కొత్త Astor బుకింగ్ డేట్ వెల్లడించిన MG Motor; పూర్తి వివరాలు

చైనా కార్ల తయారీ సంస్థ MG Motor (ఎమ్‌జి మోటార్) నుంచి భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న సరికొత్త మోడల్ MG Astor (ఎమ్‌జి ఆస్టర్). MG Astor బ్రాండ్ యొక్క అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. కంపెనీ దీనికి సంబంధించిన చాలా సమాచారాన్ని ఇప్పటికే అందించింది. అయితే ఇప్పుడు కంపెనీ యొక్క బుకింగ్ తేదీని ప్రకటించింది.

కొత్త Astor బుకింగ్ డేట్ వెల్లడించిన MG Motor; పూర్తి వివరాలు

MG Motor కంపెనీ యొక్క MG Astor బుకింగ్స్ అధికారికంగా 2021 అక్టోబర్ 07 నుంచి ప్రారంభించబడే అవకాశం ఉంది. అయితే కంపెనీ ఈ కొత్త మోడల్ యొక్క అధికారిక విడుదల తేదీని ప్రకటించలేదు. కావున దీని ధర కూడా ఇంకా వెల్లడించలేదు, ధర కంపెనీ త్వరలో వెల్లడిస్తుంది. అయితే బుకింగ్ మొత్తం ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. డెలివరీలు ఈ 2021 డిసెంబర్ లో జరిగే అవకాశం ఉంటుంది. ఇది పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది.

కొత్త Astor బుకింగ్ డేట్ వెల్లడించిన MG Motor; పూర్తి వివరాలు

MG Astor కంపెనీ యొక్క హెక్టర్ కింద ఉంచబడుతుంది. అయితే ఇది కంపెనీ యొక్క ZS EV ఎలక్ట్రిక్ వెర్షన్ పై ఆధారపడి ఉంటుంది. కంపెనీ ఈ కొత్త SUV ని దేశ వ్యాప్తంగా ఉన్న షోరూమ్‌లలో అందుబాటులో ఉంచింది. ఆసక్తి కలిగిన కస్టమర్లు షోరూమ్‌లను సందర్శించి తనికీ చేయవచ్చు.

కొత్త Astor బుకింగ్ డేట్ వెల్లడించిన MG Motor; పూర్తి వివరాలు

MG Astor అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ SUV ముందు భాగంలో గ్రిల్ మరియు ఎల్ఈడీ హెడ్‌లైట్ అందించింది. దాని కొండా ఫాగ్ లైట్స్ ఉన్నాయి, అంతే కాకుండా బంపర్‌పై లైన్స్ కూడా ఇవ్వబడ్డాయి. ఇందులో 5-స్పోక్ అల్లాయ్ వీల్‌ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

కొత్త Astor బుకింగ్ డేట్ వెల్లడించిన MG Motor; పూర్తి వివరాలు

MG Astor ఇంటీరియర్ డ్యూయల్ టోన్‌లో ఉంటుంది. డాష్‌బోర్డ్ మధ్యలో 10.1 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది, ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటివి ఉన్నాయి. ఇక రెండవ స్క్రీన్ 7 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇది వాహనం గురించి మొత్తం సమాచారాన్ని అందిస్తుంది. లోపలి భాగంలో మూడవ స్క్రీన్ చాలా లేటెస్ట్ ఫీచర్. ఇది ఆర్టిఫిషియల్లీ ఇంటెలిజెన్సీ యొక్క వాయిస్ కమాండ్ ఆధారంగా పనిచేస్తుంది.

కొత్త Astor బుకింగ్స్ డేట్ వెల్లడించిన MG Motor; పూర్తి వివరాలు

ఈ వాయిస్ కమాండ్స్ సాయంతో మ్యూజిక్, ఫోన్ కాల్స్ వంటి అనేక రకాల ఫీచర్లను కంట్రోల్ చేయవచ్చు. పారాలింపిక్ క్రీడాకారిణి మరియు ఖేల్ రత్న విజేత 'దీపా మాలిక్' వాయిస్ ను ఈ ఎస్‌యూవీలో పర్సనల్ అసిస్టెంట్ వాయిస్ గా ఉపయోగించారు. ఇందులో మూడు పవర్ స్టీరింగ్ మోడ్‌లు కూడా ఉన్నాయి. అవి: నార్మల్, అర్బన్ మరియు డైనమిక్ మోడ్స్.

కొత్త Astor బుకింగ్స్ డేట్ వెల్లడించిన MG Motor; పూర్తి వివరాలు

MG Astor SUV లో ఈ-సిమ్ మరియు ఎల్‌టిఈ టెక్నాలజీని రిలయన్స్ జియో సరఫరా చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిస్‌ప్లే స్క్రీన్‌పై రోబోట్ కనిపిస్తుంది. ఈ కారులోని అటానమస్ లెవల్-2 ఫీచర్లలో భాగంగా, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొల్లైజన్ అలెర్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్ మరియు స్పీడ్ అసిస్ట్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

కొత్త Astor బుకింగ్స్ డేట్ వెల్లడించిన MG Motor; పూర్తి వివరాలు

ఈ ఎస్‌యూవీ రెండు ఇంజన్ ఆప్షన్‌ లతో అందుబాటులోకి రానుంది. వీటిలో మొదటిది 220 టర్బో, 1349 సిసి పెట్రోల్ ఇంజన్. ఇది గరిష్టంగా 140 బిహెచ్‌పి పవర్ ను మరియు 220 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో లభిస్తుంది.

ఇక రెండవది 1498 సిసి పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్ ను మరియు 144 న్యూటన్ మీటర్ టార్క్ ఆడిస్తుంది. ఈ ఇంజన్ మాన్యువల్ మరియు 8 స్పీడ్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇవి మంచి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

కొత్త Astor బుకింగ్స్ డేట్ వెల్లడించిన MG Motor; పూర్తి వివరాలు

MG Astor కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,323 మిమీ, వెడల్పు 1,809 మిమీ మరియు ఎత్తు 1,650 మిమీ వరకు ఉంటుంది. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీ కెమెరా, రియర్ డ్రైవ్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి 27 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను కంపెనీ అందిస్తోంది.

MG Astor త్వరలో దేశీయ మార్కెట్లో విడుదల కావుంది, విడుదల తరువాత ఇది దేశీయ విఫణిలో ఎలాటి ఆదరణ పొందుతుందో వేచి చూడాలి.

Most Read Articles

English summary
Mg astor suvs official bookings to starts from october 7 details
Story first published: Wednesday, September 22, 2021, 18:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X