & వివరాలు

కొత్త మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎలో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం పెద్ద గ్లాస్ స్లాబ్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఒకదానికొకటి కలిసి ఉంటాయి. ఇవి రెండు 10.25 ఇంచెస్ స్క్రీన్‌లు కలిగి ఉంటాయి. ఇందులో ఉన్న 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ MBUX వాయిస్ అసిస్టెంట్ టెక్నాలజీ యొక్క సరికొత్త రూపం మరియు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే వంటి వైర్‌లెస్ ఫోన్ కనెక్టివిటీని కలిగి ఉంది.

MOST READ:గిఫ్ట్‌గా పొందిన థార్ ఎస్‌యూవీలో ఆఫ్-రోడ్ డ్రైవ్ చేసిన క్రికెటర్ [వీడియో]

భారత్‌లో విడుదలైన 2021 జిఎల్‌ఎ & ఎఎమ్‌జి జిఎల్‌ఎ 35; ధర & వివరాలు

ఇందులో సేఫ్టీ కోసం మెర్సిడెస్ మి-కనెక్ట్‌ను కలిగి ఉంది. అలెక్సా మరియు గూగుల్ హోమ్ వంటి వాయిస్ అసిస్ట్ ద్వారా కంట్రోల్ హేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీలోని ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, టర్బైన్ తరహా ఎసి వెంట్స్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్ మరియు మెర్సిడెస్ ప్రీ-సేఫ్ సేఫ్టీ ప్యాకేజీ వంటి ఫీచర్స్ ఉంటాయి.

భారత్‌లో విడుదలైన 2021 జిఎల్‌ఎ & ఎఎమ్‌జి జిఎల్‌ఎ 35; ధర & వివరాలు

ఎఎమ్‌జి జిఎల్‌ఎలో మౌంట్ కంట్రోల్స్‌తో కూడిన ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, అడాప్టివ్ ఎఎమ్‌జి సస్పెన్షన్, ఎఎమ్‌జి స్పోర్ట్స్ ప్యాకేజీ ఎక్స్‌టర్రియర్, 12 స్పీకర్లతో ప్రీమియం బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్, డైనమికా అపోల్స్ట్రేతో స్పోర్ట్స్ సీట్లు, లార్జ్ 19 ఇంచెస్ వీల్, యాక్టివ్ పార్కును ప్రారంభించే పార్కింగ్ ప్యాకేజీ ఉన్నాయి. అసిస్ట్ మరియు మల్టీబీమ్ హెడ్‌ల్యాంప్స్ కూడా ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన 2021 జిఎల్‌ఎ & ఎఎమ్‌జి జిఎల్‌ఎ 35; ధర & వివరాలు

ప్రస్తుతం మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎ దేశంలో బ్రాండ్ యొక్క ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ ఆఫర్‌గా ఉంది. 2021 ఎస్‌యూవీలో పవర్‌ట్రెయిన్ ఆప్సన్స్ కలిగి ఉండటంతో పాటు, లోపలి భాగంలో ఎక్కువ స్థలం కూడా ఉంటుంది. ఈ కొత్త మోడల్స్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటంతో పాటు వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.

Most Read Articles

English summary
2021 Mercedes-Benz GLA & AMG GLA 35 Launched In India. Read in Telugu.
Story first published: Tuesday, May 25, 2021, 17:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X