జూన్ 8 న భారత్‌లో అరంగేట్రం చేయనున్న కొత్త మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ GLS600

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన కొత్త మేబాక్ జిఎల్‌ఎస్600 ఎస్‌యూవీని దేశీయ మార్కెట్లో 2021 జూన్ 08 న అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక టీజర్ వీడియో కూడా కంపెనీ ఇటీవల విడుదల చేసింది. కొత్త మెర్సిడెస్ బెంజ్ మేబాక్ జిఎల్‌ఎస్ 600 గురించి ఈ టీజర్ వీడియో ద్వారా మరింత సమాచారం తెలుసుకోవచ్చు.

జూన్ 8 న భారత్‌లో అరంగేట్రం చేయనున్న కొత్త మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ GLS600

మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ జిఎల్‌ఎస్ 600 అనేది అనేది మెర్సిడెస్ బెంజ్ యొక్క ఆల్ట్రా లగ్జరీ కార్. ఇది మెర్సిడెస్-మేబాచ్ లైనప్ నుండి వస్తున్న మొట్టమొదటి ఎస్‌యూవీ ఈ జిఎల్‌ఎస్ 600. దీనిని తొలిసారిగా 2019లో ఆవిష్కరించారు. మెర్సిడెస్-మేబాచ్ జిఎల్ఎస్ 600 భారత మార్కెట్లోకి రాబోతున్న కంపెనీ యొక్క కొత్త వేరియంట్ అవుతుంది.

జూన్ 8 న భారత్‌లో అరంగేట్రం చేయనున్న కొత్త మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ GLS600

మెర్సిడెస్-మేబాచ్ జిఎల్‌ఎస్ 600 కంప్లీట్లీ బిల్ట్-అప్ యూనిట్‌లుగా ఇండియా తీరాలకు చేరుకోనుంది. దీని వల్ల ఇది భారీ ధరను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. కంపెనీ ఇటీవల భారత మార్కెట్ కోసం కొత్త రిటైల్ అమ్మకాల నమూనాను ప్రకటించింది. ఇకపై దేశంలోని డీలర్‌షిప్‌లకు స్టాక్స్, ధర మరియు తగ్గింపులపై నియంత్రణ ఉండదు.

MOST READ:ఇకపై హెల్మెట్స్ వినియోగంపై కొత్త రూల్స్.. అవేంటో ఇక్కడ చూడండి

జూన్ 8 న భారత్‌లో అరంగేట్రం చేయనున్న కొత్త మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ GLS600

జిఎల్‌ఎస్ 600 చాలా అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది మరింత లగ్జరీ అనుభవాన్ని అందించడానికి బెస్పోక్ పరికరాలు మరియు సాఫ్ట్ మెటీరియల్స్ వంటివి కలిగి ఉంటుంది. జిఎల్‌ఎస్ 600 యొక్క వెలుపలి భాగంలో వర్టికల్-స్లాట్ గ్రిల్‌తో సహా క్రోమ్ అధికంగా ఉంటుంది. ఇది దాని పిల్లర్ పై మేబాచ్ లోగోను కూడా కలిగి ఉంది.

జూన్ 8 న భారత్‌లో అరంగేట్రం చేయనున్న కొత్త మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ GLS600

కొత్త మెర్సెడెస్ మేబాచ్ జిఎల్‌ఎస్ 600 యొక్క ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో దాని స్టాండర్డ్ మోడల్ లో కనిపించే మూడవ-వరుస సీటింగ్‌ను కోల్పోతుంది. ఇది రెండు పవర్ ఆపరేటింగ్ రెక్లైనింగ్ సీట్లను కలిగి ఉంటుంది. ఈ సీట్లలో వెంటిలేషన్ మరియు మసాజ్ ఫంక్షన్లు కూడా ఉన్నాయి. మిగిలిన క్యాబిన్ రిఫ్రిజిరేటర్, ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ల వంటి మరెన్నో అప్డేటెడ్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

MOST READ:ఫస్ట్ టైమ్ కార్ డ్రైవ్ చేయడానికి సిద్దమైన కుమార్తెతో తండ్రి ఫన్నీ [వీడియో]

జూన్ 8 న భారత్‌లో అరంగేట్రం చేయనున్న కొత్త మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ GLS600

మెర్సిడెస్-మేబాచ్ జిఎల్‌ఎస్ 600 యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 4.0-లీటర్ వి 8 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 6000 ఆర్‌పిఎమ్ మరియు 65000 ఆర్‌పిఎమ్ మధ్య గరిష్టంగా 550 బిహెచ్‌పి మరియు 2500 ఆర్‌పిఎమ్ మరియు 35000 ఆర్‌పిఎమ్ మధ్య 730 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 21 బిహెచ్‌పి మరియు 249 ఎన్ఎమ్ టార్క్న అందించే ఇంటిగ్రేటెడ్ EQ బూస్ట్ స్టార్టర్-జనరేటర్ కూడా కలిగి ఉంది.

జూన్ 8 న భారత్‌లో అరంగేట్రం చేయనున్న కొత్త మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ GLS600

ఈ కారులోని ఇంజన్ 9 జి-ట్రోనిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు జతచేయబడి ఉంటుంది మరియు ఇది ఇంజన్ నుండి వచ్చే శక్తిని నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది. మేబాక్ జిఎల్‌ఎస్ 600 కేవలం 4.9 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది మరియు ఈ కారు గరిష్ట వేగాన్ని యాంత్రికంగా గంటకు 250 కిలోమీటర్లకు మాత్రమే పరిమితం చేశారు.

MOST READ:దిశా పటాని & టైగర్ ష్రాఫ్‌పై ఎఫ్‌ఐఆర్‌ బుక్ చేసిన ముంబై పోలీసులు.. కారణం ఇదే

జూన్ 8 న భారత్‌లో అరంగేట్రం చేయనున్న కొత్త మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ GLS600

మెర్సిడెస్ బెంజ్ తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ అయిన జిఎల్‌ఎస్ 600 మేబాచ్‌ను భారత మార్కెట్లో త్వరలో విడుదల చేయనుంది. మెర్సిడెస్-మేబాచ్ జిఎల్‌ఎస్ 600 భారతమార్కెట్లో విడుదలైన తరువాత బెంట్లీ బెంటాయగా మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 7 డార్క్ షాడోకు ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
2021 Mercedes-Maybach GLS600 India Launch On June 8. Read in Telugu.
Story first published: Friday, June 4, 2021, 9:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X