MG Astor యాక్ససరీస్ వాటి ధరలు.. ఇక్కడ చూడండి

భారతీయ మార్కెట్లో MG Motor (ఎంజి మోటార్) యొక్క కొత్త MG Astor (ఎంజి ఆస్టర్) రూ. 9.78 లక్షల ప్రారంభ ధర వద్ద విడుదలైంది. ఇందులో దాని టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 17.38 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ కొత్త SUV కోసం ఈ నెల 21 నుంచి బుకింగ్స్ అధికారికంగా ప్రారంభించింది.

MG Astor యాక్ససరీస్ వాటి ధరలు.. ఇక్కడ చూడండి

కంపెనీ ఈ ఆధునిక SUV స్టైల్, సూపర్, స్మార్ట్ మరియు షార్ప్ అనే నాలుగు ట్రిమ్‌లలో లాంచ్ చేసింది, ఆ తర్వాత ఇటీవలే ఇందులో ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో కొత్త టాప్-స్పెక్ వేరియంట్ శావీని విడుదల చేసింది. ఎమ్‌జి ఆస్టర్ శావీ ట్రిమ్ ప్రారంభ ధర రూ. 15.78 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

MG Astor యాక్ససరీస్ వాటి ధరలు.. ఇక్కడ చూడండి

ఇదిలా ఉండగా కంపెనీ ఇప్పుడు ఈ SUV యొక్క యాక్ససరీస్ విడుదల చేసింది. కంపెనీ ఈ MG Astor కోసం మొత్తం 70 యాక్ససరీస్ పరిచయం చేసింది. వాహన వినియోగదారులు ఇప్పుడు ఈ యాక్ససరీస్ పొంది, తమ వాహనాన్ని మరింత దూకుడుగా చేసుకోవచ్చు. ఇదివరకే కంపెనీ మడ్ ఫ్లాప్‌లు, కార్ కవర్లు, 3డి ఫ్లోర్ మ్యాట్‌లు మరియు టచ్‌స్క్రీన్ కోసం స్క్రీన్‌గార్డ్‌ వంటి వాటిని పరిచయం చేసింది.

MG Astor యాక్ససరీస్ వాటి ధరలు.. ఇక్కడ చూడండి

కంపెనీ విడుదల చేసిన మొత్తం యాక్ససరీలు మరియు వాటి ధరలను మీరు ఈ కింద గమనించవచ్చు.

Accessories Price
Mudflaps Rs 499
Black bumper corner protector Rs 1,099
Chrome bumper corner protector Rs 1,299
Chrome outside door handle Rs 1,749
Front fog lamp chrome garnish Rs 1,299
Rear fog lamp chrome garnish Rs 1,350
Headlamp chrome garnish Rs 1,749
ORVM chrome garnish Rs 899
Tail lamp chrome garnish Rs 1,599
Tailgate chrome garnish Rs 1,499
Wheel arch chrome garnish Rs 3,999
Front lower chrome surround Rs 1,199
Black body side moulding Rs 2,399
Chrome body side moulding Rs 2,999
Chrome door visor Rs 2,799
Door visor Rs 2,299
Boot sill guard Rs 1,599
Door sill guard Rs 1,659
Black tail lamp connector Rs 1,299
Chrome tail lamp connector Rs 1,799
Car cover Rs 1,980 to Rs 4,299
Spoiler extension Rs 3,099
Rear bull bar Rs 3,999
Door edge guard Rs 1,799
Hood scoop Rs 3,799
Side scoop Rs 3,399
Illuminated wheel hub Rs 5,999
Chrome/Black hood lettering Rs 1,374
Fuel lid garnish Rs 1,849
Sidestep board Rs 16,140
Paint protection coating Rs 5,685
Exhaust finisher Rs 2,499
Puddle lamps Rs 3,999
360-degree camera Rs 13,909
Body graphics Rs 2,399
Bicycle carrier Rs 6,762
Chrome cleaning kit Rs 375
Car care kit Rs 599
Tyre inflator Rs 3,228
Jumper cable Rs 2,062
Emergency car kit Rs 5,018
MG Astor యాక్ససరీస్ వాటి ధరలు.. ఇక్కడ చూడండి

కొత్త MG Astor అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. దీని ముందు భాగంలో గ్రిల్ మరియు ఎల్ఈడీ హెడ్‌లైట్ వంటివి ఉన్నాయి. దాని క్రింద ఫాగ్ లైట్స్ ఉన్నాయి, దీనితో పాటు బంపర్‌పై లైన్‌లు కూడా ఇవ్వబడ్డాయి, కావున ఇది మంచి దూకుడు రూపాన్ని అందుకుంటుంది.

ఆస్టర్ యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇది 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది, కావున చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది, అలాగే ఇండికేటర్‌తో పాటు ORVM లో చూడవచ్చు. ఈ కారు యొక్క గ్రిల్ భాగంలో 360 డిగ్రీ కెమెరా మరియు పార్కింగ్ కెమెరా వంటి వాటిని పొందుతుంది. మొత్తానికి ఇది మంచి డిజైన్ కలిగి ఉంటుంది.

MG Astor యాక్ససరీస్ వాటి ధరలు.. ఇక్కడ చూడండి

ఇక ఈ కొత్త SUV యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, 7 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మరియు ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్స్ పొందుతుంది.

MG Astor యాక్ససరీస్ వాటి ధరలు.. ఇక్కడ చూడండి

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త ఆస్టర్ 14 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో తీసుకువచ్చిన బ్రాండ్ యొక్క మొట్టమొదటి కారు. ఇది పర్సనల్ అసిస్టెంట్ సిస్టమ్ సహాయంతో కారులో ఇవ్వబడుతుంది. కావున ఇది మీ ఆదేశాలను వింటుంది. అంతే కాకుండా దీని ద్వారా మ్యూజిక్ ప్లే చేయవచ్చు, ఫోన్ కాల్స్ తీసుకోవచ్చు.

MG Astor యాక్ససరీస్ వాటి ధరలు.. ఇక్కడ చూడండి

కంపెనీ దేశీయ మార్కెట్లో ఈ కొత్త Astor SUV ని స్పైస్డ్ ఆరెంజ్, అరోరా సిల్వర్, గ్లేజ్ రెడ్, క్యాండీ వైట్ మరియు స్టార్రీ బ్లాక్ అనే 5 కలర్ ఆప్సన్స్ లో తీసుకువచ్చింది.

MG Astor ఎస్‌యూవీ రెండు ఇంజన్ ఆప్షన్‌ లతో అందుబాటులోకి రానుంది. వీటిలో మొదటిది 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. రెండవది 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్

MG Astor యాక్ససరీస్ వాటి ధరలు.. ఇక్కడ చూడండి

ఇందులోని 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 138 బిహెచ్‌పి పవర్ ను మరియు 220 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో జత చేయబడి ఉంటుంది. ఇక 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 108 బిహెచ్‌పి పవర్ మరియు 144 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ మరియు 8-స్పీడ్ సివిటి గేర్‌బాక్స్‌తో వస్తుంది.

MG Astor యాక్ససరీస్ వాటి ధరలు.. ఇక్కడ చూడండి

కొత్త MG Astor మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీ కెమెరా, రియర్ డ్రైవ్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి 27 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటుంది. మొత్తానికి ఈ ఆధునిక SUV ఆధునిక పరికరాలను కలిగి ఉండి చాలా అద్భుతంగా ఉంది.

Most Read Articles

English summary
Mg astor accessories range launched details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X