MG Astor: అన్నీ అప్పుడే అమ్ముడైపోయాయ్.. మీకు 2021 లో డెలివరీ రాదు..!

చైనాకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎమ్‌జి మోటార్ (MG Motor) దేశీయ మార్కెట్లో విడుదల చేసిన లేటెస్ట్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఎమ్‌జి ఆస్టర్ (MG Astor) కోసం కంపెనీ నేడు (అక్టోబర్ 21, 2021వ తేదీ) అధికారికంగా బుకింగ్ లను ప్రారంభించిన సంగతి తెలిసినదే. అయితే, ఈ మోడల్ కోసం బుకింగ్ లు ప్రారభమైన కొన్ని గంటల్లోనే మొదటి బ్యాచ్ పూర్తిగా అమ్ముడైపోయినట్లు కంపెనీ తెలిపింది.

MG Astor: అన్నీ అప్పుడే అమ్ముడైపోయాయ్.. మీకు 2021 లో డెలివరీ రాదు..!

ఎమ్‌జి ఆస్టర్ కోసం బుకింగ్ లు ప్రారంభమైన కొన్ని గంటల్లో, ఇది ఈ ఏడాది కోసం పూర్తిగా విక్రయించబడింది. ఇకపై కొత్తగా ఈ ఎస్‌యూవీని బుక్ చేసుకునే కస్టమర్లకు 2021 లో డెలివరీ కాదు, వీరంతా 2022 వరకూ వేచి ఉండాల్సిందే. రానున్న రెండు నెలల్లో (నవంబర్-డిసెంబర్ కాలంలో) ఎమ్‌జి మోటార్ మొత్తం 5,000 యూనిట్ల ఎమ్‌జి ఆస్టర్‌ ఎస్‌యూవీలను డెలివరీ చేయాలని ప్లాన్ చేసింది.

MG Astor: అన్నీ అప్పుడే అమ్ముడైపోయాయ్.. మీకు 2021 లో డెలివరీ రాదు..!

ఈ నేపథ్యంలో, మొదటి బ్యాచ్ అప్పుడే పూర్తిగా అమ్ముడైపోయిందని, ఇకపై ఈ ఎస్‌యూవీని కొత్తగా బుక్ చేసుకునే వారు డెలివరీ కోసం వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందేనని కంపెనీ తెలిపింది. ఆస్టర్ ను ముందుగా బుక్ చేసుకున్న మొదటి 5,000 మంది కస్టమర్లకు ఈ ఏడాది డిసెంబర్ లోగా డెలివరీ అందనుంది.

MG Astor: అన్నీ అప్పుడే అమ్ముడైపోయాయ్.. మీకు 2021 లో డెలివరీ రాదు..!

ఒకవేళ మీరు వచ్చే ఏడాదిలో డెలివరీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే, కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి కానీ లేదా డీలర్‌షిప్ ను కానీ సంప్రదించి రూ. 21,000 అడ్వాన్స్‌ చెల్లించి ఈ ఎస్‌యూవీని బుక్ చేసుకొని క్యూ లైన్ లో వేచి ఉండొచ్చు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన, ఆస్టర్ ను ముందుగా బుక్ చేసుకున్న వారికి కంపెనీ ముందుగా డెలివరీ చేయనుంది.

MG Astor: అన్నీ అప్పుడే అమ్ముడైపోయాయ్.. మీకు 2021 లో డెలివరీ రాదు..!

ఇప్పటి వరకూ బుక్ అయిన 5,000 యూనిట్లలో ఎమ్‌జి ఆస్టర్ యొక్క అన్ని వేరియంట్లు వచ్చే 2-3 నెలల్లో డెలివరీ చేయబడుతాయని కంపెనీ తెలిపింది. మీ బుకింగ్ కు సంబంధించి ఖచ్చితమైన డెలివరీ టైమ్‌లైన్ కోసం మీరు నేరుగా మీ డీలరును సంప్రదించవచ్చు. ప్రస్తుతం, ఈ మోడల్ కోసం బుకింగ్ లను మూసివేయలేదని, 2022 ఏడాది కోసం బుకింగ్ లు జరుగుతున్నాయని కంపెనీ తెలిపింది.

MG Astor: అన్నీ అప్పుడే అమ్ముడైపోయాయ్.. మీకు 2021 లో డెలివరీ రాదు..!

ఇదివరకటి కథనంలో చెప్పుకున్నట్లుగా, ముందుగా బుక్ అయిన మొదటి 5,000 యూనిట్లు డెలివరీలు పూర్తయిన తర్వాత, ఈ కారు పరిచయ ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతం, కొత్త ఎమ్‌జి ఆస్టర్ యొక్క పరిచయం ప్రారంభ ధరలు రూ. 9.78 లక్షల నుండి రూ. 17.38 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్యలో ఉన్నాయి. అయితే, వీటి తర్వాత కొత్త ధరలు ఏంటనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

MG Astor: అన్నీ అప్పుడే అమ్ముడైపోయాయ్.. మీకు 2021 లో డెలివరీ రాదు..!

అంటే, ఇకపై కొత్తగా ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీని బుక్ చేసుకునే కస్టమర్లు అధిక ధరను చెల్లించాల్సి రావచ్చు. కొత్త ధరల గురించి కంపెనీ వచ్చే ఏడాది ఆరంభంలో వెల్లడించే అవకాశం ఉంది. మార్కెట్ అంచనా ప్రకారం, ఈ మోడల్ ధరలు వేరియంట్ ను బట్టి సుమారు రూ. 50,000 వరకు పెరుగుతాయని అంచనా.

MG Astor: అన్నీ అప్పుడే అమ్ముడైపోయాయ్.. మీకు 2021 లో డెలివరీ రాదు..!

ఇటీవలి కాలంలో, ఆటోమొబైల్ కంపెనీలు తమ కొత్త ఉత్పత్తుల విషయంలో పరిచయ ప్రారంభ ధర (ఇంట్రడక్టరీ ప్రైస్) విధానాన్ని అనుసరిస్తున్నాయి. తమ కార్లను మార్కెట్లో విడుదల చేసిన సమయంలో వాటిని తక్కువ ధరతో విడుదల చేసి, కొన్ని రోజుల్లోనే తిరిగి వాటి ధరలను సుమారు రూ. 10,000 నుండి రూ. 50,000 వరకూ పెంచుతున్నాయి. కస్టమర్లను వేగంగా ఆకర్షించేందుకు మరియు తమ వద్ద లాక్ చేసేందుకు కంపెనీలు అనుసరిస్తున్న కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీ ఇది.

MG Astor: అన్నీ అప్పుడే అమ్ముడైపోయాయ్.. మీకు 2021 లో డెలివరీ రాదు..!

అధికారిక బుకింగ్ లు ప్రారంభం కావడానికి ముందే ప్రీ-బుక్ చేసుకునే కస్టమర్లకు కంపెనీలు ప్రధాన్యత ఇస్తున్నాయి. ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీ అత్యంత పోటీతో కూడుకున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో విడుదల కానుంది. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా నెక్సాన్, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, నిస్సాన్ కిక్స్ మరియు రెనో డస్టర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

MG Astor: అన్నీ అప్పుడే అమ్ముడైపోయాయ్.. మీకు 2021 లో డెలివరీ రాదు..!

కాకపోతే, ఎమ్‌జి ఆస్టర్ ఈ ఎస్‌యూవీలన్నింటికీ భిన్నంగా ఉంటుంది మరియు సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, లేన్-కీపింగ్ / డిపార్చర్ అసిస్ట్ మరియు అటానమస్ డ్రైవర్ అసిస్ట్ వంటి లెవల్-2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ఫీచర్లను కలిగి ఉంటుంది.

MG Astor: అన్నీ అప్పుడే అమ్ముడైపోయాయ్.. మీకు 2021 లో డెలివరీ రాదు..!

సాధారణంగా, ఇలాంటి ఫీచర్లు హై-ఎండ్ లగ్జరీ కార్లలో మాత్రమే లభిస్తుంటాయి. అలాంటిది, ఎమ్‌జి మోటార్ ఇండియా అత్యంత సరసమైన ధరకే ఆస్టర్ ఎస్‌యూవీలో ఇలాంటి అధునాతన టెక్నాలజీతో కూడిన ఫీచర్లను అందిస్తోంది. ఈ ఫీచర్లన్నీ కూడా కారు లోపల డ్రైవర్ సౌకర్యాన్ని మెరుగుపరచడంతో పాటు, ప్రయాణీకుల భద్రతకు అదనపు భరోసా ఇస్తాయి.

MG Astor: అన్నీ అప్పుడే అమ్ముడైపోయాయ్.. మీకు 2021 లో డెలివరీ రాదు..!

ప్రస్తుతం, భారత మార్కెట్లో ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీ స్టైల్, సూపర్, స్మార్ట్, షార్ప్ మరియు శావీ (Style, Super, Smart, Sharp మరియు Savvy) అనే ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు రూ. 9.78 లక్షల నుండి రూ. 17.38 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. కంపెనీ ఈ కారుపై 3 సంవత్సరాల అపరిమిత కిమీ వారంటీ, 3 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ మరియు 3 సంవత్సరాల లేబర్ ఫ్రీ సర్వీసును అందిస్తోంది.

Most Read Articles

English summary
Mg astor suv sold out for 2022 now new customers have to wait for delivery till next year
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X