Just In
- 9 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 20 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 22 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 23 hrs ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
మోదీ దుకాణంలో మందులు అగ్గువ -శానిటరీ ప్యాడ్ రూ.2.50కే: ప్రధాని; 7500వ జన ఔషధి కేంద్రం ప్రారంభం
- Movies
రాజీవ్ కనకాల మా నాన్న.. చైల్డ్ ఆర్టిస్ట్ మాటలకు సుమ షాక్
- Sports
ఐపీఎల్ 2021 షెడ్యూల్ వచ్చేసింది.. వేదికల్లో హైదరాబాద్‌కు దక్కని చోటు !
- Finance
ట్విట్టర్ సీఈవో 15 ఏళ్ల క్రితం తొలి ట్వీట్‌కు రూ.కోట్లు
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
గతేడాది చివరి త్రైమాసికంలో జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్, భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త మరియు మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'ఈక్యూసి'కి సంబంధించి మొదటి బ్యాచ్ పూర్తిగా అమ్ముడైపోయినట్లు కంపెనీ పేర్కొంది.

ఈ ఎలక్ట్రిక్ బెంజ్ కారును బెంగుళూరు, హైదరాబాద్, ఢిల్లీ, పూనే, ముంబై మరియు చెన్నై నగరాల్లో విక్రయిస్తున్నారు. ఈ నగరాల్లో ఇప్పుడు ఈ మోడల్ కోసం సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు. అయితే, త్వరలోనే సెకండ్ బ్యాచ్ దిగుమతి అవుతుందని, అప్పటి వరకూ కస్టమర్లు ఈ కారును బుక్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి ఎలక్ట్రిక్ కారును కొత్తగా బుక్ చేసుకునే కస్టమర్లు డెలివరీ కోసం రెండు మూడు నెలల వరకూ వేచి ఉండాల్సి ఉంటుంది. కాగా, మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఇటీవలే ఈ కారులో ఓ కొత్త అప్డేట్ను కూడా ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ మరింత శక్తివంతమైన ఆన్‌బోర్డ్ ఛార్జర్‌తో అందుబాటులోకి వచ్చింది.
MOST READ:పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇందులోని పవర్ఫుల్ 11 కిలోవాట్ ఆన్‌బోర్డ్ ఛార్జర్ ఇప్పుడు కేవలం 7 గంటల 30 నిమిషాల్లోనే ఈక్యూసి యొక్క 80 కిలోవాట్ అవర్ బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేస్తుంది. ఈ కారులో ఇదివరకు ఉన్న 7.4 కిలోవాట్ ఛార్జర్ ఇందులోని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 11 గంటల సమయం పట్టేది.

కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి 400 ఎస్‌యూవీలో 80 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చబడి ఉంటాయి. ప్రతి యాక్సిల్ వద్ద అమర్చిన రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కలిపి గరిష్టంగా 405 బిహెచ్పి పవర్‌ని మరియు 765 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తాయి. పూర్తి ఛార్జ్‌పై ఈ కారు గరిష్టంగా 400 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది.
MOST READ:బైక్ రైడర్‌కి రూ. 1 లక్షకు పైగా జరిమానా.. కారణం మాత్రం ఇదే

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి కేవలం 5.1 సెకన్లలోనే గంటకు 0 - 100 కిమీ వేగాన్ని చేరుకోగలదు. దీని గరిష్ట వేగాన్ని గంటకు 180 కిలోమీటర్లకు పరిమితం చేశారు. ఇది స్టాండర్డ్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్లతో లభిస్తుంది. ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 40 నిమిషాల్లోనే ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ బ్యాటరీని 0 - 80 శాతం వరకూ ఛార్జ్ చేసుకోవచ్చు.

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో రెండు 10.3 ఇంచ్ డిస్ప్లేలు ఉంటాయి. ఇందులో ఒకటి ఇన్ఫోటైన్మెంట్ కోసం మరియు మరొకటి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఉంటుంది. ఇందులోని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వాయిస్-యాక్టివేటెడ్ ఫంక్షన్లతో పాటుగా బ్రాండ్ యొక్క సరికొత్త ఎమ్‌బియూఎక్స్ సిస్టమ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.
MOST READ:షూటింగ్ స్పాట్‌కి 12 కి.మీ సైకిల్‌పై వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎందుకో మరి

ఈక్యూసి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఫ్రంట్ గ్రిల్‌పై ప్రకాశించే మెర్సిడెస్ బెంజ్ బ్యాడ్జింగ్ మరియు ఇరువైపులా ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లను అనుసంధానించే ఎల్ఈడి స్ట్రిప్ ఉంటాయి. ఇంకా ఇందులో వెనుక వైపున, స్టైలిష్ టెయిల్ ల్యాంప్స్, బూట్ లిడ్‌పై అంతటా ఉన్న లైట్ బార్, స్పెషల్ డ్యూయెల్-టోన్ సిక్స్-స్పోక్ అల్లాయ్ వీల్ డిజైన్, రూఫ్ స్పాయిలర్ మరియు క్రోమ్-ఫినిష్డ్ విండో-లైన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ప్రారంభ ధర రూ.99.30 లక్షలు ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఉంది. ఇది ఈ విభాగంలో ఇటీవలే విడుదలైన జాగ్వార్ ఐ-పేస్ మరియు కొత్తగా రానున్న ఆడి ఇ-ట్రాన్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారును ఇటీవలే మా డ్రైవ్స్పార్క్ బృందం టెస్ట్ డ్రైవ్ చేసింది. - ఈ కారుకు సంబంధించిన పూర్తి సమీక్ష కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.
MOST READ:ఇంటెర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ఇప్పుడు వెరీ సింపుల్.. ఇలా చేయండి