MG Astor లో కొత్త శావీ వేరియంట్.. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లతో..

చైనాకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎమ్‌జి మోటార్ (MG Motor) తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఎమ్‌జి ఆస్టర్ (MG Astor) లైనప్ లో కంపెనీ మరో కొత్త వేరియంట్ ను విడుదల చేసేందకు ప్లాన్ చేస్తోంది.

MG Astor లో కొత్త శావీ వేరియంట్.. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లతో..

ప్రస్తుతం, దేశీయ విపణిలో ఎమ్‌జి ఆస్టర్ స్టైల్, సూపర్, స్మార్ట్ మరియు షార్ప్ అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. కాగా, కంపెనీ ఇందులో ఇప్పుడు కొత్తగా శావీ అనే టాప్-ఎండ్ వేరియంట్ ను విడుదల చేయాలని భావిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కొత్త ఆస్టర్ శావీ వేరియంట్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లతో అందుబాటులోకి రానుంది.

MG Astor లో కొత్త శావీ వేరియంట్.. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లతో..

ఎమ్‌జి మోటార్ ఇండియా తమ లేటెస్ట్ ఎస్‌యూవీ ఆస్టర్ ను రూ. 9.78 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసిన సంగతి తెలిసినదే. తాజా సమాచారం ప్రకారం, కంపెనీ కొత్త MG Astor - Savvy పేరుతో టాప్-స్పెక్ వేరియంట్ ను ప్రవేశపెట్టబోతోంది. ఈ వేరియంట్‌లో కంపెనీ అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఈ కొత్త వేరియంట్ ధర, మరియు ఫీచర్ల జాబితా త్వరలో వెల్లడవుతుందని భావిస్తున్నారు.

MG Astor లో కొత్త శావీ వేరియంట్.. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లతో..

కొత్త ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీలో అందుబాటులో ఉన్న ADAS ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, పైలట్ అసిస్టెన్స్, హై-బీమ్ అసిస్ట్, బ్లైండ్-స్పాట్ మోనిటరింగ్, లేన్-కీప్ అసిస్ట్, ఫ్రంట్ కొల్లైజన్ అలెర్ట్ మరియు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి గొప్ప ఫీచర్లు ఉన్నాయి. ఈ సెగ్మెంట్లో ఇలాంటి అధునాత ఫీచర్లతో వచ్చిన మొట్టమొదటి కారు కూడా ఎమ్‌జి ఆస్టర్ కావడం విశేషం.

MG Astor లో కొత్త శావీ వేరియంట్.. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లతో..

ప్రస్తుతానికి, కొత్త ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీ యొక్క టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 16.78 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఎమ్‌జి ఆస్టర్ కోసం బుకింగ్‌లు అక్టోబర్ 21, 2021వ తేది నుండి ప్రారంభం కానున్నాయి. ఆసక్తిగల కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా కానీ లేదా డీలర్‌షిప్ ద్వారా కానీ బుక్ చేసుకోవచ్చు.

MG Astor లో కొత్త శావీ వేరియంట్.. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లతో..

ఈ ఎస్‌యూవీని ముందుగా రిజర్వ్ చేసుకున్న వారికి నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో డెలివరీలు జరుగుతాయని కంపెనీ పేర్కొంది. కాగా, తాజా సమాచారం ప్రకారం, ఈ కొత్త ప్రారంభ ధరలు 2021 లో పంపిణీ చేయాల్సిన యూనిట్లకు మాత్రమే వర్తిస్తాయని తెలుస్తుంది. వచ్చే ఏడాది నుండి ఈ ఎస్‌యూవీ ధరలు పెరిగే అవకాశం ఉంది. మొదటి బ్యాచ్‌లో భాగంగా 3000 యూనిట్లను డెలివరీ చేయవచ్చని సమాచారం.

MG Astor లో కొత్త శావీ వేరియంట్.. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లతో..

ఎమ్‌జి ఆస్టర్ డిజైన్‌ను గమనిస్తే, ఇందులో ఎమ్‌జి సిగ్నేచర్ హెక్సాగనల్ 'సెలెస్టియల్' ఫ్రంట్ గ్రిల్, సన్నని బంపర్లు, షార్ప్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడి టెయిల్ లైట్లు, టర్న్ ఇండికేటర్లతో కూడిన సైడ్ మిర్రర్స్, రీడిజైన్ చేసిన 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ మరియు పానోరమిక్ సన్‌రూఫ్ వంటి డిజైన్ ఎలిమెంట్స్‌తో ఇది మంచి ప్రీమియం లుక్‌ని కలిగి ఉంటుంది.

MG Astor లో కొత్త శావీ వేరియంట్.. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లతో..

ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీని కంపెనీ మొత్తం 5 ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్‌ లలో అందుబాటులో ఉంచింది. వీటిలో స్పైస్డ్ ఆరెంజ్, అరోరా సిల్వర్, గ్లేజ్ రెడ్, క్యాండీ వైట్ మరియు స్టారీ బ్లాక్ అనే కలర్ ఆప్షన్లు ఉన్నాయి. అలాగే, ఇంటీరియర్‌లో మూడు అంతర్గత కలర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఇందులోని డ్రైవర్ సీటును ఆరు రకాలుగా సర్దుబాటు చేసుకునే సౌకర్యం ఉంటుంది.

MG Astor లో కొత్త శావీ వేరియంట్.. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లతో..

ఇంకా ఇందులో మూడు రకాల పవర్ స్టీరింగ్ మోడ్‌లు (నార్మల్, అర్బన్ మరియు డైనమిక్), పెద్ద 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, డ్రైవర్ సమాచారం కోసం 7.0 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, ఎయిర్ ప్యూరిఫైయర్, పిఎం 2.5 ఎయిర్ ఫిల్టర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ మరియు క్యాబిన్‌లో అక్కడక్కడా బ్రష్డ్ అల్యూమినియం యాక్సెంట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MG Astor లో కొత్త శావీ వేరియంట్.. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లతో..

సేఫ్టీ విషయానికి వస్తే, ఎమ్‌జి ఆస్టర్ లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBD తో కూడిన ABS, బ్రేక్ అసిస్ట్, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), TCS (ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్), HHC (హిల్ హోల్డ్ కంట్రోల్), HDC (హిల్ డీసెంట్ కంట్రోల్), ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ (ESS), ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్ మరియు నాలుగు చక్రాలపై 4 డిస్క్ బ్రేకులు మొదలైనవి ఉన్నాయి.

MG Astor లో కొత్త శావీ వేరియంట్.. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లతో..

ఇక ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఎమ్‌జి ఆస్టర్‌ను కంపెనీ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో అందిస్తోంది. ఇందులో మొదటి 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు రెండవది 1.5 లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్. దీని టర్బో పెట్రోల్ ఇంజన్ 138 బిహెచ్‌పి పవర్ మరియు 220 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

MG Astor లో కొత్త శావీ వేరియంట్.. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లతో..

అలాగే, ఇందులోని న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ 108 బిహెచ్‌పి పవర్ మరియు 144 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 8-స్పీడ్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

Most Read Articles

English summary
Mg motor add new savvy variant in astor lineup with advanced driver assistance features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X