Just In
- 11 hrs ago
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
- 14 hrs ago
భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్
- 15 hrs ago
గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్లైన్లోనే..
- 15 hrs ago
కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు
Don't Miss
- News
వేద మంత్రాన్నివింటే లాభమొస్తుందా...ఎలా..?
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Finance
ధరలు ఎలా ఉన్నాయంటే? 44వేలకు దిగొచ్చిన బంగారం, వెండి రూ.66 వేల దిగువన
- Sports
ఆ విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి: మనోజ్ తివారీ
- Movies
‘A’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
EQA ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్యూవీ టీజర్ రిలీజ్ చేసిన మెర్సిడెస్ బెంజ్ ; వివరాలు
భారత ఆటో పరిశ్రమ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన రంగంవైపు తన ద్రుష్టి సారిస్తోంది. ఈ సమయంలో దేశంలో ఉన్న చాలా కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మరియు అమ్మకాలను చేపడుతోంది. ఈ క్రమంలో భాగంగా ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ కూడా ఎలక్ట్రిక్ కార్ల తయారీపై ఎక్కువ ఆసక్తి కనపరుస్తోంది. ఈ కారణంగా, సంస్థ తన కొత్త మెర్సిడెస్ ఇక్యూఎ ఎలక్ట్రిక్ కారును త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలను సిద్ధం చేస్తోంది.

మెర్సిడెస్ బెంజ్ యొక్క కొత్త ఎలక్ట్రిక్ కార్ ఇక్యూఎ ని 2021 జనవరి 20 న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించనుంది. మార్చి నాటికి మెర్సిడెస్ ఇక్యూఎ ఎలక్ట్రిక్ కారును యూరోపియన్ మార్కెట్లలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కూడా కంపెనీ తెలిపింది.

కంపెనీ ఇటీవల తన కొత్త ఎలక్ట్రిక్ కార్ యొక్క కొత్త టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్లో ఈ కారు లోపలి భాగంలో ఉన్న ఒక స్కెచ్‌ను మనం చూడవచ్చు. ఈ టీజర్ ఫోటో రాబోయే కారు యొక్క లోపలి భాగంలో ఉన్న కొంత సమాచారాన్ని తెలియజేస్తుంది.
MOST READ:ఫలించిన కల; భారత్‌లో ప్రారంభమైన ఎయిర్ టాక్సీ సర్వీస్

కొత్త ఇక్యూఎ సంస్థ యొక్క జిఎల్ఏ ఎస్యూవీ పై ఆధారపడి ఉంటుంది. దీనితో పాటు ఈ కారును జిఎల్ఏ నిర్మించబడిన అదే నిర్మాణంపై నిర్మించారు. ఈ కాన్సెప్ట్ కారును 2019 ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో ప్రదర్శించారు. రానున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ కార్ చాలా అద్భుతంగా ఉంటుందని ఈ టీజర్ ద్వారా ఊహించవచ్చు.

ఈ ఎస్‌యూవీలో ట్విన్ ఎలక్ట్రిక్ మోటారు ఉంది. ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో కంపెనీ ఈ కారును అందించనుంది. ప్రస్తుతం, దాని ఉత్పత్తి పవర్ మొదలైన వాటి గురించి కచ్చితంగా తెలియదు, కానీ దాని కాన్సెప్ట్ మోడల్ 267 బిహెచ్పి శక్తిని అందిస్తుంది.
MOST READ:కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!

ఇక కొత్త బెంజ్ ఎలక్ట్రిక్ కార్ యొక్క పరిధి విషయానికి వస్తే, ఈ కారు పూర్తిగా ఛార్జ్ చేసిన తరువాత సుమారు 400 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇక్యూసి మాదిరిగానే, కొత్త ఇక్యూసి యొక్క రూపకల్పన దాని ఐసిఇ వేరియంట్ జిఎల్ఏ మాదిరిగా ఉంటుందని భావిస్తున్నారు.

ఈ ఎలక్ట్రిక్ కారులో కొత్తగా అప్డేట్ చేయబడిన గ్రిల్ మరియు ఫాన్సీ డిఆర్ఎల్ లను కలిగి ఉంటుంది. కంపెనీ కూడా దాని వెనుక భాగంలో చాలా మార్పులు చేసింది. వెనుక భాగంలో, నంబర్ ప్లేట్ దాని బంపర్‌పై అమర్చబడి ఉండగా, జిఎల్ఎలో నంబర్‌ప్లేట్ టెయిల్‌గేట్‌పై అమర్చబడి ఉంటుంది.
MOST READ:ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎవరో తెలుసా!

దీనికి సంబంధించిన ఇతర సమాచారం ప్రకారం, కొత్త ఇక్యూసి యొక్క లోపలి భాగం సంస్థ యొక్క జిఎల్ఏ ఎస్యూవీ లాగానే ఉంటుంది. మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎలో చక్కని మరియు క్రమబద్ధమైన క్యాబిన్ అందిస్తుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కార్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా మంచి అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.