MG Astor Savvy వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు మరియు వివరాలు

చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ (MG Motor) ఇండియా ఇటీవలే దేశీయ విపణిలో విడుదల చేసిన తమ సరికొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఎమ్‌జి ఆస్టర్ (MG Astor) లైనప్ లో కంపెనీ ఓ కొత్త వేరియంట్ ను నేడు (అక్టోబర్ 18) ప్రవేశపెట్టింది. ఎమ్‌జి ఆస్టర్ శావీ (MG Astor Savvy) పేరుతో కంపెనీ ఈ కొత్త వేరియంట్ ను విడుదల చేసింది.

MG Astor Savvy వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు మరియు వివరాలు

ప్రస్తుతం, భారత మార్కెట్లో ఎమ్‌జి ఆస్టర్ స్టైల్, సూపర్, స్మార్ట్ మరియు షార్ప్ (Style, Super, Smart మరియు Sharp) అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ నాలుగు వేరియంట్లలో కంపెనీ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లను అందించలేదు. కాగా, కంపెనీ ఇందులో ఇప్పుడు కొత్తగా శావీ (Savvy) అనే టాప్-ఎండ్ వేరియంట్ ను విడుదల చేసింది.

MG Astor Savvy వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు మరియు వివరాలు

కొత్త ఎమ్‌జి ఆస్టర్ శావీ వేరియంట్ ఇప్పుడు అధునాతమైన అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. మార్కెట్లో శావీ వేరియంట్ ప్రారంభ ధర రూ. 15.78 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఎమ్‌జి ఆస్టర్ శావీ ట్రిమ్ 1.5 లీటర్ నేచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌ లతో విడుదల చేయబడింది.

MG Astor Savvy వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు మరియు వివరాలు

గేర్‌బాక్స్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇందులో సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ 1.5 లీటర్ నేచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌ తో లభిస్తుంది. ఈ ట్రిమ్‌ లో మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఇవ్వబడలేదు. కాగా, ఇందులో నేచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ యొక్క రెడ్ కలర్ ఆప్షన్ ధర రూ. 15.88 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, దాని 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ వేరియంట్ ధర రూ. 17.38 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

MG Astor Savvy వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు మరియు వివరాలు

ఎమ్‌జి ఆస్టర్ శావీ (MG Astor Savvy) ఫీచర్లు:

ఎమ్‌జి ఆస్టర్ శావీ వేరియంట్ లో లభించే ఫీచర్ల విషయానికి వస్తే, ఆస్టర్ షార్ప్ ప్లస్ ట్రిమ్ లో లభించే అనేక ఫీచర్లు కొత్త ఆస్టర్ శావీ ట్రిమ్ లో కూడా కనిపిస్తాయి. ఈ ఫీచర్లలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ మరియు లేన్-కీపింగ్ / డిపార్చర్ అసిస్ట్ మరియు అటానమస్ డ్రైవర్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MG Astor Savvy వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు మరియు వివరాలు

అంతేకాకుండా, ఇందులో ప్రయాణీకుల భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగులు, ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), 360 డిగ్రీల కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు హిల్ డీసెంట్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

MG Astor Savvy వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు మరియు వివరాలు

ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, కాంపాక్ట్ ఎస్‌యూవీలో 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్, లేటెస్ట్ కార్ కనెక్ట్ టెక్నాలజీ, డ్యూయల్-పాన్ పానోరమిక్ సన్‌రూఫ్, సెగ్మెంట్-ఫస్ట్ పర్సనల్ ఏఐ అసిస్టెంట్ మరియు 7 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మొదలైనవి ఉన్నాయి.

MG Astor Savvy వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు మరియు వివరాలు

అంతేకాకుండా, ఈ కారులో 6-వే పవర్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లను కూడా పొందుతుంది. ఎమ్‌జి ఆస్టర్ మొత్తం రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో మార్కెట్లో విడుదల చేయబడింది. వీటిలో మొదటిది 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు రెండవది 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్.

MG Astor Savvy వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు మరియు వివరాలు

ఇందులోని టర్బో-పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 138 బిహెచ్‌పి పవర్ ను మరియు 220 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది కేవలం 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో మాత్రమే లభిస్తుంది. అలాగే, ఇందులోని న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 108 బిహెచ్‌పి పవర్ ను మరియు 144 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ మరియు 8 స్పీడ్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

MG Astor Savvy వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు మరియు వివరాలు

ఎమ్‌జి ఆస్టర్ డిజైన్‌ను గమనిస్తే, ఇందులో ఎమ్‌జి సిగ్నేచర్ హెక్సాగనల్ 'సెలెస్టియల్' ఫ్రంట్ గ్రిల్, సన్నని బంపర్లు, షార్ప్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడి టెయిల్ లైట్లు, టర్న్ ఇండికేటర్లతో కూడిన సైడ్ మిర్రర్స్, రీడిజైన్ చేసిన 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ మరియు పానోరమిక్ సన్‌రూఫ్ వంటి డిజైన్ ఎలిమెంట్స్‌తో ఇది మంచి రోడ్ ప్రజెన్స్ ని కలిగి ఉంటుంది.

MG Astor Savvy వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు మరియు వివరాలు

ప్రస్తుతం, మార్కెట్లో ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీ ధరలు రూ. 9.78 లక్షల నుండి రూ. 17.38 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. కంపెనీ ఈ ఎస్‌యూవీని కంపెనీ మొత్తం 5 ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్‌ లలో అందుబాటులో ఉంచింది. వీటిలో స్పైస్డ్ ఆరెంజ్, అరోరా సిల్వర్, గ్లేజ్ రెడ్, క్యాండీ వైట్ మరియు స్టారీ బ్లాక్ అనే కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇంటీరియర్‌లో కూడా మూడు అంతర్గత కలర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.

Most Read Articles

English summary
Mg astor savvy trim launched with adas price specs features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X