ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీ కొత్త డీటేల్స్ లీక్; త్వరలోనే ఇండియా లాంచ్!

చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్స్, భారత మార్కెట్లో మరొక కొత్త ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ విక్రయిస్తున్న ఎమ్‌జి జెడ్ఎస్ (MG ZS) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆధారంగా చేసుకొని కంపెనీ ఇందులో ఓ పెట్రోల్ వెర్షన్ ఎస్‌యూవీని విడుదల చేయబోతోంది.

ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీ కొత్త డీటేల్స్ లీక్; త్వరలోనే ఇండియా లాంచ్!

ఈ పెట్రోల్ వెర్షన్ ఎమ్‌జి జెడ్ఎస్ వాహనాన్ని 'ఎమ్‌జి ఆస్టర్' (MG Astor) అని పిలవనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆస్టర్ పేరును కంపెనీ భారత్‌లో ట్రేడ్‌మార్క్ కోసం రిజిస్టర్ కూడా చేసుకుంది. ఎమ్‌జి జెడ్‌ఎస్‌ ఎస్‌యూవీ యొక్క పెట్రోల్‌ వేరియంట్‌ను కంపెనీ భారత రోడ్లపై నిరంతరం పరీక్షిస్తోంది. ఈ ఏడాది మూడవ త్రైమాసికం నాటికి ఈ కొత్త ఎస్‌యూవీ మార్కెట్లో విడుదల కావచ్చని భావిస్తున్నారు.

ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీ కొత్త డీటేల్స్ లీక్; త్వరలోనే ఇండియా లాంచ్!

తాజాగా, ఈ ఎస్‌యూవీకి సంబంధించిన కొత్త వివరాలు కూడా లీక్ అయ్యాయి. ఎమ్‌జి మోటార్ కంపెనీ గతేడాది పలు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశపెట్టిన 2020 మోడల్ ఫేస్‌లిఫ్ట్ ఎమ్‌జి జెడ్ఎస్ పెట్రోల్ వెర్షన్ ఆధారంగా చేసుకొని ఈ కొత్త ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీని తయారు చేయనున్నారు.

MOST READ:వరుసగా 5 వ రోజు పెరిగిన పెట్రోల్ & డీజిల్ ధరలు; వివరాలు

ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీ కొత్త డీటేల్స్ లీక్; త్వరలోనే ఇండియా లాంచ్!

కొత్త ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీలో సరికొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లభ్యం కానుంది. గ్లోబల్ మోడల్‌లో కూడా ఇదే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. ఇది 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే రూపంలో రానుంది. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు నావిగేషన్‌లను సపోర్ట్ చేయనుంది.

ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీ కొత్త డీటేల్స్ లీక్; త్వరలోనే ఇండియా లాంచ్!

అంతేకాకుండా, కారులోని 360 డిగ్రీ కెమెరా ఫీచర్ కోసం కూడా ఈ డిస్‌ప్లే ఉపయోగించడం జరుగుతుంది. ఎమ్‌జి ఆస్టర్ పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో రానుంది. ఇది వివిధ వాహన సెట్టింగులతో పాటుగా కలర్ ఎమ్ఐడి ని కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ కూడా లభ్యం కావచ్చని సమాచారం.

MOST READ:ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఈ-పాస్ పొందాలంటే ఇలా చేయండి

ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీ కొత్త డీటేల్స్ లీక్; త్వరలోనే ఇండియా లాంచ్!

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీలో ఏడిఏఎస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్)ను కూడా కలిగి ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే, ఈ విభాగంలోనే ఏడిఏఎస్ టెక్నాలజీని కలిగిన మొట్టమొదటి మోడల్‌గా ఎమ్‌జి ఆస్టర్ చరిత్ర సృష్టించనుంది.

ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీ కొత్త డీటేల్స్ లీక్; త్వరలోనే ఇండియా లాంచ్!

ఎమ్‌జి మోటార్ ఇండియా ఇప్పటికే ఈ అధునాతన ఏడిఏఎస్ టెక్నాలజీని తమ గ్లోస్టర్ ఎస్‌యూవీలో అందిస్తోంది. ఈ టెక్నాలజీ సాయంతో డ్రైవర్ ప్రమేయం లేకుండా కారును రిమోట్ ద్వారా యాక్సెస్ చేయటం లేదా ఆటోమేటిక్‌గా పార్క్ చేయటం చేయవచ్చు.

MOST READ:ఆనంద్ మహీంద్రా ట్వీట్; బహుశా.. ఇదోరకమైన సామజిక దూరమేమో

ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీ కొత్త డీటేల్స్ లీక్; త్వరలోనే ఇండియా లాంచ్!

అంతేకాకుండా, ఎమ్‌జి మోటార్ కంపెనీ తమ ఆస్టర్ ఎస్‌యూవీలో ఎమర్జెన్సీ బ్రేక్‌లను కూడా పరీక్షిస్తోంది. ఈ కారులో అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఫ్రంట్ కొలైజన్ వార్నింగ్ మరియు హ్యాండ్స్ ఫ్రీ ఆటో పార్కింగ్ వంటి యాక్టివ్ డ్రైవర్ అసిస్టెంట్ ఫీచర్లు లభిస్తాయని సమాచారం.

ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీ కొత్త డీటేల్స్ లీక్; త్వరలోనే ఇండియా లాంచ్!

ఎమ్‌జి ఆస్టర్ డిజైన్ పరంగా అంతర్జాతీయ మార్కెట్లలో లభిస్తున్న అప్‌డేటెడ్ జెడ్ఎస్ ఎస్‌యూవీ ఆధారంగా ఉంటుంది. ఇందులో సిగ్నేచర్ హనీకోంబ్ ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు మరియు డే టైమ్ రన్నింగ్ లైట్లు, స్ప్లిట్-స్టైల్ ర్యాప్అరౌండ్ ఎల్ఈడి టెయిల్ లాంప్స్, రెండు చివర్లలో అల్యూమినియం ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్ మరియు 17 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:తోటి వ్యక్తి అంత్యక్రియలకు నిరాకరించిన గ్రామస్థులు.. పిఎఫ్‌ఐ టీమ్ రాకతో కథ సుఖాంతం

ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీ కొత్త డీటేల్స్ లీక్; త్వరలోనే ఇండియా లాంచ్!

ఎమ్‌జి ఆస్టర్ కొలతలను గమనిస్తే, ఇది 4,314 మిమీ పొడవును, 1,809 మిమీ వెడల్పును మరియు 1,644 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీ వీల్‌బేస్ 2,585 మిమీగాను మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 205 మి.మీగాను ఉంటుంది. భారత మార్కెట్లో ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీని కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో మాత్రమే ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది.

ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీ కొత్త డీటేల్స్ లీక్; త్వరలోనే ఇండియా లాంచ్!

ఇందులో ఒకటి 1.5-లీటర్ ఫోర్ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్, ఇది గరిష్టంగా 104 బిహెచ్‌పి పవర్‌ను మరియు 141 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, రెండవది 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, ఇది గరిష్టంగా 162 బిహెచ్‌పి శక్తిని మరియు 230 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Most Read Articles

English summary
MG Motors New SUV Will Be Named As Astor; India Launch Expected Soon, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X