మీకు తెలుసా.. రేపు భారత్‌లో విడుదల కానున్న బెంజ్ ఎస్-క్లాస్, ఇదే

ప్రముఖ లగ్జరీ వాహన తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన ఎస్-క్లాస్ సెడాన్ 2021 జూన్ 17 న భారతదేశంలో అధికారికంగా విడుదల చేయనుంది. అయితే కంపెనీ ఈ కారుని విడుదల చేయకముందే ఈ కారు యొక్క టీజర్‌ను విడుదల చేసింది.

రేపు విడుదల కానున్న ఈ కారు కంపెనీ యొక్క 7 వ తరం ఎస్-క్లాస్ కానుంది. కొత్త ఎస్-క్లాస్ యొక్క టీజర్ వీడియోను మెర్సిడెస్ బెంజ్ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేసింది.

మీకు తెలుసా.. రేపు భారత్‌లో విడుదల కానున్న బెంజ్ ఎస్-క్లాస్, ఇదే

మెర్సిడెస్ బెంజ్ విడుదల చేసిన ఈ టీజర్ వీడియోలో, ఎస్-క్లాస్‌ యొక్క 'ఫ్లష్' డోర్ హ్యాండిల్‌ను చూడవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లతే ఎస్-క్లాస్‌లో ఈ రకమైన డోర్ హ్యాండిల్‌ను కంపెనీ మొదటిసారి ఉపయోగించింది. సెన్సార్ల సహాయంతో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ పనిచేస్తాయి. ఇక్కడున్న డోర్ హ్యాండిల్స్ డోర్ మీద కాకుండా డోర్ లోపలి సరిపోయే విధంగా ఉన్నాయి. అయితే మీ చేతిని డోర్ కి దగ్గరగా తీసుకెళ్లినప్పుడు హ్యాండిల్ ఆటోమాటిక్ గా బయటకు వస్తుంది.

మీకు తెలుసా.. రేపు భారత్‌లో విడుదల కానున్న బెంజ్ ఎస్-క్లాస్, ఇదే

కంపెనీ యొక్క మునుపటి మొదలస్ మాదిరిగానే, ఎస్-క్లాస్ కూడా స్థానికంగా సమావేశమవుతుంది. అయితే కొన్ని ప్రారంభ యూనిట్లు మాత్రం దిగుమతి చేసుకోవచ్చు. కంపెనీ ఈ నెలలో మేబాచ్ జిఎల్‌ఎస్ 600 విడుదల తర్వాత విడుదల చేసిన రెండవ కారు ఈ కొత్త ఎస్-క్లాస్.

మీకు తెలుసా.. రేపు భారత్‌లో విడుదల కానున్న బెంజ్ ఎస్-క్లాస్, ఇదే

2021 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 34 మిమీ పొడవు, 51 మిమీ వెడల్పు మరియు 50 మిమీ వీల్‌బేస్‌ కలిగి ఉంటుంది. ఇందులో క్యాబిన్ స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. కావున ఎక్కువ లగేజ్ తీసుకెళ్లడానికి కూడా అనుకూలంగా ఉంటుంది.

మీకు తెలుసా.. రేపు భారత్‌లో విడుదల కానున్న బెంజ్ ఎస్-క్లాస్, ఇదే

ఈ కారు చూడటానికి చాలా కొత్త డిజైన్ కలిగి ఆకర్షణీయయంగా ఉంటుంది. ఇందులోని ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ఇప్పుడు కొత్త డిజిటల్ లైటింగ్ టెక్నాలజీతో వస్తాయి. ఇవి పాత మోడళ్లలో కనిపించే ర్యాపారౌండ్ ఎల్‌ఈడీ టైల్ లైట్స్ స్థానంలో ఉంటాయి.

మీకు తెలుసా.. రేపు భారత్‌లో విడుదల కానున్న బెంజ్ ఎస్-క్లాస్, ఇదే

ఈ కొత్త మోడల్ లోని క్యాబిన్ మునుపటి మోడళ్ల కంటే ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో ప్రధాన ఆకర్షణ కొత్త స్క్రీన్‌ సెట్. ఈ కారుకు డిజిటల్ కన్సోల్‌తో పాటు కేంద్రంలో 12.8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లభిస్తుంది. అంతే కాకుండా స్టీరింగ్ వీల్‌పై కెపాసిటివ్ కంట్రోల్, బర్మెస్టర్ హై-ఎండ్ 4 డి సౌండ్ సిస్టమ్, 263 కి పైగా ఆప్టిక్ ఎల్‌ఇడి లైట్లతో యాంబియంట్ లైటింగ్, వాయిస్ కమాండ్స్ వంటివి ఎన్నో ఉన్నాయి.

ఇందులో మంచి సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. వెనుక ప్రయాణికుల కోసం ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు కలిగి ఉన్న మొట్టమొదటి కారు ఈ కొత్త ఎస్-క్లాస్. ఇది భారత్-స్పెక్ వెర్షన్ కంటే ప్రీ-సేఫ్ ఇంపల్స్ కంట్రోల్, ఇ-యాక్టివ్ బాడీ కంట్రోల్ అడాప్టివ్ సస్పెన్షన్ మరియు లెవల్ 3 అటానమస్ డ్రైవింగ్ సామర్థ్యాలను కూడా పొందుతుంది.

మీకు తెలుసా.. రేపు భారత్‌లో విడుదల కానున్న బెంజ్ ఎస్-క్లాస్, ఇదే

ఈ కొత్త సెడాన్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 3.0-లీటర్ ఇన్-లైన్ సిక్స్-సిలిండర్ పెట్రోల్ మరియు ఈక్యూ బూస్ట్ 48-వోల్ట్ మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో డీజిల్ ఇంజన్ ఉన్నాయి. కొత్త ఎస్-క్లాస్ ఎస్ 450 ఇంజన్ 362 బిహెచ్‌పి పవర్ మరియు 500 ఎన్ఎమ్ టార్క్ తయారు చేయగా, ఎస్ 500 ఇంజన్ 429 బిహెచ్‌పి పవర్ మరియు 520 ఎన్ఎమ్ టార్క్ చేస్తుంది. ఈ ఇంజిన్లు 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి.

Most Read Articles

English summary
New Mercedes-Benz S-Class Teased Ahead Of Launch. Read in Telugu.
Story first published: Wednesday, June 16, 2021, 19:22 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X