MG Astor వేరియంట్స్ ఫీచర్లు వెల్లడి; అక్టోబర్ 2021లో విడుదల!

చైనీస్ కార్ బ్రాండ్ సంస్థ ఎమ్‌జి మోటార్ (MG Motor) గత కొంత కాలంగా భారత కార్ ప్రియులను ఊరిస్తూ వచ్చిన అధునాతన ఎస్‌యూవీ ఎమ్‌జి ఆస్టర్ (MG Astor) ను కంపెనీ త్వరలోనే మార్కెట్లో విడుదల చేయబోతోంది. ఈ నేపథ్యంలో, ఆస్టర్ వేరియంట్లోల లభించే ఫీచర్లు, పరికరాల వివరాలను కంపెనీ వెల్లడి చేసింది.

MG Astor వేరియంట్స్ ఫీచర్లు వెల్లడి; అక్టోబర్ 2021లో విడుదల!

ఎమ్‌జి మోటార్ ఇండియా సెప్టెంబర్ 15, 2021వ తేదీన ఈ ఎస్‌యూవీని భారత మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించింది. ఆధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) వంటి లేటెస్ట్ టెక్నాలజీతో కంపెనీ ఈ కారును అభివృద్ధి చేసింది. ఈ ఏడాది పండుగ సీజన్ లో ఇది కస్టమర్ల వద్దకు చేరుకోనుంది.

MG Astor వేరియంట్స్ ఫీచర్లు వెల్లడి; అక్టోబర్ 2021లో విడుదల!

అక్టోబర్ మొదటి వారంలో ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసేందుకు ఎమ్‌జి మోటార్ సిద్ధంగా ఉంది. అదే రోజున కంపెనీ ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ధర మరియు ఇతర వివరాలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. MG Astor ఎస్‌యూవీని కంపెనీ అటానమస్ లెవల్ -2 (Autonomous Level-2) సిస్టమ్ మరియు ఏఐ అసిస్టెంట్‌ (AI Assistanat) సాంకేతికతతో రూపొందించింది.

MG Astor వేరియంట్స్ ఫీచర్లు వెల్లడి; అక్టోబర్ 2021లో విడుదల!

ఈ కారులో కంపెనీ అనేక గొప్ప ఫీచర్లను అందించనుంది. ఎమ్‌జి గ్లోస్టర్ (MG Gloster) ఎస్‌యూవీలో అందిస్తున్న అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) లోని అనేక ఫీచర్లను ఈ కొత్త ఎమ్‌జి ఆస్టర్ (MG Astor) ఎస్‌యూవీలో కూడా చూడొచ్చు. ఈ కారును మార్కెట్‌లో లాంచ్ చేయడానికి ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున, కంపెనీ ఈ కొత్త ఎస్‌యూవీ యొక్క వేరియంట్లు, స్పెసిఫికేషన్‌లు మరియు ఇతర వివరాలను వెల్లడి చేసింది.

MG Astor వేరియంట్స్ ఫీచర్లు వెల్లడి; అక్టోబర్ 2021లో విడుదల!

MG Astor ఎస్‌యూవీ రెండు ఇంజన్ ఆప్షన్‌ లతో అందుబాటులోకి రానుంది. వీటిలో మొదటిది 220 టర్బో, 1349 సిసి (1.3 లీటర్) టర్బో పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 140 బిహెచ్‌పి వర్ ను మరియు 220 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో లభ్యం కానుంది.

MG Astor వేరియంట్స్ ఫీచర్లు వెల్లడి; అక్టోబర్ 2021లో విడుదల!

ఇకపోతే, ఇందులో రెండవ ఇంజన్ ఆప్షన్ 1498 సిసి (1.5 లీటర్) న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్ ను మరియు 144 న్యూటన్ మీటర్ టార్క్ ను జనరేట్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ మరియు 8 స్పీడ్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

MG Astor వేరియంట్స్ ఫీచర్లు వెల్లడి; అక్టోబర్ 2021లో విడుదల!

ఆస్టర్ 1.5 లీటర్ మాన్యువల్ గేర్‌బాక్స్ మోడల్ మొత్తం ఆరు వేరియంట్‌లలో లభ్యం కానుంది. అవి: స్టైల్, సూపర్, స్మార్ట్ ఎస్‌టిడి, స్మార్ట్, షార్ప్ ఎస్‌టిడి మరియు షార్ప్. అలాగే, ఇందులోని 1.5 లీటర్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వెర్షన్‌ను ఏడు వేరియంట్‌లలో అందించనున్నారు. అవి: సూపర్, స్మార్ట్ ఎస్‌టిడి, స్మార్ట్, షార్ప్ ఎస్‌టిడి, షార్ప్, శావీ మరియు శావీ రెడ్.

MG Astor వేరియంట్స్ ఫీచర్లు వెల్లడి; అక్టోబర్ 2021లో విడుదల!

ఇకపోతే, ఆస్టర్ 1.3 లీటర్ టర్బో ఆటోమేటిక్ వేరియంట్ మొత్తం ఏడు వేరియంట్లలో లభ్యం కానుంది. అవి: సూపర్, స్మార్ట్ ఎస్‌టిడి, స్మార్ట్, షార్ప్ ఎస్‌టిడి, షార్ప్, శావీ మరియు శావీ రెడ్. ఈ వేరియంట్‌లను బట్టి చూస్తుంటే, శావీ మరియు శావీ రెడ్ మోడళ్లు మెరుగైన పరికరాలు మరియు ఫీచర్లను కలిగి ఉంటాయని తెలుస్తోంది. కాగా, ఇందులోని బేస్ 'స్టైల్' వేరియంట్ కేవలం 1.5 లీటర్ మాన్యువల్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

MG Astor వేరియంట్స్ ఫీచర్లు వెల్లడి; అక్టోబర్ 2021లో విడుదల!

అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో రానున్న కొత్త ఆస్టర్ ఎస్‌యూవీలో 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, పానోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 6-వే పవర్-అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, బ్లూటూత్ డిజిటల్ కీ, 360 డిగ్రీ కెమెరా మరియు ఆటో హెడ్‌ల్యాంప్‌లతో సహా అనేక స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది.

MG Astor వేరియంట్స్ ఫీచర్లు వెల్లడి; అక్టోబర్ 2021లో విడుదల!

సేఫ్టీ విషయానికి వస్తే, ఈ చిన్న ఎస్‌యూవీలో కంపెనీ అనేక పెద్ద ఫీచర్లను కూడా అందిస్తోంది. వీటిలో ఎలక్ట్రానికి స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ డీసెంట్ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగులు, అన్ని చక్రాలపై డిస్క్ బ్రేకులు, ఈబిడితో కూడిన ఏబిఎస్, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ (TPMS), ఫార్వర్డ్ కొల్లైజన్ అలెర్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MG Astor వేరియంట్స్ ఫీచర్లు వెల్లడి; అక్టోబర్ 2021లో విడుదల!

ఈ కారులోని అటానమస్ లెవల్-2 ఫీచర్లలో భాగంగా, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, స్పీడ్ అసిస్ట్ సిస్టమ్, లేన్ డిపార్చర్ ప్రివెన్షన్, రియర్ డ్రైవ్ అసిస్ట్ (RDA) మరియు ఇంటెలిజెంట్ హెడ్‌ల్యాంప్ కంట్రోల్ (IHC) మొదలైనవి కూడా ఉన్నాయి. ఆస్టర్ ఎస్‌యూవీని ఎమ్‌జి మోటార్ కంపెనీ యొక్క లేటెస్ట్ 'కార్ యాజ్ ఏ ప్లాట్‌ఫామ్' (CAAP) కాన్సెప్ట్‌పై నిర్మించారు.

MG Astor వేరియంట్స్ ఫీచర్లు వెల్లడి; అక్టోబర్ 2021లో విడుదల!

ప్రస్తుతం, MG Motor భారత మార్కెట్లో విక్రయిస్తున్న MG ZS EV (ఎమ్‌జి జీఎస్ ఈవీ) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి పెట్రోల్ వెర్షన్ రూపమే ఈ కొత్త ఆస్టర్ ఎస్‌యూవీ. ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీని కంపెనీ ఐదు ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంచనుంది. వీటిలో బ్లాక్, వైట్, ఆరెంజ్, రెడ్ మరియు సిల్వర్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. దేశీయ విపణిలో ఎమ్‌జి ఆస్టర్ ప్రారంభ ధర సుమారు రూ. 11 లక్షల (ఎక్స్-షోరమ్) రేంజ్‌లో ఉంటుందని అంచనా.

MG Astor వేరియంట్స్ ఫీచర్లు వెల్లడి; అక్టోబర్ 2021లో విడుదల!

ఎమ్‌జి మోటార్ నుండి రాబోయే ఆస్టర్ మిడ్ -సైజ్ ఎస్‌యూవీ ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, మారుతి సుజుకి ఎస్ - క్రాస్, మహీంద్రా ఎక్స్‌యూనీ700 మరియు రెనాల్ట్ డస్టర్ వంటి మోడళ్లతో పోటీ పడనుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, భారతదేశంలో మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లతో లభించే మొట్టమొదటి వాహనం ఎమ్‌జి ఆస్టర్ అవుతుంది.

Most Read Articles

English summary
Mg astor variant details revealed ahead of official launch in october
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X