2022 AMG GT 4-డోర్ కూపే ఫేస్‌లిఫ్ట్‌ ఆవిష్కరించిన మెర్సిడెస్ బెంజ్; వివరాలు

జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన కొత్త 2022 మెర్సిడెస్-ఎఎమ్‌జి జిటి 4 డోర్ కూపే ఫేస్‌లిఫ్ట్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త ఫేస్ లిఫ్ట్ కొత్త ఫీచర్లు మరియు కొన్ని కొత్త కలర్ ఆప్షన్లతో విడుదల కానుంది. ఈ కొత్త కారు చాలా వరకు అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

2022 AMG GT 4-డోర్ కూపే ఫేస్‌లిఫ్ట్‌ ఆవిష్కరించిన మెర్సిడెస్ బెంజ్; వివరాలు

మెర్సిడెస్-ఎఎమ్‌జి జిటి 4 డోర్ కూపే వైడ్‌స్క్రీన్ కాక్‌పిట్ కలిగి ఉంటుంది. ఇందులో ఫేస్‌లిఫ్ట్ కార్ డ్రైవింగ్ అసిస్ట్ మరియు ఎమ్‌బియుఎక్స్ మల్టీమీడియా సిస్టమ్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో విస్తృత చక్రాలతో పాటు, 5 ట్విన్ స్పోక్ డిజైన్‌తో 20 ఇంచెస్ లైట్ అల్లాయ్ వీల్స్ లేదా 21 ఇంచెస్ ఫోర్జెడ్ వీల్స్ ఉన్నాయి.

2022 AMG GT 4-డోర్ కూపే ఫేస్‌లిఫ్ట్‌ ఆవిష్కరించిన మెర్సిడెస్ బెంజ్; వివరాలు

కొత్త మెర్సిడెస్ ఎఎమ్‌జి జిటి 53 4-డోర్ కూపే కారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంది. ఇది మూడు కొత్త కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటాయి. అవి స్టార్లింగ్ బ్లూ మెటాలిక్, స్టార్లింగ్ బ్లూ మాగ్నో మరియు కాశ్మిర్ వైట్ మాగ్నో కలర్స్.

2022 AMG GT 4-డోర్ కూపే ఫేస్‌లిఫ్ట్‌ ఆవిష్కరించిన మెర్సిడెస్ బెంజ్; వివరాలు

2022 మెర్సిడెస్ ఎఎమ్‌జి జిటి 4-డోర్ కూపేలో గమనించదగ్గ పెద్ద మార్పు ఏమిటంటే, ఇప్పుడు మునుపటి జిటి 4-డోర్ మోడల్‌లో నలుగురికి బదులుగా ఐదుగురికి వసతి కల్పించగలదు.

2022 AMG GT 4-డోర్ కూపే ఫేస్‌లిఫ్ట్‌ ఆవిష్కరించిన మెర్సిడెస్ బెంజ్; వివరాలు

ఈ కొత్త కారులో సెంటర్ కన్సోల్ తొలగించబడినందున వెనుక భాగంలో ముగ్గురు వ్యక్తులు కూర్చునే బెంచ్ సీటుతో కొత్త మోడల్ వస్తుంది. ఇప్పుడు ఈ కొత్త కారు యొక్క బెంచ్ సీటును పూర్తిగా ఫోల్డ్ చేయవచ్చు. ఇందులో ఉన్న క్యాబిన్ యాచ్ బ్లూ మరియు డీప్ వైట్‌తో సహా కొత్త కలర్ ఆప్సన్స్ లోపలి భాగంలో చూడవచ్చు.

2022 AMG GT 4-డోర్ కూపే ఫేస్‌లిఫ్ట్‌ ఆవిష్కరించిన మెర్సిడెస్ బెంజ్; వివరాలు

ఈ కారు మొదటి ఇ-పెర్ఫార్మెన్స్ హైబ్రిడ్లను కూడా పొందుతుంది. 2022 మెర్సిడెస్-ఎఎమ్‌జి 3 లో 4-డోర్స్ మోడల్ మాదిరిగానే 3.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇన్లైన్-సిక్స్ ఇంజన్ ఉంది. ఇంజిన్ గరిష్టంగా 367 బిహెచ్‌పిని ఉత్పత్తి చేయగలదు. జిటి 53 మోడల్‌లోని ఇంజిన్ 435 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ మెర్సిడెస్ 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

2022 AMG GT 4-డోర్ కూపే ఫేస్‌లిఫ్ట్‌ ఆవిష్కరించిన మెర్సిడెస్ బెంజ్; వివరాలు

మెర్సిడెస్ బెంజ్ యొక్క ఈ కొత్త కారును ఈ ఏడాది చివర్లో అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ కొత్త వేరియంట్ భారత మార్కెట్లో విడుదల చేస్తుందా, లేదా అనే దానిపై ఎటువంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు.

Most Read Articles

English summary
2022 Mercedes-AMG GT 53 4-Door Coupe Unveiled. Read in Telugu.
Story first published: Tuesday, June 15, 2021, 15:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X