Just In
- 2 hrs ago కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 5 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
- 7 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 15 hrs ago మారుతి స్విఫ్ట్ ధరలు పెరిగాయండోయ్!.. ఇప్పుడే తెలుసుకోండి
Don't Miss
- News చిలుకూరు బాలాజీ ఆలయానికి గరుడ ప్రసాదం కోసం భక్తుల రష్.. అసలేమిటీ గరుడ ప్రసాదం?
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్‌కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Sports ఐపీఎల్లో అదరగొడుతున్న అన్ క్యాప్డ్ ప్లేయర్లు వీళ్లే..
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
2022 AMG GT 4-డోర్ కూపే ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించిన మెర్సిడెస్ బెంజ్; వివరాలు
జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన కొత్త 2022 మెర్సిడెస్-ఎఎమ్‌జి జిటి 4 డోర్ కూపే ఫేస్‌లిఫ్ట్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త ఫేస్ లిఫ్ట్ కొత్త ఫీచర్లు మరియు కొన్ని కొత్త కలర్ ఆప్షన్లతో విడుదల కానుంది. ఈ కొత్త కారు చాలా వరకు అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.
మెర్సిడెస్-ఎఎమ్‌జి జిటి 4 డోర్ కూపే వైడ్‌స్క్రీన్ కాక్‌పిట్ కలిగి ఉంటుంది. ఇందులో ఫేస్‌లిఫ్ట్ కార్ డ్రైవింగ్ అసిస్ట్ మరియు ఎమ్‌బియుఎక్స్ మల్టీమీడియా సిస్టమ్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్లో విస్తృత చక్రాలతో పాటు, 5 ట్విన్ స్పోక్ డిజైన్‌తో 20 ఇంచెస్ లైట్ అల్లాయ్ వీల్స్ లేదా 21 ఇంచెస్ ఫోర్జెడ్ వీల్స్ ఉన్నాయి.
కొత్త మెర్సిడెస్ ఎఎమ్‌జి జిటి 53 4-డోర్ కూపే కారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంది. ఇది మూడు కొత్త కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటాయి. అవి స్టార్లింగ్ బ్లూ మెటాలిక్, స్టార్లింగ్ బ్లూ మాగ్నో మరియు కాశ్మిర్ వైట్ మాగ్నో కలర్స్.
2022 మెర్సిడెస్ ఎఎమ్‌జి జిటి 4-డోర్ కూపేలో గమనించదగ్గ పెద్ద మార్పు ఏమిటంటే, ఇప్పుడు మునుపటి జిటి 4-డోర్ మోడల్లో నలుగురికి బదులుగా ఐదుగురికి వసతి కల్పించగలదు.
ఈ కొత్త కారులో సెంటర్ కన్సోల్ తొలగించబడినందున వెనుక భాగంలో ముగ్గురు వ్యక్తులు కూర్చునే బెంచ్ సీటుతో కొత్త మోడల్ వస్తుంది. ఇప్పుడు ఈ కొత్త కారు యొక్క బెంచ్ సీటును పూర్తిగా ఫోల్డ్ చేయవచ్చు. ఇందులో ఉన్న క్యాబిన్ యాచ్ బ్లూ మరియు డీప్ వైట్‌తో సహా కొత్త కలర్ ఆప్సన్స్ లోపలి భాగంలో చూడవచ్చు.
ఈ కారు మొదటి ఇ-పెర్ఫార్మెన్స్ హైబ్రిడ్లను కూడా పొందుతుంది. 2022 మెర్సిడెస్-ఎఎమ్‌జి 3 లో 4-డోర్స్ మోడల్ మాదిరిగానే 3.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇన్లైన్-సిక్స్ ఇంజన్ ఉంది. ఇంజిన్ గరిష్టంగా 367 బిహెచ్‌పిని ఉత్పత్తి చేయగలదు. జిటి 53 మోడల్లోని ఇంజిన్ 435 బిహెచ్పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ మెర్సిడెస్ 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.
మెర్సిడెస్ బెంజ్ యొక్క ఈ కొత్త కారును ఈ ఏడాది చివర్లో అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ కొత్త వేరియంట్ భారత మార్కెట్లో విడుదల చేస్తుందా, లేదా అనే దానిపై ఎటువంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు.