2021 ఎంజి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. చూసారా !

ఎంజి మోటార్ 2019 లో తన హెక్టర్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ లాంచ్ అయిన తరువాత, దాని డిజైన్, ధర మరియు ఫీచర్స్ కారణంగా దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందింది. సాధారణంగా చాలా మంది కార్ల తయారీదారులు ఏదైనా కొత్త వాహనాన్ని ప్రారంభించిన రెండు సంవత్సరాల తరువాత ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్‌ను తీసుకు వస్తారు. కానీ ఎంజి మోటార్ యొక్క హెక్టర్ మాత్రం ప్రారంభించిన 18 నెలల కాలంలోనే కొత్త ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేసింది.

2021 ఎంజి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. చూసారా !

ఎంజి మోటార్ కంపెనీ యొక్క కొత్త 2021 ఎంజి హెక్టర్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, దీని ప్రారంభ ధర రూ. 12,89,800 (ఎక్స్-షోరూమ్) కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 18,32,800 (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. హెక్టర్ ప్లస్‌లో మొదట ప్రవేశపెట్టిన కొత్త స్టార్రి బ్లూ కలర్ ఇప్పుడు స్టాండర్డ్ హెక్టర్ మోడల్‌కు కూడా జోడించబడింది. కొత్త 2021 హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

2021 ఎంజి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. చూసారా !

ఎక్స్టీరియర్ మరియు డిజైన్ :

2021 ఎంజి హెక్టర్ ఎస్‌యూవీని చూడటానికి మునుపటి మోడల్ మాదిరిగానే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ ఏ మాత్రం మారలేదు. కానీ దీని చుట్టూ ఉన్న కొన్ని మాత్రమే కొంత మార్పుకు గురయ్యాయి.

MOST READ:బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ బుకింగ్ డేట్ రిలీజ్.. పూర్తి వివరాలు

2021 ఎంజి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. చూసారా !

ఈ కొత్త 2021 ఎంజి హెక్టర్ ఎస్‌యూవీ యొక్క ముందు భాగంలో మార్పుకు గురైన మొదటి అంశం దాని గ్రిల్. ఇది క్రోమ్ ఇన్సర్ట్‌లతో బోల్డ్ థర్మో ప్రెస్డ్ ఫ్రంట్ గ్రిల్‌ను పొందుతుంది. ఇది కొత్త హెక్టర్ ఫేస్‌లిఫ్ట్‌కు ఆకర్షణీయమైన మరియు ఖరీదైన రూపాన్ని ఇస్తుంది. ఇది డైనమిక్ ఇండికేటర్స్ తో ఎల్ఇడి డిఆర్ఎల్ ను మరియు ముందు బంపర్‌లో పుల్ ఎల్ఇడి హెడ్‌లైట్ సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఇది తప్ప, ముందు భాగంలో ఇక ఎటువంటి మార్పు జరగలేదు. ఇందులో ఉన్న గ్రిల్ హెక్టర్ ఎస్‌యూవీని కొంత ప్రత్యేకంగా చూపిస్తుంది.

2021 ఎంజి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. చూసారా !

ఇక ఈ కొత్త ఎస్‌యూవీ సైడ్స్ కి వెళ్ళినట్లైతే, డ్యూయల్-టోన్‌లో పూర్తయిన కొత్త పెద్ద 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది. ఇది ఎంజి జెడ్ఎస్ ఈవిలో చూసినట్లుగా కనిపిస్తుంది. ఇది పెద్ద వాహనం కాబట్టి ఇప్పుడు మొత్తం చక్రాల పరిమాణంతో ముందుకు సాగినట్లు అనిపిస్తుంది. ఇవి కాకుండా మిగిలిన సైడ్ ప్రొఫైల్ ఒకేలా ఉంటుంది, మరియు ఎక్కువ క్రోమ్‌ను పొందుతాయి.

MOST READ:రతన్ టాటా వెహికల్ నెంబర్ వాడుతూ పట్టుబడ్డ యువతి.. తర్వాత ఏం జరిగిందంటే?

2021 ఎంజి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. చూసారా !

ఇందులో 360 డిగ్రీల కెమెరా ఫీచర్ కోసం, ప్రతి వైపు ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్ మరియు కెమెరాతో ఈ ఎస్‌యూవీ ఇప్పుడు బ్లాక్అవుట్ ORVM ను పొందుతుంది. మిగిలిన సైడ్ ప్రొఫైల్ ఒకేలా ఉంటుంది మరియు అవి కూడా చాలా క్రోమ్‌ను పొందుతాయి.

2021 ఎంజి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. చూసారా !

చివరగా ఈ కొత్త హెక్టర్ ఎస్‌యూవీ యొక్క వెనుక వైపుకు వెళ్ళినట్లైతే, ఇక్కడ గమనించదగ్గ మార్పు, టైల్లైట్స్ రెండింటినీ అనుసంధానించడానికి ఉపయోగించే రిప్లేక్టీవ్ స్ట్రిప్, డార్క్ రియర్ టెయిల్‌గేట్ తో భర్తీ చేయబడి ఉంటుంది. మీరు ఈ ఎస్‌యూవీ యొక్క దిగువ భాగంలో HECTOR బ్యాడ్జ్ మరియు ఇంటర్నెట్ ఇన్సైడ్ బ్యాడ్జ్ చూడవచ్చు. ఇది ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ మరియు సింగిల్ సైడ్-మౌంటెడ్ ఎగ్జాస్ట్ ను కూడా పొందుతుంది. దీని చుట్టూ క్రోమ్ కూడా ఉంటుంది.

MOST READ:వావ్ అమేజింగ్.. ఒక్క స్కూటర్ బ్రాండ్, 2.5 కోట్ల మంది కస్టమర్స్

2021 ఎంజి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. చూసారా !

ఇంటీరియర్ మరియు ఫీచర్స్ :

కొత్త 2021 ఎంజి హెక్టర్ లోపలికి అడుగు పెట్టగానే మీకు విశాలమైన క్యాబిన్ స్వాగతం పలుకుతుంది. ఇందులో భారీ పనోరమిక్ సన్‌రూఫ్ ఉంటుంది. ఈ కారణంగా, క్యాబిన్ చాల అద్భుతంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కొత్త హెక్టర్ ఫేస్‌లిఫ్ట్‌లో విలాసవంతమైన షాంపైన్ మరియు బ్లాక్ డ్యూయల్-టోన్ ఇంటీరియర్ అప్సన్స్ లభిస్తాయి.

2021 ఎంజి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. చూసారా !

హెక్టర్ ప్లస్‌లోని ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటో-డిమ్మింగ్ ఇంటీరియర్ రియర్-వ్యూ మిర్రర్ మరియు ఇండస్ట్రీ-ఫస్ట్ హింగ్లిష్ వాయిస్ కమాండ్స్ (ఇంటర్నెట్ ఎస్‌యూవీ ఇప్పుడు 35 కంటే ఎక్కువ హింగ్లిష్ వేరియస్ కార్ ఫంక్షన్స్ కంట్రోల్ కమాండ్స్ కలిగి ఉంటుంది) వంటివి ఉన్నాయి. సీట్ వెంటిలేషన్ సిస్టమ్ కోసం పనిచేయడానికి బటన్ పైన ఉన్న కో-ప్యాసింజర్ సీటు పక్కన అడిషినల్ యుఎస్బి ఛార్జింగ్ స్లాట్ కూడా ఇందులో జోడించబడింది.

MOST READ:అద్భుతంగా ఉన్న ఫోక్స్‌వ్యాగన్ టైగన్ టీజర్.. ఓ లుక్కేయండి

2021 ఎంజి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. చూసారా !

హెక్టర్ ఫేస్‌లిఫ్ట్‌కు డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్ లభిస్తుంది. ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు స్టీరింగ్ వీల్ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ నుండి తీసుకోబడ్డాయి. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉపయోగించడానికి చాలా సులభంగా ఉంటాయి. ఇందులో నచ్చని ఒక ఏమిటంటే, వెంటిలేటెడ్ సీట్ల కోసం బటన్‌ను ఉంచడం, వాటిని మరింత అందుబాటులో ఉండే ప్రదేశంలో ఉంచినట్లయితే మరింత అనుకూలంగా ఉండేది.

2021 ఎంజి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. చూసారా !

కొత్త హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ యొక్క ముందు సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అంతే కాకుండా ప్రయాణికునికి మంచి బ్యాక్ సఫోర్ట్ మరియు థాయ్ అండర్ సఫోర్ట్ కలిగి ఉంటుంది. మేము ఈ కారును డ్రైవ్ చేయకపోయినప్పటికీ, సుదీర్ఘ ప్రయాణంలో సీట్లు అలసిపోనివ్వకుండా చేస్తాయని ఖచ్చితంగా చెప్పగలము.

2021 ఎంజి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. చూసారా !

ఇక రెండవ వరుస సీట్ల విషయానికి వస్తే ఇవి విశాలంగా ఉంటాయి. అంతే కాకుండా ముగ్గురు ప్రయాణీకులను చాలా సులభంగా కూర్చోవడానికి వీలుకల్పిస్తుంది. ఎస్‌యూవీలో ఫ్లాట్ ఫ్లోర్ కూడా ఉంది. ఇది మధ్యలో కూర్చున్న వ్యక్తిని హాయిగా కూర్చునేలా చేస్తుంది.

2021 ఎంజి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. చూసారా !

ఇంజిన్ అప్సన్స్ :

ఎంజీ హెక్టర్ ఫేస్‌లిఫ్ట్‌లోని ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ ఎంపికలు అవుట్‌గోయింగ్ మోడల్‌తో సమానంగా ఉంటాయి. ఇది రెండు ఇంజన్ ఆప్షన్లతో అందించబడుతుంది. అవి 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, మరియు 2.0-లీటర్ డీజిల్ ఇంజన్.

2021 ఎంజి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. చూసారా !

ఇందులో ఉన్న 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 143 బిహెచ్‌పి మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగా, 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ 173 బిహెచ్‌పి మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఇవి 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌కు స్టాండర్డ్ గా జతచేయబడతాయి, నాన్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ అప్సనల్ డిసిటి ట్రాన్స్‌మిషన్ యూనిట్‌తో అందించబడుతుంది.

2021 ఎంజి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. చూసారా !

పెట్రోల్ ఇంజిన్‌ను 48 వి మైల్డ్-హైబ్రిడ్ వేరియంట్‌తో కూడా అందిస్తున్నారు, ఇది మంచి ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. కావున మంచి పనితీరుని కలిగి ఉండి వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.

2021 ఎంజి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. చూసారా !

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం :

కొత్త 2021 హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ కొత్త మార్పులతో చాలా ఆకర్షణీయంగా మరియు అద్భుతంగా ఉంది. వెంటిలేటెడ్ సీట్ల కోసం స్విచ్ మెరుగైన ప్రదేశానికి తరలించబడాలని, ప్యాసింజెర్ సైడ్ సీట్ హైట్ అడ్జస్ట్ మరియు కొన్ని ప్రదేశాల నుండి క్రోమ్ తొలగించే అవకాశం ఉందని మేము భావిస్తున్నాము.

2021 ఎంజి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. చూసారా !

ఈ కొత్త హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు మరీ అంత ఖరీదైనది కాదు. ఇది చాలా విశాలంగా ఉండటమే కాకుండా మంచి ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల ఫ్యామిలీ కార్ కొనాలని వేచిచూస్తున్న వారికి, ఈ హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ మంచి ఎంపిక అవుతుంది. ఎంజి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ భారత మార్కెట్లో రాబోయే జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్, టాటా హారియర్ మరియు నిస్సాన్ కిక్‌ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
2021 MG Hector Facelift SUV First Look. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X