భారతీయ మార్కెట్లో హెక్టర్ షైన్ వేరియంట్ విడుదల చేసిన ఎమ్‌జి మోటార్: ధర & వివరాలు

చైనా కార్ల తయారీ దిగ్గజం ఎమ్‌జి మోటార్, భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు తన 'హెక్టర్ షైన్ వేరియంట్' విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త ఎమ్‌జి హెక్టర్ షైన్ వేరియంట్ ధర రూ. 14.51 లక్షలు(ఎక్స్-షోరూమ్,ఢిల్లీ). షైన్ వేరియంట్ ఇప్పుడు హెక్టర్ ఎస్‌యూవీ యొక్క కొత్త మిడ్-స్పెక్ వేరియంట్.

అంతే కాకుండా ఈ కొత్త ఎస్‌యూవీ హవానా గ్రే సింగిల్-టోన్ కలర్ స్కీమ్‌లో అందించబడింది. ఈ ఎస్‌యూవీ యొక్క బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కావున కొనుగోలుచేయాలనుకునే కస్టమర్లు ఆన్లైన్ లో లేదా కంపెనీ డీలర్షిప్ లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి.

భారతీయ మార్కెట్లో హెక్టర్ షైన్ వేరియంట్ విడుదల చేసిన ఎమ్‌జి మోటార్: ధర & వివరాలు

కొత్త ఎమ్‌జి హెక్టర్ షైన్ వేరియంట్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. హెక్టర్ షైన్ ఎస్‌యూవీ యొక్క ఎక్స్టీరియర్ విషయానికి వస్తే ఇందులో క్రోమ్-స్టడ్డ్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు మరియు ముందు భాగంలో ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, బాడీ క్లాడింగ్, షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు రూఫ్ రైల్స్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి.

2021 MG Hector Pricing
Varians Petrol Petrol Hybrid Diesel
Style MT ₹13.49 Lakh NA ₹14.98 Lakh
Style AT NA NA NA
Super MT ₹14.16 Lakh ₹14.99 Lakh ₹15.99 Lakh
Super AT NA NA NA
Shine MT ₹14.51 Lakh NA ₹16.49 Lakh
Shine AT ₹15.71 Lakh NA NA
Smart MT NA ₹16.37 Lakh ₹17.79 Lakh
Smart AT ₹16.99 Lakh NA NA
Sharp MT NA ₹17.69 Lakh ₹19.20 Lakh
Sharp AT ₹18.69 Lakh NA NA
భారతీయ మార్కెట్లో హెక్టర్ షైన్ వేరియంట్ విడుదల చేసిన ఎమ్‌జి మోటార్: ధర & వివరాలు

ఎమ్‌జి హెక్టర్ షైన్ యొక్క క్యాబిన్ లోపల సెంటర్ స్టేజ్‌లో ఆండ్రాయిడ్ ఆటో & యాపిల్ కార్‌ప్లే కనెక్ట్ చేయబడిన టెక్నాలజీని కలిగి ఉన్న 10.4 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ నిలువుగా ఉంటుంది. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో సెమీ డిజిటల్ సెటప్ 3.5 ఇంచెస్ ఎమ్ఐడి రెండు వైపులా అనలాగ్ డయల్‌లతో ఉంటుంది. వీటితో పాటు ఫాబ్రిక్ అపోల్స్ట్రే, మాన్యువల్ ఏసీ, పవర్ అడ్జస్టబుల్ ORVM లు, క్రూయిజ్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్ మరియు హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటివి కూడా ఉన్నాయి.

భారతీయ మార్కెట్లో హెక్టర్ షైన్ వేరియంట్ విడుదల చేసిన ఎమ్‌జి మోటార్: ధర & వివరాలు

కొత్త షైన్ వేరియంట్ బ్రాండ్ యొక్క ఐ స్మార్ట్ కనెక్ట్ టెక్నాలజీని పొందుపరిచిన ఈసిమ్ ద్వారా ప్రారంభించబడింది. ఇది 100 కి పైగా ఆదేశాలను ఉపయోగించి ఈ ఎస్‌యూవీని కంట్రోల్ చేయడానికి ఆన్‌బోర్డ్ వాయిస్ అసిస్టెంట్‌తో మాట్లాడవచ్చు. ఇది మాత్రమే కాకుండా కారుని రిమోట్‌ ద్వారా కంట్రోల్ చేయడానికి ఐ స్మార్ట్ మొబైల్ అప్లికేషన్‌ను కూడా ఉపయోగించవచ్చు.

భారతీయ మార్కెట్లో హెక్టర్ షైన్ వేరియంట్ విడుదల చేసిన ఎమ్‌జి మోటార్: ధర & వివరాలు

హెక్టర్ షైన్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులోని ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు మరియు డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హిల్ హోల్డ్ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబిడి, బ్రేక్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ కెమెరా, కార్నర్ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మారియు ఇసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు కూడా నదుబాటలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రయాణికుల భద్రతను నిర్ధరిస్తాయి.

భారతీయ మార్కెట్లో హెక్టర్ షైన్ వేరియంట్ విడుదల చేసిన ఎమ్‌జి మోటార్: ధర & వివరాలు

ఎమ్‌జి హెక్టర్ షైన్ వేరియంట్ మూడు ఇంజిన్ ఎంపికలలో అందించబడుతుంది. అవి 1.5-లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ విత్ మైల్డ్ హైబ్రిడ్ టెక్ మరియు 2.0-లీటర్ టర్బో-డీజిల్. ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో ఇంజిన్ ఆధారంగా మాన్యువల్ మరియు ఆటోమేటిక్ యూనిట్లు ఉంటాయి.

భారతీయ మార్కెట్లో హెక్టర్ షైన్ వేరియంట్ విడుదల చేసిన ఎమ్‌జి మోటార్: ధర & వివరాలు

ఇందులోని 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 5000 ఆర్‌పిఎమ్ వద్ద 142 బిహెచ్‌పి పవర్ మరియు 3,600 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా ఇందులోని రెండవ 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ విత్ మైల్డ్ హైబ్రిడ్ టెక్ ఇంజిన్ కూడా 5000 ఆర్‌పిఎమ్ వద్ద 142 బిహెచ్‌పి పవర్ మరియు 3,600 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండూ కూడా 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కి జతచేయబడి ఉంటాయి.

భారతీయ మార్కెట్లో హెక్టర్ షైన్ వేరియంట్ విడుదల చేసిన ఎమ్‌జి మోటార్: ధర & వివరాలు

ఇక చివరగా మూడవ ఇంజిన్ అయిన 2.0-లీటర్ టర్బో-డీజిల్ విషయానికి వస్తే, ఇది 3,750 ఆర్‌పిఎమ్ వద్ద 168 బిహెచ్‌పి పవర్ మరియు 2,500 ఆర్‌పిఎమ్ వద్ద 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.

భారతీయ మార్కెట్లో హెక్టర్ షైన్ వేరియంట్ విడుదల చేసిన ఎమ్‌జి మోటార్: ధర & వివరాలు

ఎమ్‌జి మోటార్ ఈ కొత్త ఎస్‌యూవీపై 5 సంవత్సరాలు లేదా 1,50,000 కిలోమీటర్ల వారంటీ మరియు 5 సంవత్సరాల రోడ్-సైడ్ అసిస్టెన్స్ తో పాటు, 5 లేబర్ ఫ్రీ సర్వీస్ వంటి వాటిని అందిస్తుంది. ఈ విభాగంలో హెక్టర్ ఎస్‌యూవీ యొక్క మెయింటెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

భారతీయ మార్కెట్లో హెక్టర్ షైన్ వేరియంట్ విడుదల చేసిన ఎమ్‌జి మోటార్: ధర & వివరాలు

ఎమ్‌జి మోటార్ కంపెనీ ఇటీవల దేశీయ మార్కెట్లో ఉన్న కంపెనీ యొక్క అన్ని బ్రాండ్ల ధరలను పెంచింది. కంపెనీ ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం వల్ల వాహనాల ధరలు కూడా పెరిగినాలు కంపెనీ తెలిపింది. భారతీయ మార్కెట్లో కొత్త ఎమ్‌జి హెక్టర్ షైన్ వేరియంట్ మహీంద్రా ఎక్స్‌యూవీ 500, టాటా హారియర్, జీప్ కంపాస్, ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్, కియా సెల్టోస్ మరియు హ్యుందాయ్ క్రెటా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Mg hector shine variant launched price 14 51 lakh features engine details
Story first published: Thursday, August 12, 2021, 13:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X