చిల్డ్రన్స్ డెవలప్మెంట్ కోసం హైదరాబాద్ ఎంజి సెంటర్ సభ్యులు చేయూత

భారతదేశంలోని చాలా వాహనతయారీదారు అప్పుడపుడు తమ ఉదారతను చాటుకుంటుంటారు. కరోనా మహమ్మరి నేపథ్యంలో చాలా కంపెనీలు ఇటువంటి సహాయాలు చేయడానికి ముందుకువచ్చాయి. ఇందులో ఒకటి ఎంజి మోటార్ కంపెనీ. ఎంజి మోటార్ కంపెనీ తమ హెక్టర్ వాహనాలను అంబులెన్సులుగా మార్చి చాలా హాస్పిటల్స్ కి అందించారు. దీనికి సంబందించిన సమాచారం ఇదివరకటి కథనాలలో తెలుసుకున్నాం..

చిల్డ్రన్స్ డెవలప్మెంట్ కోసం హైదరాబాద్ ఎంజి సెంటర్ సభ్యులు చేయూత

ఇప్పుడు ఎంజి మోటార్ కంపెనీ యొక్క హైదరాబాద్ కి చెందిన "ఎంజి మోటార్ కార్ క్లబ్" యూనిట్ పిల్లల అభివృద్ధి కోసం మరో అడుగు ముందుకు వేశారు. నివేదికల ప్రకారం ఆంద్రప్రదేశ్ లోని గండికోట ప్రాధమిక పాఠశాలకు తమ వంతు చేయూతను అందించారు. ఎంజి 'మోటార్ కార్ క్లబ్ ఇండియా' యొక్క హైదరాబాద్ సెంటర్ సభ్యులు గండికోట గ్రాండ్ కాన్యన్లో ప్రయాణించి పిల్లల అభివృద్ధికి తోడ్పడ్డారు.

చిల్డ్రన్స్ డెవలప్మెంట్ కోసం హైదరాబాద్ ఎంజి సెంటర్ సభ్యులు చేయూత

ఇది నిజంగా ప్రశంసించదగ్గ విషయం. ఇక్కడ ఫోటోలను గమనించినట్లయితే ఎంజి మోటార్ కార్ క్లబ్ సభ్యులు స్కూల్స్ వద్ద ఉండటం కూడా చూడవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఈ యూనిట్ సభ్యులు ఇలాంటి కార్యక్రమాలు ఇంతకు ముందు కూడా చేశారు.

చిల్డ్రన్స్ డెవలప్మెంట్ కోసం హైదరాబాద్ ఎంజి సెంటర్ సభ్యులు చేయూత

2021 మార్చి 7 న ఎంజి మోటార్స్ షోరూం, వడోదర ఎంజిసిసి ఇండియా మరియు కాయకల్ప్ లయన్స్ బ్లైండ్ గర్ల్స్ స్కూల్ కోసం ఒక కార్యక్రమం కూడా నిర్వహించారు.

చిల్డ్రన్స్ డెవలప్మెంట్ కోసం హైదరాబాద్ ఎంజి సెంటర్ సభ్యులు చేయూత

ఎంజి మోటార్ కంపెనీ భారతదేశంలో ప్రవేశించిన అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రజాధారణపొందింది. ఈ కంపెనీ నుంచి వచ్చిన ఉత్పత్తులు మార్కెట్లో మంచి అమ్మకాలతో దూసుకెళ్తున్నాయి. కంపెనీ కూడా తమ ఉత్పత్తులలో లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలతో అందిస్తుంది.

MOST READ:కవాసకి ఆఫ్-రోడ్ బైక్‌లపై అదిరిపోయే ఆఫర్లు.. త్వరపడండి, కేవలం పరిమిత కాలం వరకు మాత్రమే

చిల్డ్రన్స్ డెవలప్మెంట్ కోసం హైదరాబాద్ ఎంజి సెంటర్ సభ్యులు చేయూత

ఎంజి మోటార్ కంపెనీ ఇటీవల భారత మార్కెట్లో కొత్త ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఉత్పత్తులు కూడా చాలామంది వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇవి మునుపటి మెడల్స్ కంటే కొంత అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉన్నాయి.

చిల్డ్రన్స్ డెవలప్మెంట్ కోసం హైదరాబాద్ ఎంజి సెంటర్ సభ్యులు చేయూత

చైనా కార్ దిగ్గజం ఎమ్‌జి మోటార్స్, భారత మార్కెట్ కోసం తమ సరికొత్త ఎమ్‌జి జెడ్ఎస్ పెట్రోల్ వెర్షన్ ఎస్‌యూవీని 'ఆస్టర్' అని పిలిచే అవకాశం ఉంది. ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి ఇది భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

MOST READ:టైర్లు లేని ఈ ట్రాక్టర్, వ్యవసాయానికి బలేగుంది గురూ..!

చిల్డ్రన్స్ డెవలప్మెంట్ కోసం హైదరాబాద్ ఎంజి సెంటర్ సభ్యులు చేయూత

ఎంజి మోటార్ కంపెనీ యొక్క గత ఫిబ్రవరి నెల అమ్మకాలు కూడా చాలా మెరుగుపడ్డాయి. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 2021లో ఎంజి మోటార్ ఇండియా మొత్తం 4,329 యూనిట్ల వాహనాలను విక్రయించి కంపెనీ అత్యధిక రిటైల్ అమ్మకాల గణాంకాలను నమోదు చేసినట్లు ప్రకటించింది.

Most Read Articles

English summary
MG Members Of Hyderabad Centre Traveled To Gandikota Grand Canyon And Contributed To The Development Of Children. Read in Telugu.
Story first published: Saturday, March 13, 2021, 11:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X