భారత్‌లో విడుదలైన కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్; ధర & పూర్తి వివరాలు

జర్మన్ లగ్జరీ వాహన తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన ఎస్-క్లాస్ సెడాన్ ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త సెడాన్ ప్రారంభ ధర రూ. 2.17 కోట్ల రూపాయలు.

2021 మెర్సిడెస్ ఎస్-క్లాస్ రెండు వేరియంట్లలో అందించబడుతుంది. అవి ఎస్ 400 డి 4 మ్యాటిక్ మరియు ఎస్ 450 4 మ్యాటిక్ వేరియంట్స్. ఎస్ 400 డి 4 మ్యాటిక్ ధర రూ. 2.17 కోట్లు కాగా, ఎస్ 450 4 మ్యాటిక్ వేరియంట్ ధర రూ. 2.19 కోట్లు(ఎక్స్-షోరూమ్). కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్‌కు అనేక కొత్త ఫీచర్లు మరియు పరికరాలతో పాటు లేటెస్ట్ టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది.

2021 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ దాని పాత మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. కానీ చాలా వరకు అప్డేట్ చేయబడి ఉండటాన్ని కూడా గమనించవచ్చు. ఎస్-క్లాస్ కొత్త గ్రిల్‌ను పొందుతుంది, అంతే కాకుండా ఇందులో బంపర్ పునః రూపకల్పన చేయబడి ఉంటుంది. దీనితో పాటు క్రోమ్ లైనింగ్ కూడా చూడవచ్చు.

ఇందులో ఉన్న దాని డిఆర్ఎల్ హెడ్‌ల్యాంప్స్‌లో కొత్త డిజైన్ ఇవ్వబడింది. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ దాని వైపు భాగంలో ఇవ్వబడ్డాయి, చేతిని కారు డోర్ సమీపానికి తీసుకెళ్లినప్పుడు అది బయటకు వస్తుంది. అవసరం లేనప్పుడు లోపల ఉంటుంది. ఇది నిజంగా ఇందులో ఉన్న అద్భుతమైన ఫీచర్ఇ.

మెర్సిడెస్ ఎస్-క్లాస్‌కు 20 ఇంచెస్ కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. ఈ సెడాన్ దాని మునుపటి సెడాన్ కంటే పెద్దదిగా ఉండటంగమనించవచ్చు. ఎస్-క్లాస్ యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 5289 మి.మీ పొడవు, 1954 మి.మీ వెడల్పు, 1503 మి.మీ ఎత్తు మరియు 3216 మి.మీ వీల్‌బేస్ కలిగి ఉటుంది.

ఈ కొత్త ఎస్-క్లాస్‌ దాని మునుపటి మోడల్ కంటే కూడా 34 మిమీ పొడవు, 22 మిమీ వెడల్పు, 12 మిమీ ఎక్కువగా ఉంది. దీనితో పాటు దాని వీల్‌బేస్ మునుపటి కంటే 51 మిమీ ఎక్కువ పొడవు ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 130 మిమీ మరియు బూట్ స్పేస్ 550 లీటర్ల వరకు ఉంది.

మెర్సిడెస్ ఎస్-క్లాస్‌ లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది మాస్కియాటో బీజ్ మరియు సియెన్నా బ్రౌన్ నాప్పా లెదర్ అనే రెండు అప్హోల్స్టరీల కలిగి ఉంది. ఇందులో 12.8-అంగుళాల టచ్‌స్క్రీన్, 12.3-అంగుళాల డిజిటల్ ఎమ్ఐడి, సెకండ్ జనరేషన్ ఎంబియుఎక్స్, వాయిస్ కంట్రోల్స్, ఫింగర్ ప్రింట్ రికగ్నైజర్, రెండవ వరుసలో వెంటిలేటెడ్ సీటు మరియు మసాజ్ ఫంక్షన్, సెంట్రల్ ఆర్మ్‌రెస్ట్‌, 64 కలర్ యాంబియాంట్ లైటింగ్, బర్మీస్టర్ 4 డి సరౌండ్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

ఇక మెర్సిడెస్ ఎస్-క్లాస్‌ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో10 ఎయిర్‌బ్యాగులు, ప్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్, 360-డిగ్రీ కెమెరా, ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, సైడ్ కొలీషియన్ మానిటరింగ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటివి ఉన్నాయి.

కొత్త మెర్సిడెస్ ఎస్-క్లాస్‌ను ఎస్ 450 (పెట్రోల్), ఎస్ 400 డి (డీజిల్) లలో తీసుకువచ్చారు. ఇది 3.0-లీటర్, 6 సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది 367 బిహెచ్‌పి పవర్ మరియు 500 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5.1 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిమీ వరకు ఉంది.

ఇందులోని డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, 3.0 లీటర్ డీజిల్ ఇంజన్ 330 హెచ్‌పి పవర్ మరియు 700 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 5.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ నుండి వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిమీ వరకు ఉంటుంది. దీనికి 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జతచేయబడి ఉంటుంది.

2021 మెర్సిడెస్ ఎస్-క్లాస్ యొక్క ఫుల్లీ లోడెడ్ వెర్షన్ భారతదేశానికి తీసుకురాబడింది. దీనిని కంప్లీట్ బిల్ట్ యూనిట్ ద్వారా భారత మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఇది భారత మార్కెట్లో ఆడి ఎ 8, బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే దేశీయ మార్కెట్లో ఇప్పుడు ఈ కొత్త సెడాన్ కి ఎలాంటి స్పందన వస్తుందో తెలుసుకోవడానికి కొంత కాలం వేచిచూడాలి.

Most Read Articles

English summary
2021 Mercedes-Benz S-Class Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X