MG Astor బుకింగ్స్ షురూ... బుకింగ్ అమౌంట్ రూ. 21,000 మాత్రమే !

చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ ఇండియా (MG Motor India) తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఎమ్‌జి ఆస్టర్ (MG Astor) కోసం కంపెనీ నేటి (అక్టోబర్ 21, 2021వ తేదీ) నుండి అధికారికంగా బుకింగ్ లను ప్రారంభించింది. ఆసక్తిగల కస్టమర్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి కానీ లేదా డీలర్‌షిప్ ను కానీ సంప్రదించి రూ. 21,000 అడ్వాన్స్‌తో బుక్ చేసుకోవచ్చు.

MG Astor బుకింగ్స్ షురూ... బుకింగ్ అమౌంట్ రూ. 21,000 మాత్రమే !

కంపెనీ ఈ కారు యొక్క ప్రీ-రిజర్వేషన్‌ని లాంచ్ చేయడంతో ప్రారంభించింది, కాగా, ఇప్పుడు ఈ మోడల్ కోసం అధికారిక బుకింగ్ లను ప్రారంభించింది. డెలివరీల విషయానికి వస్తే, ఈ సంవత్సరం నవంబర్ - డిసెంబర్ కాలంలో మొదటి బ్యాచ్‌ లో భాగంగా సుమారు 5,000 యూనిట్లను డెలివరీ చేయాలని కంపెనీ భావిస్తోంది. మొదటి 5,000 యూనిట్లు కూడా ప్రారంభ పరిచయ ధర (ఇంట్రడక్టరీ ప్రైస్) తో లభ్యం కానున్నాయి.

MG Astor బుకింగ్స్ షురూ... బుకింగ్ అమౌంట్ రూ. 21,000 మాత్రమే !

షెడ్యూల్ చేసిన 5,000 యూనిట్లు డెలివరీ అయిన తర్వాత, ఈ కారు పరిచయ ధరను పెంచడం జరుగుతుంది. ప్రస్తుతం, కొత్త ఎమ్‌జి ఆస్టర్ ధరలు రూ. 9.78 లక్షల నుండి రూ. 17.38 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్యలో ఉన్నాయి. అయితే, దీని తర్వాత దీని ధర ఎంత మేర పెరుగుతుందనే దాని గురించి కంపెనీ ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

MG Astor బుకింగ్స్ షురూ... బుకింగ్ అమౌంట్ రూ. 21,000 మాత్రమే !

ప్రారంభ లాంచ్‌లో, కంపెనీ ఈ ఎస్‌యూవీని స్టైల్, సూపర్, స్మార్ట్ మరియు షార్ప్ అనే నాలుగు ట్రిమ్‌లలో లాంచ్ చేసింది, ఆ తర్వాత ఇటీవలే ఇందులో ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో కొత్త టాప్-స్పెక్ వేరియంట్ శావీని విడుదల చేసింది. ఎమ్‌జి ఆస్టర్ శావీ ట్రిమ్ ప్రారంభ ధర రూ. 15.78 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ వేరియంట్ లెవల్-2 ఏడిఏఎస్ (ఆడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్లతో రానుంది.

MG Astor బుకింగ్స్ షురూ... బుకింగ్ అమౌంట్ రూ. 21,000 మాత్రమే !

ఎమ్‌జి ఆస్టర్ శావీ ట్రిమ్ 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌ లతో విడుదల చేయబడింది. ఇందులోని టర్బో-పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 138 బిహెచ్‌పి పవర్ ను మరియు 220 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 108 బిహెచ్‌పి పవర్ ను మరియు 144 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

MG Astor బుకింగ్స్ షురూ... బుకింగ్ అమౌంట్ రూ. 21,000 మాత్రమే !

ఎమ్‌జి ఆస్టర్ శావీ ట్రిమ్ లోని నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ లో సివిటి గేర్‌బాక్స్ ఆప్షన్ ఇవ్వబడింది మరియు టర్బో-పెట్రోల్ ఇంజన్ లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఇవ్వబడింది. ఆస్టర్ శావీ ట్రిమ్ లో మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేదు. ఈ ఎస్‌యూవీని కంపెనీ మొత్తం 5 ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్‌ లలో అందుబాటులో ఉంచింది. వీటిలో స్పైస్డ్ ఆరెంజ్, అరోరా సిల్వర్, గ్లేజ్ రెడ్, క్యాండీ వైట్ మరియు స్టారీ బ్లాక్ అనే కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

MG Astor బుకింగ్స్ షురూ... బుకింగ్ అమౌంట్ రూ. 21,000 మాత్రమే !

ఇందులో నేచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ యొక్క రెడ్ కలర్ ఆప్షన్ ధర రూ. 15.88 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, దాని 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ వేరియంట్ ధర రూ. 17.38 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ వేరియంట్ ప్రధానంగా, ఆస్టర్ షార్ప్ ప్లస్ ట్రిమ్ లో లభించే ఫీచర్లతో పాటుగా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ మరియు లేన్-కీపింగ్ / డిపార్చర్ అసిస్ట్ మరియు అటానమస్ డ్రైవర్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MG Astor బుకింగ్స్ షురూ... బుకింగ్ అమౌంట్ రూ. 21,000 మాత్రమే !

అంతేకాకుండా, శావీ వేరియంట్ లో 6 ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్ విత్ ఈబిడి, 360 డిగ్రీల కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు హిల్ డీసెంట్ కంట్రోల్, 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్, లేటెస్ట్ కార్ కనెక్ట్ టెక్నాలజీ, డ్యూయల్-పాన్ పానోరమిక్ సన్‌రూఫ్, సెగ్మెంట్-ఫస్ట్ పర్సనల్ ఏఐ అసిస్టెంట్ మరియు 7 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు కూడా లభిస్తాయి.

MG Astor బుకింగ్స్ షురూ... బుకింగ్ అమౌంట్ రూ. 21,000 మాత్రమే !

ఇండస్ట్రీ ఫస్ట్ CAAP సబ్‌స్క్రిప్షన్ మోడల్‌..

ఆస్టర్ ఎస్‌యూవీ కోసం ఎమ్‌జి మోటార్ పరిశ్రమలోనే మొట్టమొదటి సారిగా కార్-యాజ్-ఏ-ప్లాట్‌ఫామ్ (CAAP) అనే సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ ను పరిచయం చేసింది. ఇందులో భాగంగా, ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీలో పరిశ్రమలోనే మొట్టమొదటి సారిగా ఆన్-డిమాండ్ ఇన్-కార్ సేవలు మరియు యుటిలిటీ, ఎంటర్‌టైన్‌మెంట్, సెక్యూరిటీ మరియు కన్జ్యూమర్ పేమెంట్ వంటి పలు విభాగాల్లో సబ్‌స్క్రిప్షన్ సేవలు లభ్యం కానున్నాయి.

MG Astor బుకింగ్స్ షురూ... బుకింగ్ అమౌంట్ రూ. 21,000 మాత్రమే !

ఆస్టర్ ఎస్‌యూవీలో హై-స్పీడ్ ఇన్-కార్ కనెక్టివిటీని అందించడానికి ఎంబెడెడ్ సిమ్ మరియు టెక్నాలజీ కోసం ప్రముఖ టెలికాం సేవల సంస్థ జియో (Jio) తో ఎమ్‌జి మోటార్ ఓ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఇందులో JioSaavn యాప్ ద్వారా కస్టమర్‌లు 60 మిలియన్ పాటలను యాక్సెస్ చేసుకోవచ్చు మరియు కస్టమర్లు ప్రతినెలా ఎమ్‌జి ఆస్టర్‌ ఎస్‌యూవీలో 4GB ఇంటర్నెట్ డేటాను ఉచితంగా పొందవచ్చు.

Most Read Articles

English summary
Mg astor bookings open delivery timeline revealed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X