YouTube

భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ మాస్ట్రో ఎడిషన్ లాంచ్ : ధర & పూర్తి వివరాలు

జర్మనీ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ కొత్త ఎస్-క్లాస్ 'మాస్ట్రో' ఎడిషన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ మాస్ట్రో ఎడిషన్ ధర రూ. 1.51 కోట్ల రూపాయలు, (ఎక్స్-షోరూమ్, ఇండియా). భారతమార్కెట్లో లాంచ్ అయిన ఈ కొత్త బెంజ్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో మెర్సిడెస్ ఎస్-క్లాస్ మాస్ట్రో ఎడిషన్ లాంచ్ : ధర & పూర్తి వివరాలు

ఈ కొత్త బెంజ్ ఎస్ క్లాస్ మాస్ట్రో ఎడిషన్ ఇప్పుడు కొత్త ఎక్స్టీరియర్ పెయింట్ స్కీమ్, రివైజ్డ్ ఇంటీరియర్ తో పాటు కొత్త కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీతో వస్తుంది. ఎస్-క్లాస్ యొక్క కొత్త మాస్ట్రో ఎడిషన్ లేటెస్ట్ వెర్షన్ 'మెర్సిడెస్ మి కనెక్ట్' టెక్నాలజీని కలిగి ఉన్న మొట్టమొదటి మెర్సిడెస్ బెంజ్ ప్రోడక్ట్. ఇది ఇప్పుడు హోమ్ ఇంటిగ్రేషన్ మరియు వాయిస్ అసిస్టెన్స్ తో వస్తుంది.

భారత్‌లో మెర్సిడెస్ ఎస్-క్లాస్ మాస్ట్రో ఎడిషన్ లాంచ్ : ధర & పూర్తి వివరాలు

"మెర్సిడెస్ బెంజ్ మి కనెక్ట్" టెక్నాలజీపై హోమ్ ఇంటిగ్రేషన్ అలెక్సా లేదా గూగుల్ ఇంటిగ్రేషన్ ద్వారా చేయవచ్చు. హోమ్ ఇంటిగ్రేషన్ టెక్నాలజీ, స్మార్ట్‌ఫోన్‌లను కూడా ఉపయోగించకుండా, వెహికల్ స్టేటస్ ని చెక్ చేయవచ్చు. అంతే కాకుండా ఇది వాహనదారునికి ఇతర ఫంక్షనాలిటీస్ నిర్వహించడానికి కూడా ఉపయోగపడుతుంది.

MOST READ:రూ. 24 లక్షలతో బైక్ కొన్న మలయాళీ స్టార్.. ఎవరో చూసారా..!

భారత్‌లో మెర్సిడెస్ ఎస్-క్లాస్ మాస్ట్రో ఎడిషన్ లాంచ్ : ధర & పూర్తి వివరాలు

ఎస్-క్లాస్ మాస్ట్రో ఎడిషన్ సెలూన్ లో బ్రాండ్ యొక్క కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ యొక్క నావిగేషన్ సిస్టమ్‌లో పార్కింగ్ సొల్యూషన్స్ (పిఒఐ) ను కూడా అందిస్తుంది. ఇది నగరంలోని వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న అన్ని పార్కింగ్ స్థలాలను తెలియజేస్తుంది. ఇన్ బిల్ట్ నావిగేషన్ సిస్టమ్‌ను ఉపయోగించి లేదా మెర్సిడెస్ మి యాప్ ద్వారా పిఓఐ (పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్స్) ను గుర్తించవచ్చు.

భారత్‌లో మెర్సిడెస్ ఎస్-క్లాస్ మాస్ట్రో ఎడిషన్ లాంచ్ : ధర & పూర్తి వివరాలు

కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ మాస్ట్రో ఎడిషన్ ఇప్పుడు బ్రాండ్ యొక్క మ్యాజిక్ స్కై కంట్రోల్‌తో పనోరమిక్ సన్‌రూఫ్‌తో అందించబడుతుంది. ఇది మెమరీ ప్యాకేజీతో ముందు సీట్లను కూడా కలిగి ఉంది, ఇంటీరియర్స్ ఇప్పుడు కొత్త హై-గ్లోస్ బ్రౌన్ యూకలిప్టస్ వుడ్ ట్రిమ్‌లో పూర్తయ్యాయి.

MOST READ:లిమోసిన్ కారుగా మారిన మారుతి వ్యాగన్ ‌ఆర్.. ఎలా అనుకుంటున్నారా.. ఇది చూడండి

భారత్‌లో మెర్సిడెస్ ఎస్-క్లాస్ మాస్ట్రో ఎడిషన్ లాంచ్ : ధర & పూర్తి వివరాలు

ఈ కారులో మల్టీబీమ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, అల్ట్రా రేంజ్ హై బీమ్, అలాగే బర్మెస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ రియర్ సీట్, మెమరీ ఫంక్షన్, రియర్ సీట్ కంఫర్ట్ ప్యాకేజీ, వైర్‌లెస్ ఛార్జింగ్ సిస్టమ్‌ వంటివి ఇందులో ఉంటాయి.

భారత్‌లో మెర్సిడెస్ ఎస్-క్లాస్ మాస్ట్రో ఎడిషన్ లాంచ్ : ధర & పూర్తి వివరాలు

ఇప్పడు కారు యొక్క వెలుపలి భాగంలో కొత్త పెయింట్ స్కీమ్ లభిస్తుంది, దీనిని ఆంత్రాసైట్ బ్లూ అని పిలుస్తారు. కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ మాస్ట్రో ఎడిషన్ సెలూన్ యొక్క ఎస్ 350 డి వేరియంట్ ఆధారంగా రూపొందించబడింది. ఇక మెకానికల్ గా మాస్ట్రో ఎడిషన్ స్టాండర్డ్ మోడల్‌తో సమానంగా ఉంటుంది.

MOST READ:హోరాహోరీగా సాగిన 2021 డాకర్ ర్యాలీ స్టేజ్ 2 ; ఫలితాలు ఇవే

భారత్‌లో మెర్సిడెస్ ఎస్-క్లాస్ మాస్ట్రో ఎడిషన్ లాంచ్ : ధర & పూర్తి వివరాలు

ఈ కొత్త బెంజ్ ఎస్ క్లాస్ మాస్ట్రోలో అదే 3.0-లీటర్ ఇన్-లైన్ సిక్స్-సిలిండర్ డీజిల్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 286 బిహెచ్‌పి మరియు 600 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ యూనిట్ కి జతచేయబడి ఉంటుంది.

భారత్‌లో మెర్సిడెస్ ఎస్-క్లాస్ మాస్ట్రో ఎడిషన్ లాంచ్ : ధర & పూర్తి వివరాలు

ఈ కొత్త వెర్షన్ లగ్జరీ సెలూన్ కేవలం 6.0 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వరకు వేగవంతం అవుతుంది. అంతే కాకుండా దీని గరిష్ట వేగం గంటకు 250 కి.మీ. మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ భారత మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్, ఆడి ఎ 8 ఎల్ మరియు జాగ్వార్ ఎక్స్‌జె వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

MOST READ:లవ్‌బర్డ్ ; భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ కార్.. మీరు చూసారా..!

Most Read Articles

English summary
Mercedes-Benz S-Class Maestro Edition Launched In India. Read in Telugu.
Story first published: Wednesday, January 6, 2021, 9:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X