దీపావళి కానుకగా వస్తున్న Mercedes-AMG A45 S హ్యాచ్‌బ్యాక్..

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, ఈ దీపావళి సీజన్ లో ఓ సరికొత్త కారును దేశీయ మార్కెట్లో విడుదల చేయబోతోంది. పెర్ఫార్మెన్స్ వెర్షన్ మెర్సిడెస్-ఏఎమ్‌జి ఏ45 ఎస్ (Mercedes-AMG A45 S)హైపర్ హాట్ హ్యాచ్‌ని కంపెనీ ఈ దీపావళి నాటికి భారతదేశానికి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.

దీపావళి కానుకగా వస్తున్న Mercedes-AMG A45 S హ్యాచ్‌బ్యాక్..

ఆటోకార్ ఇండియా నివేదిక ప్రకారం, Mercedes-AMG A45 S దీపావళి సమయంలో భారతీయ రోడ్లపైకి వస్తుందని తెలుస్తోంది మరియు దీని ధర సుమారు రూ. 75 లక్షలకు (ఎక్స్-షోరూమ్) పైగా ఉంటుందని అంచనా వేయబడింది. ఇది దేశంలో విక్రయించబడే అత్యంత ఖరీదైన హ్యాచ్‌బ్యాక్‌గా కూడా అవతరిస్తుంది.

దీపావళి కానుకగా వస్తున్న Mercedes-AMG A45 S హ్యాచ్‌బ్యాక్..

మెర్సిడెస్ బెంజ్ సంస్థకు ఈ పెర్ఫార్మెన్స్ వెర్షన్ హ్యాచ్‌బ్యాక్ ను భారతదేశంలో అసెంబుల్ చేసే ఆలోచన లేనట్లు తెలుస్తోంది. Mercedes-AMG A45 S హ్యాచ్‌బ్యాక్ కారును కంపెనీ సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్ లో పూర్తిగా విదేశాల్లో తయారైన మోడల్ ను భారత మార్కెట్ కు దిగుమతి చేసుకొని విక్రయించనుంది. ఇది పూర్తిగా ఇంపోర్టెడ్ మోడల్ కావడంతో, అధిక దిగుమతి సుంఖాల కారణంగా దీని ధర కూడా అధికంగా ఉంటుంది.

దీపావళి కానుకగా వస్తున్న Mercedes-AMG A45 S హ్యాచ్‌బ్యాక్..

అయితే, ఈ కారుకు అధిక ధరను చెల్లించినప్పటికీ, దీనిపై వెచ్చించే ప్రతి రూపాయికి మీకు న్యాయం జరుగుతుంది. ఇతర హై-ఎండ్ బెంజ్ కార్లలో లభించే స్పోర్టీనెస్ మరియు లగ్జరీ ఫీల్ ఈ చిన్న కారులో లభిస్తుంది. ఈ AMG A45 S హ్యాచ్‌బ్యాక్ యొక్క బానెట్ కింద ప్రస్తుతం ఉత్పత్తిలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఫోర్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు.

దీపావళి కానుకగా వస్తున్న Mercedes-AMG A45 S హ్యాచ్‌బ్యాక్..

ఈ కారులోని ఇంజన్ 6750 ఆర్‌పిఎమ్ వద్ద 416 బిహెచ్‌పి శక్తిని మరియు 5000 - 5250 ఆర్‌పిఎమ్ మధ్యలో 500 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ట్విన్-స్క్రోల్ టర్బోచార్జర్ ఇంజన్ ఉత్పత్తి చేసే శక్తి మరియు టార్క్ మొత్తం నాలుగు చక్రాలకు ఇందులోని 8 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా సమానంగా పంపిణీ చేయబడుతుంది.

దీపావళి కానుకగా వస్తున్న Mercedes-AMG A45 S హ్యాచ్‌బ్యాక్..

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ Mercedes-AMG A45 S హ్యాచ్‌బ్యాక్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ను కూడా కలిగి ఉంటుంది. ఇది మెర్సిడెస్ బెంజ్ యొక్క సిగ్నేచర్ 4మ్యాటిక్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ మరియు దీని ఎక్కువ పవర్ మరియు టార్క్ గణాంకాల కారణంగా, Mercedes-AMG A45 S కేవలం 3.9 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది.

దీపావళి కానుకగా వస్తున్న Mercedes-AMG A45 S హ్యాచ్‌బ్యాక్..

ఇది మెర్సిడెస్ బెంజ్ యొక్క A35 కంటే సెకనులో ఎనిమిది పదవ వంతు వేగంగా ఉంటుంది. Mercedes-AMG A45 S గరిష్ట వేగం గంటకు 270 కిమీ గా ఉంటుంది. ఇక డిజైన్ పరంగా చూస్తే, A45 S ప్రతిరోజూ వెయిట్ రూమ్‌కి వెళ్లే A-క్లాస్ లాగా కనిపిస్తుంది. పంప్-అప్ వీల్ ఆర్చ్‌లు విశాలమైన 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌కు హోస్ట్‌గా ఉంటాయి.

దీపావళి కానుకగా వస్తున్న Mercedes-AMG A45 S హ్యాచ్‌బ్యాక్..

ఇందులో రేస్ ట్రాక్ కోసం కావాలనుకునే వారికి ఆప్షనల్ పిరెల్లీ ట్రోఫియో R టైర్‌లను కూడా ఎంచుకోవచ్చు. దీని సరికొత్త ఏరో కిట్ మొత్తం డిజైన్ కు మరింత అగ్రెసివ్ రూపాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, ఇది చక్కటి డౌన్‌ఫోర్స్‌ను అందించడంలో కూడా సహకరిస్తుంది.

దీపావళి కానుకగా వస్తున్న Mercedes-AMG A45 S హ్యాచ్‌బ్యాక్..

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, Mercedes-AMG A45 S లోపలివైపు స్టాండర్డ్ A-క్లాస్ లాగా ఉంటుంది. ఇందులో రెండు టచ్‌స్క్రీన్ డిస్ప్లే యూనిట్స్ (ఒకటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం, మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే కోసం), AMG కాక్‌పిట్, ఇంటిగ్రేటెడ్ MBUX కనెక్టివిటీ మరియు టర్బైన్-స్టైల్ ఎయిర్ వెంట్‌లు మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

దీపావళి కానుకగా వస్తున్న Mercedes-AMG A45 S హ్యాచ్‌బ్యాక్..

AMG స్పెసిఫిక్ సెంటర్ కన్సోల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మోడ్, 3-దశల ESP మరియు AMG రైడ్ కంట్రోల్ సస్పెన్షన్ సెటప్ కోసం పూర్తి నియంత్రణ స్విచ్‌లను కలిగి ఉంది. లోపలి భాగంలో ప్రీమియం లెథర్ మరియు మైక్రోఫైబర్‌ తో కూడిన అప్‌హోలెస్ట్రీ ఉంటుంది. తమ ట్రాక్ డ్రైవింగ్‌ ను మెరుగుపరచాలని చూస్తున్న వారికి, AMG ట్రాక్ పేస్ సిస్టమ్ ట్రాక్‌లో మీ పురోగతిని పర్యవేక్షించే సామర్థ్యాన్ని కూడా మీకు అందిస్తుంది.

దీపావళి కానుకగా వస్తున్న Mercedes-AMG A45 S హ్యాచ్‌బ్యాక్..

సిస్టమ్ డ్రైవర్లు ల్యాప్, సెక్టార్ మరియు యాక్సిలరేషన్ సమయాలను మరియు ఎంచుకున్న లైవ్ టెలిమెట్రిక్స్ డేటాను తనిఖీ చేయడానికి అనుమతిస్తుంది, రేస్ ట్రాక్‌ లో వారి డ్రైవింగ్ నైపుణ్యాలను విశ్లేషించడానికి మరియు మెరుగుపరచడానికి వారిని అనుమతిస్తుంది. AMG రైడ్ కంట్రోల్ సిస్టమ్ డ్రైవర్‌ లను వారి A45 Sలో సస్పెన్షన్ సెటప్‌ను సర్దుబాటు చేయడానికి మరియు కంఫర్ట్, స్పోర్ట్ లేదా స్పోర్ట్+ మధ్య ఎంచుకోవడానికి అనుమతిస్తుంది.

దీపావళి కానుకగా వస్తున్న Mercedes-AMG A45 S హ్యాచ్‌బ్యాక్..

సెంటర్ కన్సోల్‌ లో పైన పేర్కొన్న బటన్‌ను నొక్కడం ద్వారా ఇది సెట్ చేయవచ్చు. వినోదం కోసం వెతుకుతున్న వారి కోసం, Mercedes-AMG A45 S డ్రిఫ్ట్ మోడ్‌ ను కూడా కలిగి ఉంది, దీనిని ప్యాడిల్ షిఫ్టర్‌లను ఉపయోగించి యాక్టివేట్ చేయబడినప్పుడు మీరు ఏ సమయంలోనైనా ఈ కారును డ్రిఫ్ట్ చేయవచ్చు.

Most Read Articles

English summary
Mercedes benz india to launch amg a45 s during this diwali details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X