2021లో మెర్సిడెస్ బెంజ్ నుండి 15 కొత్త కార్లు వస్తున్నాయ్..

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ 2021 క్యాలెండర్ ఇయర్‌లో, భారత మార్కెట్ కోసం తన అమ్మకాల వ్యూహాన్ని వెల్లడించింది. ఈ ఏడాది కాలంలో 15 కొత్త మోడళ్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందులో కొన్ని కొత్త మోడళ్లు, మరికొన్ని ఫేస్‌లిఫ్ట్‌లు ఉన్నాయి.

2021లో మెర్సిడెస్ బెంజ్ నుండి 15 కొత్త కార్లు వస్తున్నాయ్..

మెర్సిడెస్ బెంజ్ గడచిన 2020 సంవత్సరంలో 10 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది. కరోనా కారణంగా కోల్పోయిన అమ్మకాలను 2021లో భారీగా పెంచుకోవాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ సంవత్సరంలో విడుదల కానున్న కొత్త బెంజ్ కార్ల జాబితాలో ముందుగా ఎ-క్లాస్ లిమోసిన్ సెడాన్ మార్కెట్లోకి రానుంది.

2021లో మెర్సిడెస్ బెంజ్ నుండి 15 కొత్త కార్లు వస్తున్నాయ్..

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ మొదటిసారిగా 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. మరికొద్ది వారాల్లోనే ఇది మార్కెట్లో విడుదల కానుంది. కేవలం ఎ-క్లాస్ లిమోసిన్ మాత్రమే కాకుండా, మెర్సిడెస్ బెంజ్ ఇండియా మరిన్ని ఇతర మోడళ్లను కూడా ఈ ఏడాది మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.

MOST READ: సరికొత్త 2021 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా లాంచ్ ఎప్పుడంటే?

2021లో మెర్సిడెస్ బెంజ్ నుండి 15 కొత్త కార్లు వస్తున్నాయ్..

వీటిలో కొత్త జిఎల్‌ఎ, కొత్త ఎస్-క్లాస్ మరియు ఫేస్‌లిఫ్టెడ్ ఇ-క్లాస్ మోడళ్లు ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి మెర్సిడెస్ ఎఎమ్‌జి జిటి బ్లాక్ సిరీస్ కూడా భారత తీరాలకు చేరుకోనున్నట్లు ఈ జర్మన్ బ్రాండ్ ధృవీకరించింది.

2021లో మెర్సిడెస్ బెంజ్ నుండి 15 కొత్త కార్లు వస్తున్నాయ్..

భారత్‌లో కొత్తగా ప్రవేశపెట్టబోయే కార్ల గురించి మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ మార్టిన్ ష్వెంక్ మాట్లాడుతూ.. గతేడాది కరోనా మహమ్మారి సృష్టించిన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నామని, కొత్త సంవత్సరం పట్ల తాము ఎంతో ఆశాజనకంగా ఉన్నామని అన్నారు.

MOST READ: పెరిగిన బజాజ్ డొమినార్ బైక్స్ ధరలు; ఏయే మోడల్‌పై ఎంతంటే..

2021లో మెర్సిడెస్ బెంజ్ నుండి 15 కొత్త కార్లు వస్తున్నాయ్..

ఈ ఏడాదిలో 15 కొత్త లేదా పునరుద్ధరించిన (రివైజ్డ్) ఉత్పత్తులు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని, 2021 తమకు ఓ ప్రోడక్ట్ ప్యాక్డ్ ఇయర్ అవుతుందని, ఈ విషయం తమ వినియోగదారులను మరియు డీలర్ భాగస్వాములను మరింత ఉత్సాహపరచగలదని విశ్వసిస్తున్నామని ఆయన చెప్పారు.

2021లో మెర్సిడెస్ బెంజ్ నుండి 15 కొత్త కార్లు వస్తున్నాయ్..

కొత్త సంవత్సరంలో తమ అమ్మకాల వ్యూహాన్ని ప్రకటించడంతో పాటుగా, గడచిన సంవత్సరం ఫలితాలను కూడా కంపెనీ విడుదల చేసింది. గత 2020లో మెర్సిడెస్ బెంజ్, భారత లగ్జరీ కార్ మార్కెట్లో మొత్తం 7893 యూనిట్లను విక్రయించినట్లు పేర్కొంది. గత 2019తో పోలిస్తే 2020 అమ్మకాలు 42 శాతానికి పడిపోయినట్లు కంపెనీ పేర్కొంది.

MOST READ: షాకింగ్ న్యూస్: హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 డిస్‌కంటిన్యూ, వైబ్‌సైట్ నుండి మాయం!

2021లో మెర్సిడెస్ బెంజ్ నుండి 15 కొత్త కార్లు వస్తున్నాయ్..

భారతదేశంలోకి ప్రవేశించిన కరోనా మహమ్మారి కారణంగా మెర్సిడెస్ బెంజ్ ఇండియా, గత 2020 ప్రథమార్థంలో కఠినమైన సమయాన్ని ఎదుర్కొంది. అయితే, ఆ తర్వాత మూడవ త్రైమాసికంలో కంపెనీ 2886 యూనిట్ల అమ్మకాలతో 42 శాతం త్రైమాసికపు అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. ఈ రికవరీ కారణంగా, మెర్సిడెస్ బెంజ్ దేశంలోని లగ్జరీ కార్ల మార్కెట్లో వరుసగా ఆరవ సంవత్సరం కూడా తన ఆధిక్యాన్ని నిలుపుకుంది.

Most Read Articles

English summary
Mercedes Benz India To Launch 15 New Products In 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X