ఇంకా సద్దుమణగని సెమీకండక్టర్ కొరత.. నవంబర్ నెల ఎమ్‌జి కార్ల అమ్మకాలలో భారీ కోత..

చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ ఇండియా (MG Motor India) నవంబర్ 2021 నెల విక్రయాలను వెల్లడి చేసింది. ఈ కంపెనీ విడుదల చేసిన సరికొత్త ఎస్‌యూవీ ఎమ్‌జి ఆస్టర్ (MG Astor) అమ్మకాలు జోరుగానే సాగుతున్నప్పటికీ, గత నెలలో సెమీకండక్టర్ చిప్స్ కొరత కారణంగా కంపెనీ మొత్తం అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ఎమ్‌జి మోటార్ గత నెలలో మొత్తం 2,481 కార్లను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే, కంపెనీ వార్షిక అమ్మకాలు 40.40 శాతం క్షీణించాయి.

ఇంకా సద్దుమణగని సెమీకండక్టర్ కొరత.. నవంబర్ నెల ఎమ్‌జి కార్ల అమ్మకాలలో భారీ కోత..

నవంబర్ 2020లో ఎమ్‌జి మోటార్ మొత్తం 4,163 యూనిట్ల కార్లను విక్రయించినట్లు ప్రకటించింది. అప్పటికి ఇంకా ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీ మార్కెట్లోకి రాలేదు. అయినప్పటికీ, ఎమ్‌జి హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్ మోడళ్లకు ఉన్న గిరాకీ కారణంగా గతేడాది కంపెనీ మంచి అమ్మకాలను సాధించగలిగింది. గత నెలలో ఎమ్‌జి మోటార్ కార్ల విక్రయాలు క్షీణించడానికి ప్రధాన కారణాలలో ఒకటి సెమీకండక్టర్ చిప్‌ల కొరత.

ఇంకా సద్దుమణగని సెమీకండక్టర్ కొరత.. నవంబర్ నెల ఎమ్‌జి కార్ల అమ్మకాలలో భారీ కోత..

ఈ ఎలక్ట్రానిక్ చిప్స్ కొరత కారణంగా కంపెనీ కార్ల ఉత్పత్తి తీవ్రంగా ప్రభావితమైంది. దీంతో ఈ బ్రాండ్ కార్లును బుక్ చేసుకున్న కస్టమర్లకు కంపెనీ త్వరగా డెలివరీ చేయలేకపోయింది. అయితే, కార్ల వెయిటింగ్ పీరియడ్ ను తగ్గించేందుకు తమ వంతు ప్రయత్నాలను కొనసాగిస్తున్నామని ఎమ్‌జి మోటార్ తెలిపింది. సెమీకండక్టర్ చిప్ సరఫరా కారణంగా ప్రస్తుత పరిస్థితి కొంత శోచనీయంగా మారిందని, కావున వాహనాల డెలివరీ విషయంలో ఇప్పటికే తాము ప్రకటించిన ప్రణాలికను మార్చుకుంటున్నామని ఎమ్‌జి మోటార్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా తెలిపారు.

ఇంకా సద్దుమణగని సెమీకండక్టర్ కొరత.. నవంబర్ నెల ఎమ్‌జి కార్ల అమ్మకాలలో భారీ కోత..

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఈ ఏడాది చివరి నాటికి 5,000 యూనిట్ల ఆస్టర్ ఎస్‌యూవీలను డెలివరీ చేస్తామని కంపెనీ వాగ్దానం చేసినప్పటికీ, పరిస్థితి మెరుగుపడకపోతే డెలివరీలను వచ్చే ఏడాదికి రీషెడ్యూల్ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఎమ్‌జి ఆస్టర్ మొదటి బ్యాచ్‌లో బుక్ చేసుకున్న కస్టమర్లకు కార్లను లాంచ్ ధరకే విక్రయిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీని రూ. 9.78 లక్షల నుండి రూ. 17.38 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) పరిచయ ప్రారంభ ధరతో విడుదల చేశారు.

ఇంకా సద్దుమణగని సెమీకండక్టర్ కొరత.. నవంబర్ నెల ఎమ్‌జి కార్ల అమ్మకాలలో భారీ కోత..

ఇదివరకు చెప్పుకున్నట్లుగా, ముందుగా బుక్ అయిన మొదటి 5,000 యూనిట్లను బుక్ చేసుకున్న కస్టమర్లకు మాత్రమే ఈ ధరలు వర్తిస్తాయి. ఆ తర్వాత, ఈ కారు యొక్క పరిచయ ధరలు పెరగనున్నాయి. అయితే, వీటి కొత్త ధరలు ఏంటనే విషయాన్ని మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు. జనవరి 2022లో కంపెనీ కొత్త ధరలను ప్రకటించే అవకాశం ఉంది. అంచనా ప్రకారం, ఈ మోడల్ ధరలు వేరియంట్ ను బట్టి సుమారు రూ. 50,000 వరకు పెరుగుతాయని సమాచారం.

ఇంకా సద్దుమణగని సెమీకండక్టర్ కొరత.. నవంబర్ నెల ఎమ్‌జి కార్ల అమ్మకాలలో భారీ కోత..

ఎమ్‌జి మోటార్ కంపెనీ మొదటి బ్యాచ్ లో భాగంగా, 5,000 ఆస్టర్ కార్లను అమ్మకానికి కేటాయించింది. అయితే, ఈ 5,000 కార్లు కేవలం 20 నిమిషాల్లోనే పూర్తిగా అమ్ముడైపోయాయి. ప్రస్తుతం, భారత మార్కెట్లో ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీ స్టైల్, సూపర్, స్మార్ట్, షార్ప్ మరియు శావీ (Style, Super, Smart, Sharp మరియు Savvy) అనే ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. కంపెనీ ఈ కారుపై 3 సంవత్సరాల అపరిమిత కిమీ వారంటీ, 3 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ మరియు 3 సంవత్సరాల లేబర్ ఫ్రీ సర్వీసును అందిస్తోంది.

ఇంకా సద్దుమణగని సెమీకండక్టర్ కొరత.. నవంబర్ నెల ఎమ్‌జి కార్ల అమ్మకాలలో భారీ కోత..

ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీని కంపెనీ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో విడుదల చేసింది. వీటిలో మొదటి 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, ఇది 138 బిహెచ్‌పి పవర్ మరియు 220 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇకపోతే రెండవది 1.5 లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్, ఇది 108 బిహెచ్‌పి పవర్ మరియు 144 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 8-స్పీడ్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

ఇంకా సద్దుమణగని సెమీకండక్టర్ కొరత.. నవంబర్ నెల ఎమ్‌జి కార్ల అమ్మకాలలో భారీ కోత..

ఆస్టర్ ఎస్‌యూవీ ఈ విభాగంలోని ఇతర ఎస్‌యూవీలు ఆఫర్ చేసే దాని కన్నా అత్యుత్తమైన ఫీచర్లను ఆఫర్ చేస్తుంది. ఈ కారులో వ్యక్తిగత ఏఐ అసిస్టెంట్ (పర్సనల్ ఏఐ అసిస్ట్) ఫీచర్ చాలా ప్రత్యేకమైనది. దీనిని క్యాబిన్ లోపల డాష్‌బోర్డ్‌పై అమర్చిన చిన్న రోబో అని చెప్పొచ్చు. ఇది డ్రైవర్ యొక్క గొంతుక (వాయిస్) ను గుర్తించి, కొన్ని రకాల వాయిస్ కమాండ్స్ ద్వారా పనిచేస్తుంది. ఈ వాయిస్ కమాండ్స్ సాయంతో, డ్రైవర్ కారులోని అనేక ఫీచర్లను కంట్రోల్ చేయవచ్చు మరియు యాక్సెస్ చేయవచ్చు. ఇంకా ఇందులో అధునాతన డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇంకా సద్దుమణగని సెమీకండక్టర్ కొరత.. నవంబర్ నెల ఎమ్‌జి కార్ల అమ్మకాలలో భారీ కోత..

ఈ కారులో లెవల్-2 అటానమస్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్స్ ఉంటాయి. ఇందులో ADAS వ్యవస్థ అనేది రాడార్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది మరియు ఇది రోడ్డుపై ప్రమాదాల గురించి డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది. ఎమ్‌జి మోటార్ యొక్క ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ గ్లోస్టర్‌లో తొలిసారిగా కంపెనీ ఈ తరహా ఏడిఏఎస్ టెక్నాలజీని పరిచయం చేసింది. ఎమ్‌జి ఆస్టర్‌లో లభిస్తున్న లెవల్-2 అటానమస్ టెక్నాలజీ ఈ విభాగంలోనే మొట్టమొదటి మరియు వేరే ఇతర కాంపాక్ట్ ఎస్‌యూవీలోనూ ఇలాంటి ఫీచర్ లభించదు. ఇదొక అధునాతన ఆటోమేటిక్ టెక్నాలజీ, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఈది కారును ఆటోమేటిక్‌గా నియంత్రిస్తుంది.

ఇంకా సద్దుమణగని సెమీకండక్టర్ కొరత.. నవంబర్ నెల ఎమ్‌జి కార్ల అమ్మకాలలో భారీ కోత..

ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, బ్రేక్ అసిస్ట్, ఈఎస్‌పి (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), టిసిఎస్ (ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్), హెచ్‌హెచ్సి (హిల్ హోల్డ్ కంట్రోల్), హెచ్‌డిసి (హిల్ డీసెంట్ కంట్రోల్), ఈఎస్ఎస్ (ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్, 4 డిస్క్ బ్రేకులు, ఆటో-హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, కార్నింగ్ అసిస్ట్‌తో కూడిన ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్‌లు, సెక్యూరిటీ అలారం, రియర్ డీఫోగర్, హీటెడ్ సైడ్ మిర్రర్స్ మరియు అల్ట్రా-హై స్టీల్ కేజ్ బాడీ వంటి అనేక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Mg motor india november 2021 sales down by 40 percent due to semiconductor shortage
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X