Just In
- 1 hr ago సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- 4 hrs ago 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
- 5 hrs ago ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- 6 hrs ago బిలినీయర్ మనసుదోచిన ఆటో ఇదే!.. ధర తెలిస్తే మీరు కొనేస్తారు
Don't Miss
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- News రాజీనామాకు సిద్దం - కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Movies నాతో ఆ పని చేస్తావా? ఒక రాత్రికి ఎంత తీసుకుంటావ్.. జబర్ధస్త్ బ్యూటీ ఏమన్నదో చూశారంటే!
పెరిగిన 2021 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ధరలు; కొత్త ధరల జాబితా
చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ ఇండియా, ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన కొత్త 2021 హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్యూవీ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త మోడల్లో ఎంపిక చేసిన వేరియంట్లపై గరిష్టంగా రూ.10,000 వరకు ధరలు పెరిగాయి.
ధరల పెంపు తర్వాత కొత్త 2021 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ధరలు ఇప్పుడు రూ.12.90 లక్షల నుండి రూ.18.63 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ఈ ఏడాది జనవరిలోనే మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే.
ఎమ్‌జి హెక్టర్ స్టైల్, సూపర్, స్మార్ట్ మరియు షార్ప్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో 'స్టైల్' మరియు 'సూపర్' వేరియంట్ల ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. టాప్-ఎండ్ వేరియంట్ల ధరలు మాత్రం పెరిగాయి.
MOST READ:సైకిల్‌పై కేరళ నుంచి కాశ్మీర్ ప్రయాణానికి సిద్దమైన టీ అమ్మే కుర్రాడు, ఎందుకో మరి
కొత్త 2021 ఎమ్‌జి హెక్టర్ ఎస్యూవీ వేరియంట్ వారీ ధరలను క్రింది పట్టికలో గమనించవచ్చు:
Petrol | Old Price | New Price | Difference |
Style | ₹12.90 Lakh | ||
Super | ₹13.89 Lakh | ||
Smart DCT | ₹16.42 Lakh | ₹16.52 Lakh | ₹10,000 |
Sharp DCT | ₹18.00 Lakh | ₹18.10 Lakh | ₹10,000 |
Sharp DCT Dual Tone | ₹18.20 Lakh | ₹18.30 Lakh | ₹10,000 |
Petrol - Hybrid | |||
Super | ₹14.40 Lakh | ||
Smart | ₹15.66 Lakh | ₹15.76 Lakh | ₹10,000 |
Sharp | ₹17.00 Lakh | ₹17.10 Lakh | ₹10,000 |
Diesel | |||
Style | ₹14.21 Lakh | ||
Super | ₹15.31 Lakh | ||
Smart | ₹16.92 Lakh | ₹17.02 Lakh | ₹10,000 |
Sharp | ₹18.33 Lakh | ₹18.43 Lakh | ₹10,000 |
Sharp Dual Tone | ₹18.53 Lakh | ₹18.63 Lakh | ₹10,000 |
గమనిక: అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)
ధరలలో మార్పు మినహా కొత్త 2021 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్‌లో వేరే ఏ ఇతర మార్పులు లేవు. ఇటీవలే విడుదలైన ఈ కొత్త మోడల్ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో భారీ మార్పులు ఉన్నాయి.
MOST READ:విమనాలు ల్యాండ్ అయ్యేటప్పుడు వాటర్ సెల్యూట్ ఎదుకు చేస్తారో మీకు తెలుసా..?
ముందుగా ఎక్స్టీరియర్ మార్పులను గమనిస్తే, ఈ కొత్త 2021 ఎమ్‌జి హెక్టర్ ఇప్పుడు సరికొత్త క్రోమ్-స్టడెడ్ ఫ్రంట్ గ్రిల్, పెద్ద 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడి టెయిల్స్ లైట్స్ మధ్యలో రెడ్ స్ట్రిప్‌ను రీప్లేస్ చేసే బ్లాక్-అవుట్ ఎలిమెంట్ మరియు పైన రూఫ్ బ్లాక్ కలర్‌తో కూడిన డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
ఇంటీరియర్స్ విషయానికి వస్తే, కొత్త ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్‌లో ఆటో-డిమ్మింగ్ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్, వైర్లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ మరియు 'హింగ్లిష్' వాయిస్ కమాండ్స్‌ను సపోర్ట్ చేసే కొత్త ఐ-స్మార్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.
MOST READ:అంబానీ ఇంట చేరిన మరో 3 లగ్జరీ కార్లు ; వివరాలు
పాత తరం మోడల్లో కనిపించిన 10.4 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్ వంటి మరెన్నో ఫీచర్లు ఈ కొత్త మోడల్లోనూ ఉన్నాయి.
ఇంజన్ పరంగా కొత్త 2021 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్‌లో ఎలాంటి మార్పులు లేవు. ఇందులోని 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 140 బిహెచ్పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పెట్రోల్ ఇంజన్ ఆప్షనల్ 48వి హైబ్రిడ్ సిస్టమ్‌తో లభిస్తుంది.
MOST READ:ఔరా.. ఏమి క్రియేషన్.. స్కూటర్ సైకిల్ అయిపోయింది
ఇది డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది. ఇందులోని 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ 170 బిహెచ్పి పవర్‌ను మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. పెట్రోల్ ఆప్షనల్ సెవన్-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.