షాకింగ్ న్యూస్.. మళ్ళీ పెరిగిన MG కార్ల ధరలు.. ఏ వేరియంట్‌పైన ఎంత?

భారతీయ మార్కెట్లో రోజురోజుకి కొత్త కొత్త వాహనాలు విడుదలవుతున్నాయి. అయితే ఇదే సమయంలో మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన MG Motor (ఎంజి మోటార్) తన వాహనాలైన Hector, Hector Plus మరియు Gloster ధరలను పెంచింది. ధరల పెరుగుదలకు ప్రధాన కారణం పెరుగుతున్న ముడిసరుకుల ధరలు మరియు ఖర్చులు అని కంపెనీ నివేదించింది.

షాకింగ్ న్యూస్.. మళ్ళీ పెరిగిన MG కార్ల ధరలు.. ఏ వేరియంట్‌పైన ఎంత?

MG Motor కంపెనీ దేశీయ మార్కెట్లో ధరలను పెంచడం ఇది మొదటి సరి కాదు, ఇది వరుసగా నాలుగవ సరి. ఇంతకుముందు కంపెనీ 2021 ఏప్రిల్ నెలలో ధరలను పెంచింది. కాగా ఇప్పుడు మళ్ళీ కంపెనీ యొక్క బ్రాండ్ ధరలు పెరిగాయి.

షాకింగ్ న్యూస్.. మళ్ళీ పెరిగిన MG కార్ల ధరలు.. ఏ వేరియంట్‌పైన ఎంత?

కంపెనీ నివేదికల ప్రకారం, ఎంజి గ్లోస్టర్ యొక్క సూపర్ బేస్ వేరియంట్ మినహా, మిగిలిన అన్ని వేరియంట్ల ధర రూ .40,000 పెరిగాయి. కంపెనీ యొక్క ఎంజి గ్లోస్టర్ సూపర్ వేరియంట్లో మాత్రమే కాకుండా స్మార్ట్, షార్ప్ మరియు శావీ అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

షాకింగ్ న్యూస్.. మళ్ళీ పెరిగిన MG కార్ల ధరలు.. ఏ వేరియంట్‌పైన ఎంత?

ఎంజి గ్లోస్టర్ ధరల ఇప్పుడు రూ. 29.98 లక్షల నుండి రూ .37.68 లక్షల వరకు ఉన్నాయి. అమ్మకాల పరంగా కంపెనీ గత నెలలో దాని విభాగంలో రెండవ స్థానంలో నిలిచింది. ఇవన్నీ కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

షాకింగ్ న్యూస్.. మళ్ళీ పెరిగిన MG కార్ల ధరలు.. ఏ వేరియంట్‌పైన ఎంత?

ఎంజి గ్లోస్టర్ SUV లో 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌ అందుబాటులో ఉంటుంది. ఇది రెండు విభిన్న ట్యూన్‌లలో అందుబాటులో ఉంది. దీని టర్బో వెర్షన్ 161 బిహెచ్‌పి పవర్ మరియు 375 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది, అయితే దీని ట్విన్ టర్బో ఇంజన్ 215 బిహెచ్‌పి పవర్ మరియు 480 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. రెండు ఇంజిన్‌లకు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ ఇవ్వబడింది.

షాకింగ్ న్యూస్.. మళ్ళీ పెరిగిన MG కార్ల ధరలు.. ఏ వేరియంట్‌పైన ఎంత?

ఇక MG Motor యొక్క హెక్టర్ వేరియంట్ ధర రూ. 8,000 నుండి రూ. 50,000 వరకు పెరిగింది. మరోవైపు, షార్ప్ వేరియంట్ యొక్క డ్యూయల్ టోన్ పెట్రోల్ మరియు డీజిల్ ధర రూ .50,000 పెరిగింది. స్మార్ట్ మరియు షార్ప్ ధర రూ. 8,000 పెరిగింది. MG హెక్టర్ అమ్మకాలు బాగా సాగుతున్నప్పటికీ గత నెలలో తగ్గుముఖం పట్టింది.

షాకింగ్ న్యూస్.. మళ్ళీ పెరిగిన MG కార్ల ధరలు.. ఏ వేరియంట్‌పైన ఎంత?

ఇటీవల మార్కెట్లో హెక్టర్ ప్లస్ యొక్క రెండు వేరియంట్లు నిలిపివేయబడ్డాయి. అయితే ఇందులోని షార్ప్ డ్యూయల్ టోన్ వేరియంట్ ధర రూ. 42,000, స్మార్ట్ మరియు మోనో టోన్ షార్ప్ ధర రూ .15,000 పెరిగాయి. గత కొన్ని నెలలుగా కంపెనీ భారీగా ధరలను పెంచుతోంది. ఈ కారణంగానే అమ్మకాలు కూడా కొంత తగ్గుముఖం పట్టాయి. అయితే కంపెనీ మరొక్కసారి ధరలను పెంచడం వల్ల ఈ పండుగ సీజన్లో మరింత ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది.

షాకింగ్ న్యూస్.. మళ్ళీ పెరిగిన MG కార్ల ధరలు.. ఏ వేరియంట్‌పైన ఎంత?

MG హెక్టర్ ప్లస్ డీజిల్ మాన్యువల్ కేవలం నాలుగు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. ఐ స్టైల్, సూపర్, స్మార్ట్ మరియు సెలెక్ట్ వేరియంట్‌లు. MG హెక్టర్ ప్లస్ రెండు ఇంజిన్ ఆప్సన్స్ తో అందుబాటులో ఉంటాయి. ఇందులో మొదటిది 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ కాగా, రెండవది 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్.

షాకింగ్ న్యూస్.. మళ్ళీ పెరిగిన MG కార్ల ధరలు.. ఏ వేరియంట్‌పైన ఎంత?

2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ 168 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. ఇక రెండవ ఇంజిన్ 1.5-లీటర్ టర్బో పెట్రోల్ విషయానికి వస్తే, ఇది ఇది 141 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్, CVT మరియు DCT గేర్‌బాక్స్ ఎంపికతో అందించబడింది.

షాకింగ్ న్యూస్.. మళ్ళీ పెరిగిన MG కార్ల ధరలు.. ఏ వేరియంట్‌పైన ఎంత?

MG మోటార్ కంపెనీ ఇటీవల దేశీయ మార్కెట్లో కొత్త MG Astor SUV ని విడుదల చేసింది. కంపెనీ ఈ SUV కోసం బుకింగ్స్ కూడా ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే మొత్తం బుక్ చేయబడ్డాయి. ఇప్పటికే కంపెనీ 50,000 కు పైగా బుకింగ్స్ స్వీకరించింది.

షాకింగ్ న్యూస్.. మళ్ళీ పెరిగిన MG కార్ల ధరలు.. ఏ వేరియంట్‌పైన ఎంత?

కంపెనీ పొందిన ఈ బుకింగ్స్ యొక్క డెలివరీలు 2022 ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం కంపెనీ దాదాపు 5,000 యూనిట్ల MG ఆస్టర్‌ను డెలివరీ చేయబోతోందని. దీని కారణంగా దాని బుకింగ్ వెంటనే పూర్తయిందని సమాచారం. దీని డెలివరీని త్వరలో ప్రారంభించవచ్చు.

షాకింగ్ న్యూస్.. మళ్ళీ పెరిగిన MG కార్ల ధరలు.. ఏ వేరియంట్‌పైన ఎంత?

ఎమ్‌జి ఆస్టర్ శావీ ట్రిమ్ 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌ లతో విడుదల చేయబడింది. ఇందులోని టర్బో-పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 138 బిహెచ్‌పి పవర్ ను మరియు 220 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 108 బిహెచ్‌పి పవర్ ను మరియు 144 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

షాకింగ్ న్యూస్.. మళ్ళీ పెరిగిన MG కార్ల ధరలు.. ఏ వేరియంట్‌పైన ఎంత?

ఎమ్‌జి ఆస్టర్ శావీ ట్రిమ్ లోని నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ లో సివిటి గేర్‌బాక్స్ ఆప్షన్ ఇవ్వబడింది మరియు టర్బో-పెట్రోల్ ఇంజన్ లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఇవ్వబడింది. ఆస్టర్ శావీ ట్రిమ్ లో మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేదు. ఈ ఎస్‌యూవీని కంపెనీ మొత్తం 5 ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్‌ లలో అందుబాటులో ఉంచింది. వీటిలో స్పైస్డ్ ఆరెంజ్, అరోరా సిల్వర్, గ్లేజ్ రెడ్, క్యాండీ వైట్ మరియు స్టారీ బ్లాక్ అనే కలర్ ఆప్షన్లు ఉన్నాయి. మొత్తానికి కంపెనీ యొక్క ఈ కొత్త వేరియంట్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. కావున దేశీయ మార్కెట్లో ఎక్కువ ప్రజాదరణ పొందుతుంది.

Most Read Articles

English summary
Mg motor india price hike hector golster and hector plus details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X