50,000వ ఎమ్‌జి హెక్టర్ విడుదల; దీనిని తయారు చేసిన వారంతా మహిళలే

చైనాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎమ్‌జి (మోరిస్ గ్యారేజ్) మోటార్స్ భారత మార్కెట్లో తమ 50,000వ హెక్టర్ ఎస్‌యూవీని ఉత్పత్తి చేసినట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేకమైన ఎస్‌యూవీని పూర్తిగా మహిళా సిబ్బందితో తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది.

50,000వ ఎమ్‌జి హెక్టర్ విడుదల; దీనిని తయారు చేసిన వారంతా మహిళలే

ఎమ్‌జి మోటార్స్ విడుదల చేసిన ఈ 50,000వ హెక్టర్ ఎస్‌యూవీని ప్రారంభం నుండి చివరి వరకు పూర్తిగా మహిళా ఉద్యోగులే తయారు చేశారు. ప్రొడక్షన్ సమయంలో షీట్ మెటల్‌ను బెండ్ చేయటం మరియు వెల్డింగ్ మొదలుకొని ప్రొడక్షన్ పూర్తయిన తర్వాత టెస్ట్ రన్ వరకూ పూర్తిగా మహిళలే దీనిని తయారు చేశారు.

50,000వ ఎమ్‌జి హెక్టర్ విడుదల; దీనిని తయారు చేసిన వారంతా మహిళలే

ఎమ్‌జి మోటార్ ఇండియాకు గుజరాత్‌లోని హలోల్ వద్ద ఓ ఉత్పాదక కేంద్రాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం ఈ ప్లాంటులో 33 శాతం మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి సామర్థ్యాన్ని 50 శాతానికి పెంచాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. స్థానికులకు సైతం సమాన ఉద్యోగ అవకాశాలను కల్పించేలా కంపెనీ చర్యలు తీసుకుంటోంది.

MOST READ:మీ వాహనంపై ఈ స్టిక్కర్ ఉందా.. ఉంటే వెంటనే తీసెయ్యండి.. లేకుంటే ?

50,000వ ఎమ్‌జి హెక్టర్ విడుదల; దీనిని తయారు చేసిన వారంతా మహిళలే

ఇక ఎమ్‌జి హెక్టర్ విషయానికి వస్తే, కంపెనీ ఈ ఏడాది జనవరి నెలలో ఇందులో 2021 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్లో కొత్త 2021 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ధరలు రూ.12.90 లక్షల నుండి రూ.18.63 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

50,000వ ఎమ్‌జి హెక్టర్ విడుదల; దీనిని తయారు చేసిన వారంతా మహిళలే

కొత్త 2021 ఎమ్‌జి హెక్టర్ కూడా మునుపటి మాదిరిగానే స్టైల్, సూపర్, స్మార్ట్ మరియు షార్ప్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఎస్‌యూవీ కేవలం 5-సీటర్ ఆప్షన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో అధిక సీటింగ్ సామర్థ్యం కోరుకునే వారి కోసం కంపెనీ హెక్టర్ ప్లస్ అనే ఎస్‌యూవీని కూడా అందిస్తోంది.

MOST READ:టయోటా అర్బన్ క్రూయిజర్ రివ్యూ.. ఇది విటారా బ్రెజ్జా కంటే మంచిదా, కాదా ?

50,000వ ఎమ్‌జి హెక్టర్ విడుదల; దీనిని తయారు చేసిన వారంతా మహిళలే

ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఇప్పుడు సరికొత్త క్రోమ్-స్టడెడ్ ఫ్రంట్ గ్రిల్, పెద్ద 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడి టెయిల్స్ లైట్స్ మధ్యలో రెడ్ స్ట్రిప్‌ను రీప్లేస్ చేసే బ్లాక్-అవుట్ ఎలిమెంట్ మరియు పైన బ్లాక్ కలర్ రూఫ్‌తో కూడిన డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

50,000వ ఎమ్‌జి హెక్టర్ విడుదల; దీనిని తయారు చేసిన వారంతా మహిళలే

కొత్త 2020 హెక్టర్ ఇంటీరియర్స్‌ను గమనిస్తే, పాత మోడల్‌లో కనిపించిన బ్లాక్ థీమ్‌కి బదులుగా కొత్త డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్‌ను ఇందులో ఆఫర్ చేస్తారు. ఇంకా ఇందులో ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ వంటి ఫీచర్లను అందిస్తున్నారు.

MOST READ:భారత మార్కెట్లో రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్ కార్స్ డిమాండ్.. కారణం ఇదే

50,000వ ఎమ్‌జి హెక్టర్ విడుదల; దీనిని తయారు చేసిన వారంతా మహిళలే

ఈ కారులో కొత్తగా హింగ్లిష్ వాయిస్ కమాండ్స్‌ను సపోర్ట్ చేసే కొత్త ఐ-స్మార్ట్ కనెక్టింగ్ టెక్నాలజీని అందిస్తున్నారు. దీనిని 10.4 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ఇంకా ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్ వంటి మరెన్నో ఫీచర్లు కూడా ఉన్నాయి.

50,000వ ఎమ్‌జి హెక్టర్ విడుదల; దీనిని తయారు చేసిన వారంతా మహిళలే

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2021 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 140 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పెట్రోల్ ఇంజన్ ఆప్షనల్ 48వి హైబ్రిడ్ సిస్టమ్‌తో కూడా లభిస్తుంది. ఇది స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ మరియు ఆప్షనల్ సెవన్-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:మనవరాలు చదువు కోసం ఉంటున్న ఇల్లు అమ్మేసిన 74 ఏళ్ల రియల్ హీరో

50,000వ ఎమ్‌జి హెక్టర్ విడుదల; దీనిని తయారు చేసిన వారంతా మహిళలే

ఎమ్‌జి హెక్టర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది. ఇందులో 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 170 బిహెచ్‌పి పవర్‌ను మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేదు.

Most Read Articles

English summary
MG Motor Rolls Out 50,000th Unit Of Hector SUV, Completely Made By Women Workers. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X