MG Astor కోసం CAAP సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్

చైనాకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎమ్‌జి మోటార్ ఇండియా (MG Motor India) ఇటీవలే దేశీయ విపణిలో విడుదల చేసిన తమ సరికొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఎమ్‌జి ఆస్టర్ (MG Astor) కోసం కంపెనీ ఓ సరికొత్త ఇండస్ట్రీ ఫస్ట్ సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ ను ప్రవేశపెట్టింది. ఆ వివరాలేంటో తెసుకుందాం రండి.

MG Astor కోసం ఇండస్ట్రీ ఫస్ట్ CAAP సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్: ఫుల్ డీటేల్స్

కొత్త ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీ కోసం కంపెనీ పరిశ్రమలోనే మొట్టమొదటి సారిగా కార్-యాజ్-ఏ-ప్లాట్‌ఫామ్ (CAAP) అనే సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా, ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీకి పరిశ్రమలో మొట్టమొదటి సారిగా ఆన్-డిమాండ్ ఇన్-కార్ సేవలు మరియు యుటిలిటీ, ఎంటర్‌టైన్‌మెంట్, సెక్యూరిటీ మరియు కన్జ్యూమర్ పేమెంట్ వంటి పలు విభాగాల్లో సబ్‌స్క్రిప్షన్ సేవలను అందిస్తుంది.

MG Astor కోసం ఇండస్ట్రీ ఫస్ట్ CAAP సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్: ఫుల్ డీటేల్స్

ఎమ్‌జి మోటార్ తమ ఆస్టర్ కారులో హై-స్పీడ్ ఇన్-కార్ కనెక్టివిటీని అందించడానికి ఎంబెడెడ్ సిమ్ మరియు టెక్నాలజీ కోసం ప్రముఖ టెలికాం సేవల సంస్థ జియో (Jio) తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఇందులో JioSaavn యాప్ ద్వారా కస్టమర్‌లు 60 మిలియన్ పాటలను యాక్సెస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, కస్టమర్లు తమ ఎమ్‌జి ఆస్టర్‌ ఎస్‌యూవీలో ప్రతినెలా ఉచితంగా 4GB ఇంటర్నెట్ ప్యాక్‌ను కూడా పొందుతారు. కస్టమర్లు కావాలనుకుంటే, అదనపు ఖర్చుతో ఈ డేటాను 9GB మరియు 14GB వరకు పెంచుకోవచ్చు.

MG Astor కోసం ఇండస్ట్రీ ఫస్ట్ CAAP సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్: ఫుల్ డీటేల్స్

ఎమ్‌జి మోటార్ తమ కస్టమర్లకు పార్కింగ్ సమస్యను నివారించేందుకు పార్క్+ (Park+) అనే సంస్థతో కూడా చేతులు కలిపింది. దీని సాయంతో, ఎమ్‌జి ఆస్టర్ యజమానులు తమ గమ్యస్థానాలకు చేరుకునే ముందు పార్కింగ్ స్లాట్‌ల కోసం ప్రీ-బుక్ మరియు ప్రీ-పే చేసే అవకాశం ఉంటుంది.

MG Astor కోసం ఇండస్ట్రీ ఫస్ట్ CAAP సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్: ఫుల్ డీటేల్స్

అయితే, ఈ సేవ ప్రస్తుతం ఢిల్లీ-ఎన్‌సిఆర్, ముంబై మరియు బెంగళూరు నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. సమీప భవిష్యత్తులో, దీనిని తొమ్మిది ఇతర నగరాలకు విస్తరించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ప్రారంభ ఆఫర్‌గా, ఎమ్‌జి ఆస్టర్ యజమానులు మూడు నెలల పాటు అపరిమిత ఉచిత పార్కింగ్‌ని పొందుతారు. ఆ తర్వాత ప్రతి ఆరు నెలలు రూ. 1,199 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

MG Astor కోసం ఇండస్ట్రీ ఫస్ట్ CAAP సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్: ఫుల్ డీటేల్స్

అంతేకాకుండా, భారతదేశపు మొట్టమొదటి వాహన డిజిటల్ పాస్‌పోర్ట్‌ (Vehicle Digital Passport) ను రూపొందించడానికి ఎమ్‌జి మోటార్ కంపెనీ, కోయిన్‌ఆర్థ్ (KoineArth) అనే సంస్థతో కలిసి పనిచేసింది. బ్లాక్‌చెయిన్ ద్వారా భద్రపరచబడిన కోయిన్‌ఆర్థ్ కస్టమర్ల యొక్క డేటా గోప్యత (ప్రైవసీ) ని నిర్ధారిస్తుంది మరియు కస్టమర్‌లు తమ డిజిటల్ పాస్‌పోర్ట్‌లను భీమా భాగస్వాములు లేదా యూజ్డ్ కార్ పోర్టల్స్ వంటి థర్డ్ పార్టీలతో పంచుకోవడానికి సహకరిస్తుంది.

MG Astor కోసం ఇండస్ట్రీ ఫస్ట్ CAAP సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్: ఫుల్ డీటేల్స్

ఈ వెహికల్ డిజిటల్ పాస్‌పోర్ట్ అనేది కస్టమర్ల యొక్క డ్రైవింగ్ ప్రవర్తన, సర్వీస్ షెడ్యూల్ ని క్రమం తప్పకుండా పాటించడం ఆధారంగా అధిక రీసేల్ విలువ మరియు మెరుగైన బీమా ప్రీమియం పొందడంలో వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చడంలో ఉపయోగపడుతుంది. ప్రారంభ ఆఫర్‌గా, వెహికల్ డిజిటల్ పాస్‌పోర్ట్ మొదటి సంవత్సరానికి గానూ కేవలం రూ. 1,000 లకే ఎమ్‌జి మోటార్ అందిస్తోంది.

MG Astor కోసం ఇండస్ట్రీ ఫస్ట్ CAAP సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్: ఫుల్ డీటేల్స్

ఇవే కాకుండా, ఐ-స్మార్ట్ హబ్‌లో హోస్ట్ చేయబడిన భాగస్వామ్యాలు (పార్ట్‌నర్‌షిప్స్) యధావిధిగా కొనసాగుతూనే ఉంటాయి. ఎమ్‌జి మోటార్ ఇండియా భవిష్యత్తులో ఈ తరహా సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ సేవలను మరిన్ని మోడళ్లకు అందుబాటులోకి తీసుకురానుంది.

MG Astor కోసం ఇండస్ట్రీ ఫస్ట్ CAAP సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్: ఫుల్ డీటేల్స్

అక్టోబర్ 21 నుండి ఎమ్‌జి ఆస్టర్ బుకింగ్స్ ప్రారంభం..

ఎమ్‌జి మోటార్ ఇండియా తమ ఆస్టర్ ఎస్‌యూవీని అక్టోబర్ 11, 2021వ తేదీ దేశీయ విపణిలో విడుదల చేసింది. అయితే, దీని బుకింగ్స్ మాత్రం అక్టోబర్ 21, 2021వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం, భారత మార్కెట్లో ఎమ్‌జి ఆస్టర్ స్టైల్, సూపర్, స్మార్ట్, షార్ప్ మరియు శావీ (Style, Super, Smart, Sharp మరియు Savvy) అనే ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

MG Astor కోసం ఇండస్ట్రీ ఫస్ట్ CAAP సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్: ఫుల్ డీటేల్స్

మార్కెట్లో ఎమ్‌జి ఆస్టర్ ధరలు రూ. 9.78 లక్షల నుండి రూ. 17.38 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. ఆసక్తి గల కస్టమర్లు ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీని కంపెనీ యొక్క అధీకృత డీలర్‌షిప్‌లో కానీ లేదా ఎమ్‌జి మోటార్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కానీ బుక్ చేసుకోవచ్చు. నవంబర్ మరియు డిసెంబర్‌ నెలల్లో కంపెనీ మొదటి బ్యాచ్‌లో భాగంగా సుమారు 5,000 యూనిట్లను డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

MG Astor కోసం ఇండస్ట్రీ ఫస్ట్ CAAP సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్: ఫుల్ డీటేల్స్

ఎమ్‌జి ఆస్టర్ శావీ (MG Astor Savvy) వేరియంట్ విడుదల..

ఇదిలా ఉంటే, ఎమ్‌జి మోటార్ తాజాగా ఆస్టర్ ఎస్‌యూవీలో శావీ అనే కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ఎమ్‌జి ఆస్టర్ శావీ వేరియంట్ లో లభించే ఫీచర్ల విషయానికి వస్తే, ఆస్టర్ షార్ప్ ప్లస్ ట్రిమ్ లో లభించే ఫీచర్లతో పాటుగా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ మరియు లేన్-కీపింగ్ / డిపార్చర్ అసిస్ట్ మరియు అటానమస్ డ్రైవర్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MG Astor కోసం ఇండస్ట్రీ ఫస్ట్ CAAP సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్: ఫుల్ డీటేల్స్

ఇంకా, ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్ విత్ ఈబిడి, 360 డిగ్రీల కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు హిల్ డీసెంట్ కంట్రోల్, 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్, లేటెస్ట్ కార్ కనెక్ట్ టెక్నాలజీ, డ్యూయల్-పాన్ పానోరమిక్ సన్‌రూఫ్, సెగ్మెంట్-ఫస్ట్ పర్సనల్ ఏఐ అసిస్టెంట్ మరియు 7 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మొదలైనవి ఉన్నాయి.

Most Read Articles

English summary
MG Astor Gets Industry First Services Under Car As A Platform (CAAP); Bookings Open From Tomorrow. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X