భారత్‌లో ఎమ్‌జి గ్లోస్టర్ శావీ 7-సీటర్ వేరియంట్‌ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

చైనాకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎమ్‌జి మోటార్, దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ గ్లోస్టర్‌లో కంపెనీ ఓ కొత్త వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఎమ్‌జి గ్లోస్టర్ శావీ పేరుతో వచ్చిన ఈ కొత్త 7-సీటర్ వేరియంట్ ధర రూ.37.28 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది.

భారత్‌లో ఎమ్‌జి గ్లోస్టర్ శావీ 7-సీటర్ వేరియంట్‌ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

గ్లోస్టర్ ప్రీమియం ఎస్‌యూవీ యొక్క టాప్ వేరియంట్ ఇప్పుడు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా 6 మరియు 7 సీటింగ్ కాన్ఫిగరేషన్‌లతో అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా, సీటింగ్ ఆప్షన్ మారితే, కారు ధర కూడా మారుతుంది. అయితే, ఈ వేరియంట్‌లో కస్టమర్లపై ఎలాంటి అదనపు భారం వేయకుండానే 6 లేదా 7 సీట్ల ఆప్షన్‌ను కంపెనీ అందిస్తోంది.

Variant Turbo Diesel Twin Turbo Diesel
6 Seater 7 Seater 6 Seater 7 Seater
Super - ₹29,98,000 - -
Smart ₹32,38,000 - - -
Sharp - - ₹35,78,000 ₹35,78,000
Savvy - - ₹37,28,000 ₹37,28,000
భారత్‌లో ఎమ్‌జి గ్లోస్టర్ శావీ 7-సీటర్ వేరియంట్‌ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఎమ్‌జి గ్లోస్టర్ విషయంలో అనేక కస్టమర్ల నుండి అందుకున్న ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కంపెనీ ఈ ఎస్‌యూవీలో శావీ వేరియంట్‌పై కొత్తగా ఏడు సీట్ల కాన్ఫిగరేషన్ ఆప్షన్‌ను పరిచయం చేసింది. ఇదివరకు గ్లోస్టర్ షార్ప్ వేరియంట్ మాత్రమే ఈ విధంగా రెండు రకాల సీటింగ్ కాన్ఫిగరేషన్‌లతో లభ్యమయ్యేది. గతంలో శావీ వేరియంట్‌ను కేవలం 6 సీట్ల లేఅవుట్‌తో మధ్య వరుసలో కెప్టెన్ సీట్లతో అందించేవారు.

భారత్‌లో ఎమ్‌జి గ్లోస్టర్ శావీ 7-సీటర్ వేరియంట్‌ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

కాగా, కొత్తగా ప్రవేశపెట్టిన గ్లోస్టర్ శావీ వేరియంట్ 7-సీటర్ మోడల్‌లో మధ్య వరుసలో రెండు కెప్టెన్ సీట్లకు బదులుగా ఓ బెంచ్ సీటును ఏర్పాటు చేశారు. ఫలితంగా, ఈ వరుసలో ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. మరింత సౌకర్యం కోసం ఈ మధ్య వరుసలోని సీటు మధ్య భాగంలో ఫోల్డబుల్ ఆర్మ్‌రెస్ట్‌ను కూడా అందించారు.

భారత్‌లో ఎమ్‌జి గ్లోస్టర్ శావీ 7-సీటర్ వేరియంట్‌ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త ఎమ్‌జి గ్లోస్టర్ శావీ 7-సీటర్ వేరియంట్‌లో కొత్త 7-సీటర్ ఆప్షన్ మినహా వేరే ఏ ఇతర మార్పులు లేవు. ఇందులోని అన్ని ఫీచర్లు మరియు టెక్నాలజీలు 6-సీట్ల శావీ వేరియంట్ మాదిరిగానే ఉంటాయి. ఇంజన్ విషయానికి వస్తే, ఈ కారులో శక్తివంతమైన 2.0-లీటర్ ట్విన్-టర్బో ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 4000 ఆర్‌పిఎమ్ వద్ద 215 బిహెచ్‌పి శక్తిని మరియు 2400 ఆర్‌పిఎమ్ వద్ద 480 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

భారత్‌లో ఎమ్‌జి గ్లోస్టర్ శావీ 7-సీటర్ వేరియంట్‌ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది ఇంజన్ నుండి వెలువడే శక్తిని నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది. కఠినమైన భూభాగాలపై సైతం సులువైన డ్రైవింగ్ కోసం ఇందులో ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్ కూడా ఉంటుంది. ఇంకా ఇందులో 4x4 (ఆల్-వీల్) డ్రైవింగ్, ఎకో, ఆటో, స్పోర్ట్ అనే డ్రైవ్ మోడ్స్ మరియు స్నో, మడ్, శాండ్, రాక్ అనే టెర్రైన్ మోడ్స్ కూడా ఉంటాయి.

భారత్‌లో ఎమ్‌జి గ్లోస్టర్ శావీ 7-సీటర్ వేరియంట్‌ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఎమ్‌జి గ్లోస్టర్ లెవల్-1 అటానమస్ టెక్నాలజీతో లభిస్తున్న భారతదేశపు మొదటి ప్రీమియం ఎస్‌యూవీ. ఈ కారులో మెరుగైన భద్రత కోసం అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్)లను కలిగి ఉంది. వీటిలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఆటోమేటిక్ పార్కింగ్ అసిస్టెన్స్, ఫ్రంట్ కొల్లైజన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి స్మార్ట్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

భారత్‌లో ఎమ్‌జి గ్లోస్టర్ శావీ 7-సీటర్ వేరియంట్‌ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

అంతేకాకుండా, ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ అసెంట్ అండ్ డిసెంట్ కంట్రోల్, ఏబిఎస్, ఈబిడి, బ్రేక్ అసిస్ట్, గైడ్‌లైన్స్‌తో కూడిన 360 డిగ్రీ కెమెరా, ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

భారత్‌లో ఎమ్‌జి గ్లోస్టర్ శావీ 7-సీటర్ వేరియంట్‌ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఎమ్‌జి గ్లోస్టర్ ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో లెథర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్, ప్రీమియం లెథర్ అప్‌హోలెస్ట్రీ, పెద్ద పానోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, 12.3 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8 ఇంచ్ ఎమ్ఐడి స్క్రీన్, ఎమ్‌జి ఐ-స్మార్ట్ వాయిస్ అసిస్టెంట్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే సపోర్ట్, యాప్ ద్వారా రిమోట్ కంట్రోల్స్, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ సీట్స్, మసాజింగ్ డ్రైవర్ సీట్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ మరియు 3వ వరుసలో ఏసి కంట్రోల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

భారత్‌లో ఎమ్‌జి గ్లోస్టర్ శావీ 7-సీటర్ వేరియంట్‌ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఇక ఎక్స్టీరియర్ డిజైన్ ఫీచర్లను గమనిస్తే, ఈ కారులో ఇంటిగ్రేటెడ్ డిఆర్ఎల్‌తో కూడిన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, అష్టభుజి ఆకారం (ఆక్టాగనల్ షేప్)లో ఉండే పెద్ద క్రోమ్ గ్రిల్, 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, కార్నర్ లాంప్స్, సైడ్-స్టెప్, రూఫ్ రైల్స్, ట్విన్ క్రోమ్ ఎగ్సాస్ట్, ఇరు వైపులా స్కిడ్ ప్లేట్స్ మరియు క్రోమ్-ఫినిష్డ్ విండో లైన్ మొదలైనవి ఉన్నాయి.

భారత్‌లో ఎమ్‌జి గ్లోస్టర్ శావీ 7-సీటర్ వేరియంట్‌ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఎమ్‌జి మోటార్ ఇండియా ఈ గ్లోస్టర్ ప్రీమియం ఎస్‍‌యూవీపై 3 సంవత్సరాలు లేదా 1,00,000 కి.మీ వారంటీతో పాటుగా, 3-సంవత్సరాల రోడ్-సైడ్ అసిస్టెన్స్ మరియు 3-సంవత్సరాల లేబర్ ఫ్రీ సేవలను కూడా అందిస్తోంది. గ్లోస్టర్ కస్టమర్లు తమ ప్రీమియం ఎస్‌యూవీని 200కి పైగా యాక్సెసరీస్ మరియు కస్టమైజేషన్ ఆప్షన్‌లతో ప్రత్యేకంగా మార్చుకోవచ్చు.

Most Read Articles

English summary
Mg motor india launches gloster savvy 7 seater variant price specs features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X