Just In
- 13 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 14 hrs ago క్రాష్ టెస్ట్‌లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 17 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 18 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Movies కట్టె పుల్లకు చీరకట్టినా.. మగాళ్ల ప్రవర్తనపై బిగ్‌బాస్ బ్యూటీ హిమజ హాట్ కామెంట్
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
విడుదలకు సిద్దమవుతున్న MG Astor; బుకింగ్స్ ఎప్పుడంటే?
చైనా కార్ల తయారీ దిగ్గజం MG Motor (ఎమ్‌జి మోటార్) భారతీయ మార్కెట్లో ఇటీవల తన కొత్త MG Astor (ఎమ్‌జి ఆస్టర్) SUV ని ఆవిష్కరించింది. కంపెనీ ఆవిష్కరించిన ఈ కొత్త SUV లో అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. MG Astor రేపటి నుంచి అనగా 2021 సెప్టెంబర్ 19 నుంచి దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లలో వీక్షించడానికి అందుబాటులో ఉంటుంది.
MG Astor యొక్క బుకింగ్స్ కూడా 2021 సెప్టెంబర్ 19 నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త MG Astor SUV ని డీలర్‌షిప్‌లలో సందర్శించవచ్చు. Astor లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉన్న కంపెనీ యొక్క నాల్గవ మోడల్ అవుతుంది.
కంపెనీ నివేదికల ప్రకారం MG Astor దేశీయ మార్కెట్లో అక్టోబర్ మొదటి వారంలో విడుదల చేయవచ్చు. ఈ కొత్త Astor ధరను కంపెనీ వెల్లడించలేదు, కానీ విడుదల సమయంలోనే ఈ SUV యొక్క ధర కూడా అధికారికంగా వెల్లడవుతుంది. డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమవుతాయి.
MG Astor అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ SUV ముందు భాగంలో గ్రిల్ మరియు ఎల్ఈడీ హెడ్‌లైట్ అందించింది. దాని కొండా ఫాగ్ లైట్స్ ఉన్నాయి, అంతే కాకుండా బంపర్‌పై లైన్స్ కూడా ఇవ్వబడ్డాయి. ఇందులో 5-స్పోక్ అల్లాయ్ వీల్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ఈ ఎస్యూవీ రెండు ఇంజన్ ఆప్షన్ లతో అందుబాటులోకి రానుంది. వీటిలో మొదటిది 220 టర్బో, 1349 సిసి పెట్రోల్ ఇంజన్. ఇది గరిష్టంగా 140 బిహెచ్పి పవర్ ను మరియు 220 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో లభిస్తుంది.
ఇక రెండవది 1498 సిసి పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్పి పవర్ ను మరియు 144 న్యూటన్ మీటర్ టార్క్ ఆడిస్తుంది. ఈ ఇంజన్ మాన్యువల్ మరియు 8 స్పీడ్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.
MG Astor కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,323 మిమీ, వెడల్పు 1,809 మిమీ మరియు ఎత్తు 1,650 మిమీ వరకు ఉంటుంది. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీ కెమెరా, రియర్ డ్రైవ్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి 27 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను కంపెనీ అందిస్తోంది.
కొత్త MG Astor ను కంపెనీ 14 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది దేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కలిగిన కారు అని కంపనీ పేర్కొంది. ఈ టెక్నాలజీ సహాయంతో కారులో పర్సనల్ అసిస్టెంట్ సిస్టమ్ లభిస్తుంది. ఇది మీ వాయిస్ కమాండ్స్ కి అనుగుణంగా పనిచేస్తుంది.
ఈ వాయిస్ కమాండ్స్ సాయంతో మ్యూజిక్, ఫోన్ కాల్స్ వంటి అనేక రకాల ఫీచర్లను కంట్రోల్ చేయవచ్చు. పారాలింపిక్ క్రీడాకారిణి మరియు ఖేల్ రత్న విజేత 'దీపా మాలిక్' వాయిస్ ను ఈ ఎస్‌యూవీలో పర్సనల్ అసిస్టెంట్ వాయిస్ గా ఉపయోగించారు.
MG Astor మొత్తం మూడు ఇంటీరియర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని డ్రైవర్ సీటును డ్రైవర్ సౌకర్యానికి తగినట్లుగా ఆరు రకాలుగా సర్దుబాటు చేసుకునే సౌలభ్యం ఉంటుంది. ఇందులో మూడు పవర్ స్టీరింగ్ మోడ్లు కూడా ఉన్నాయి. అవి: నార్మల్, అర్బన్ మరియు డైనమిక్ మోడ్స్.
అంతే కాకుండా, ఇందులో 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, డ్రైవర్ సమాచారం కోసం 7 ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ మరియు క్యాబిన్ లోపల స్వచ్ఛమైన గాలి కోసం పిఎమ్ 2.5 ఫిల్టర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
వీటితో పాటుగా, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్లు, హీటెడ్ సైడ్ మిర్రర్స్, రియర్ ఏసి వెంట్స్, ముందు మరియు వెనుక సీట్లలో ప్రయాణీకుల కోసం ఆర్మ్‌రెస్ట్‌లు కూడా లభిస్తాయి. కొత్త MG Astor లోని అటానమస్ లెవల్-2 సిస్టమ్ కోసం కంపెనీ రిలయన్స్ జియో సంస్థతో ఒప్పందాన్ని కుదర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో కారులో లోపల రియల్ టైమ్ ఇన్ఫోటైన్మెంట్ మరియు టెలిమాటిక్స్ వంటివి కూడా అందుబాటులో ఉండనున్నాయి.
MG Astor SUV లో ఈ-సిమ్ మరియు ఎల్టిఈ టెక్నాలజీని రిలయన్స్ జియో సరఫరా చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిస్ప్లే స్క్రీన్‌పై రోబోట్ కనిపిస్తుంది. ఈ కారులోని అటానమస్ లెవల్-2 ఫీచర్లలో భాగంగా, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొల్లైజన్ అలెర్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్ మరియు స్పీడ్ అసిస్ట్ వంటి ఫీచర్లు లభిస్తాయి.
ఈ కారులో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ స్మార్ట్ కీ ఉంటుంది. అంటే, కారును యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్ లాక్ చేయటం అన్‌లాక్ చేయటం చేయవచ్చు. MG Astor లో ఐ-స్మార్ట్ హబ్ కింద పార్కింగ్ అసిస్ట్ ఫీచర్ ను కూడా జోడించారు. ఈ ఫీచర్ సాయంతో దేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో పార్కింగ్ స్థలాన్ని గుర్తించవచ్చు.
MG Astor దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడినప్పటి నుంచి కూడా, కస్టమర్లనుంచి మంచి స్పందన పొందుతోంది. ఈ SUV ని కంపెనీ త్వరలో విడుదల చేస్తుంది, అయితే ఇది ఎలాంటి అమ్మకాలను పొందుతుందో త్వరలో తెలుస్తుంది.