ఒక్కరోజులో 500 కంటే ఎక్కువ Astor కార్లను డెలివరీ చేసిన MG Motor: పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ ఎంజి మోటార్ (MG Motor) ఇటీవల కాలంలోనే కొత్త ఎంజి ఆస్టర్ (MG Astor) అనే అధునాతన టెక్నాలజీ కలిగిన కారుని దేశీయ మార్కెట్లో రూ. 9.78 లక్షల ప్రారంభ ధర వద్ద విడుదల చేసింది. ఈ SUV విడుదలైన అతి తక్కువ కాలంలోనే ఎక్కువమంది దృష్టిని ఆకర్షించగలిగింది.

ఒక్కరోజులో 500 కంటే ఎక్కువ Astor కార్లను డెలివరీ చేసిన MG Motor: పూర్తి వివరాలు

కంపెనీ ఈ కొత్త SUV కోసం బుకింగ్స్ 2021 అక్టోబర్ 21 నుంచి ప్రారభించింది. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 20 నిముషాలకంటే తక్కు సమయంలో అన్ని బుక్ చేయబడ్డాయి. దీన్ని బట్టి చూస్తే ఈ SUV కి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది.

ఒక్కరోజులో 500 కంటే ఎక్కువ Astor కార్లను డెలివరీ చేసిన MG Motor: పూర్తి వివరాలు

MG మోటార్ కంపెనీ ఇప్పుడు మొదటి దశ బుక్ చేసుకున్న కస్టమర్లకు కొత్త ఆస్టర్ కారును డెలివరీ చేయడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే కంపెనీ దేశంలోని ప్రధాన నగరాల్లో దసరా వేడుకల సందర్భంగా, కంపెనీ కేవలం ఒక్క రోజులో 500 యూనిట్లకు పైగా పంపిణీ చేసింది.

ఒక్కరోజులో 500 కంటే ఎక్కువ Astor కార్లను డెలివరీ చేసిన MG Motor: పూర్తి వివరాలు

MG Motor కంపెనీ బుక్ చేసుకున్న కస్టమర్లకు త్వరగా డెలివరీ చేయాలనే సంకల్పంతో ఉత్పత్తిని చాలా వేగంగా చేస్తుంది. ఇందులో భాగంగానే కంపెనీ 2021 చివరి నాటికి మొత్తం 5,000 MG Astor SUV లను డెలివరీ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తుంది. ఈ 5,000 కార్లను డెలివరీ చేయడానికి సెమీకండక్టర్ చిప్‌ల లభ్యతను పెంచడానికి కూడా ప్రయత్నిస్తోంది.

ఒక్కరోజులో 500 కంటే ఎక్కువ Astor కార్లను డెలివరీ చేసిన MG Motor: పూర్తి వివరాలు

కంపెనీ ఈ ఆధునిక SUV ని స్టైల్, సూపర్, స్మార్ట్ మరియు షార్ప్ అనే నాలుగు ట్రిమ్‌లలో లాంచ్ చేసింది, ఆ తర్వాత ఇటీవలే ఇందులో ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో కొత్త టాప్-స్పెక్ వేరియంట్ 'శావీ' వేరియంట్ విడుదల చేసింది. ఎమ్‌జి ఆస్టర్ శావీ ట్రిమ్ ప్రారంభ ధర రూ. 15.78 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

ఒక్కరోజులో 500 కంటే ఎక్కువ Astor కార్లను డెలివరీ చేసిన MG Motor: పూర్తి వివరాలు

కొత్త MG Astor అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. దీని ముందు భాగంలో గ్రిల్ మరియు ఎల్ఈడీ హెడ్‌లైట్, దాని క్రింద ఫాగ్ లైట్స్ ఉన్నాయి, దీనితో పాటు బంపర్‌పై లైన్‌లు కూడా ఇవ్వబడ్డాయి, కావున ఇది మంచి దూకుడు రూపాన్ని అందుకుంటుంది. సైడ్ ప్రొఫైల్ 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది, అంతే కాకుండా ఇండికేటర్‌తో పాటు ORVM లో చూడవచ్చు. ఈ కారు యొక్క గ్రిల్ భాగంలో 360 డిగ్రీ కెమెరా మరియు పార్కింగ్ కెమెరా వంటి వాటిని పొందుతుంది.

ఒక్కరోజులో 500 కంటే ఎక్కువ Astor కార్లను డెలివరీ చేసిన MG Motor: పూర్తి వివరాలు

MG Astor మూడు ఇంటీరియర్ కలర్ ఆప్సన్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులోని డ్రైవర్ సీటు ఆరు రకాలుగా అడ్జస్ట్ చేయవచ్చు. ఇందులో మూడు పవర్ స్టీరింగ్ మోడ్‌లు ఉన్నాయి. అవి స్టాండర్డ్, అర్బన్ మరియు డైనమిక్ మోడ్స్. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ SUV లో 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, 7 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మరియు ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్స్ పొందుతుంది.

ఒక్కరోజులో 500 కంటే ఎక్కువ Astor కార్లను డెలివరీ చేసిన MG Motor: పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త ఆస్టర్ 14 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో తీసుకువచ్చిన బ్రాండ్ యొక్క మొట్టమొదటి కారు. ఇది పర్సనల్ అసిస్టెంట్ సిస్టమ్ సహాయంతో కారులో ఇవ్వబడుతుంది. కావున ఇది మీ ఆదేశాలను వింటుంది. అంతే కాకుండా దీని ద్వారా మ్యూజిక్ ప్లే చేయవచ్చు, ఫోన్ కాల్స్ తీసుకోవచ్చు. దీనికోసం పారాలింపిక్ క్రీడాకారిణి మరియు ఖేల్ రత్న విజేత 'దీపా మాలిక్' వాయిస్ ఉపయోగించబడింది.

ఒక్కరోజులో 500 కంటే ఎక్కువ Astor కార్లను డెలివరీ చేసిన MG Motor: పూర్తి వివరాలు

MG Astor ఎస్‌యూవీ రెండు ఇంజన్ ఆప్షన్‌ లతో అందుబాటులోకి రానుంది. వీటిలో మొదటిది 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. రెండవది 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్

ఇందులోని 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 138 బిహెచ్‌పి వర్ ను మరియు 220 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో జత చేయబడి ఉంటుంది. ఇక 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 108 బిహెచ్‌పి పవర్ మరియు 144 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ మరియు 8-స్పీడ్ సివిటి గేర్‌బాక్స్‌తో వస్తుంది.

ఒక్కరోజులో 500 కంటే ఎక్కువ Astor కార్లను డెలివరీ చేసిన MG Motor: పూర్తి వివరాలు

కొత్త MG Astor మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీ కెమెరా, రియర్ డ్రైవ్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి 27 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటుంది.

ఒక్కరోజులో 500 కంటే ఎక్కువ Astor కార్లను డెలివరీ చేసిన MG Motor: పూర్తి వివరాలు

ఈ కొత్త SUV లో అటానమస్ లెవల్-2 సిస్టమ్‌ ఉంటుంది. కావున ఇది వినియోగాదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ SUV రిలయన్స్ జియో రియల్ టైమ్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు టెలిమాటిక్స్ కోసం భాగస్వామిగా ఉంది. దీని కోసం ఈ-సిమ్ మరియు లాట్ టెక్నాలజీ ఇవ్వబడుతుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోసం రోబోట్ స్క్రీన్ కూడా ఉంటుంది. ఇది వాహనదారుల ఆదేశాలను పాటిస్తుంది.

ఒక్కరోజులో 500 కంటే ఎక్కువ Astor కార్లను డెలివరీ చేసిన MG Motor: పూర్తి వివరాలు

ఇందులోని అటానమస్ లెవల్ -2 కింద, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్ మరియు స్పీడ్ అసిస్ట్ ఇవ్వబడతాయి. వీటితో పాటు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ కీని కలిగి ఉంది. ఎంజి ఆస్టర్‌కు ఐ-స్మార్ట్ హబ్ కింద పార్కింగ్ అసిస్ట్ అందించబడుతుంది. ఇది దేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో పార్కింగ్ స్థలాన్ని కనుగొనడానికి ఉపయోగపడుతుంది.

ఒక్కరోజులో 500 కంటే ఎక్కువ Astor కార్లను డెలివరీ చేసిన MG Motor: పూర్తి వివరాలు

Astor యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,323 మిమీ, వెడల్పు 1,809 మిమీ మరియు ఎత్తు 1,650 మిమీ వరకు ఉంటుంది. ఇదిలా ఉండగా కంపెనీ ఈ కొత్త SUV కోసం యాక్ససరీస్ కూడా విడుదల చేసింది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ MG Astor కోసం మొత్తం 70 యాక్ససరీస్ పరిచయం చేసింది. MG Astor యాక్ససరీస్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Mg delivers more than 500 units astor suv in a single day
Story first published: Wednesday, November 3, 2021, 9:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X