MG Hector వేరియంట్లలో మార్పులు; సూపర్ ట్రిమ్ డిస్‌కంటిన్యూ - డీటేల్స్

చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ (MG Motor) భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఎమ్‌జి హెక్టర్ (MG Hector) వేరియంట్ లైనప్ ను అప్‌డేట్ చేసింది. కంపెనీ ఇందులో బేస్ ట్రిమ్ (స్టైల్) కి ఎగువన అందిస్తున్న సూపర్ ట్రిమ్ ను కంపెనీ నిలిపివేసింది.

MG Hector వేరియంట్లలో మార్పులు; సూపర్ ట్రిమ్ డిస్‌కంటిన్యూ - డీటేల్స్

ఎమ్‌జి హెక్టర్ సూపర్ ట్రిమ్ (MG Hector Super Trim) ను కంపెనీ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌ లతో ఎంపికతో విక్రయించేది. ఇప్పుడు ఈ మోడల్ లో సూపర్ ట్రిమ్ నిలిపివేసిన తరువాత, ఇకపై ఇది నాలుగు ట్రిమ్‌ లలో మాత్రమే అందుబాటులో ఉంది. వీటిలో స్టైల్, షైన్, స్మార్ట్ మరియు షార్ప్ ట్రిమ్స్ ఉన్నాయి.

MG Hector వేరియంట్లలో మార్పులు; సూపర్ ట్రిమ్ డిస్‌కంటిన్యూ - డీటేల్స్

మార్కెట్లో హెక్టర్ సూపర్ ట్రిమ్ నిలిపివేయడానికి ప్రధాన కారణం, కంపెనీ ఇటీవల ఇందులో ఓ కొత్త మిడ్-స్పెక్ షైన్ వేరియంట్ ను ప్రవేశపెట్టడమే అని భావిస్తున్నారు. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. ఎమ్‌జి మోటార్ ఇండియా తమ హెక్టర్ సూపర్ ట్రిమ్ ను కూడా 48V మైల్డ్-హైబ్రిడ్ సెటప్‌ తో ప్రవేశపెట్టింది. కానీ, ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేదు, ఇది కేవలం 6 స్పీడ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో మాత్రమే లభ్యమయ్యేది.

MG Hector వేరియంట్లలో మార్పులు; సూపర్ ట్రిమ్ డిస్‌కంటిన్యూ - డీటేల్స్

కాగా, హెక్టర్ షైన్ ట్రిమ్ లో ఒక వేరియంట్ మాత్రం సివిటి (కంటిన్యూస్ వేరియబల్ ట్రాన్సిమిషన్) ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో లభిస్తుంది. కాకపోతే, ఇందులో మైల్డ్-హైబ్రిడ్ సెటప్ మాత్రం లేదు. ధర పరంగా కూడా షైన్ ట్రిమ్ ప్రీమియంగా ఉంటుంది. హెక్టర్ సూపర్ ట్రిమ్ తో పోల్చుకుంటే, షైన్ ట్రిమ్ ధరలు సుమారు రూ. 30,000 నుండి రూ. 50,000 ఎక్కువగా ఉంటుంది.

MG Hector వేరియంట్లలో మార్పులు; సూపర్ ట్రిమ్ డిస్‌కంటిన్యూ - డీటేల్స్

అయితే, హెక్టర్ షైన్ ట్రిమ్ ఈ అధిక ధరకు తగినట్లుగా అధిక ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీలో స్మార్ట్ కీలు, కీలెస్ ఎంట్రీ, క్రోమ్-ఫినిష్డ్ డోర్ హ్యాండిల్స్, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్ బటన్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్ మరియు ఆటో-హోల్డ్ ఆప్షన్ తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌ వంటి అనేక అదనపు ఫీచర్లు ఉంటాయి.

MG Hector వేరియంట్లలో మార్పులు; సూపర్ ట్రిమ్ డిస్‌కంటిన్యూ - డీటేల్స్

MG Hector సూపర్ ట్రిమ్ నిలిపివేసిన తరువాత, కొనుగోలుదారులు ఇప్పుడు పెట్రోల్ మరియు డీజిల్ శ్రేణిలో బేస్-స్పెక్ వేరియంట్ స్టైల్‌ ట్రిమ్ కి ఎగువన షైన్ ట్రిమ్ లను కొనుగోలు చేయాలంటే సుమారు రూ. 1 లక్ష (పెట్రోల్ వెర్షన్) మరియు రూ. 1.5 లక్షలు (డీజిల్ వెర్షన్) అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవి రెండూ కాకుండా, మీరు మైల్డ్-హైబ్రిడ్ వేరియంట్ ను కొనాలనుకుంటే, ఇందులో స్మార్ట్ ట్రిమ్ ను ఎంచుకోవచ్చు.

MG Hector వేరియంట్లలో మార్పులు; సూపర్ ట్రిమ్ డిస్‌కంటిన్యూ - డీటేల్స్

MG Hector స్మార్ట్ ట్రిమ్ ఇప్పుడు మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌ కలిగిన ఎంట్రీ లెవల్ వేరియంట్‌ గా మారింది మరియు మార్కెట్లో దీని ధర రూ. 16.38 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. ఇప్పటి వరకూ మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌ తో లభ్యమైన సూపర్ వేరియంట్ ధరను గమనిస్తే, ఇది రూ. 15 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. భారతదేశంలో హెక్టర్ ఎస్‌యూవీని ప్రారంభించిన తర్వాత 2019 లో ఇందులో సూపర్ ట్రిమ్ ప్రవేశపెట్టబడింది.

MG Hector వేరియంట్లలో మార్పులు; సూపర్ ట్రిమ్ డిస్‌కంటిన్యూ - డీటేల్స్

హెక్టర్ యొక్క సూపర్ ట్రిమ్ లోని పెట్రోల్ వేరియంట్లు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లభించేవి. ఈ ఇంజన్ గరిష్టంగా 143 బిహెచ్‌పి పవర్ పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఈ ట్రిమ్ లోని డీజిల్ వేరియంట్లు 2-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వచ్చేవి. ఈ ఇంజన్ గరిష్టంగా 170 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎస్‌యూవీలోని ఎంపిక చేసిన వేరియంట్లలో ఆప్షనల్ 6 స్పీడ్ డిసిటి లేదా సివిటి గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.

MG Hector వేరియంట్లలో మార్పులు; సూపర్ ట్రిమ్ డిస్‌కంటిన్యూ - డీటేల్స్

హెక్టర్స్ సూపర్ ట్రిమ్ లో లభించే ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 10.4 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ మరియు ఎల్ఈడి లైటింగ్ మొదలైనవి ఉన్నాయి. అలాదే, సేఫ్టీ పరంగా చూస్తే ఈ ఎస్‌యూవీలో రియర్ పార్కింగ్ సెన్సార్లు, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు మరియు రియర్ పార్కింగ్ కెమెరాతో పాటుగా ఇతర స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా లభిస్తాయి.

MG Hector వేరియంట్లలో మార్పులు; సూపర్ ట్రిమ్ డిస్‌కంటిన్యూ - డీటేల్స్

MG Motor India ప్రస్తుతం తమ Hector ఎస్‌యూవీని రూ. 13.50 లక్షల నుండి రూ. 19.36 లక్షల మధ్య విక్రయిస్తోంది (ఎక్స్-షోరూమ్). భారత మార్కెట్లో ఇది టాటా హారియర్, జీప్ కంపాస్, మహీంద్రా ఎక్స్‌యూవీ700, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి మోడళ్లతో పోటీపడుతుంది.

MG Hector వేరియంట్లలో మార్పులు; సూపర్ ట్రిమ్ డిస్‌కంటిన్యూ - డీటేల్స్

అక్టోబర్ 2021లో ఎమ్‌జి ఆస్టర్ బుకింగ్స్..

ఇదిలా ఉంటే, ఎమ్‌జి బ్రాండ్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎమ్‌జి ఆస్టర్ (MG Astor) అతి త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. ప్రస్తుత పండుగ సీజన్‌లో కంపెనీ ఈ మోడల్‌ను విడుదల చేయాలని చూస్తోంది. ఆస్టర్ కోసం బుకింగ్స్‌ను అక్టోబర్ 07, 2021వ తేదీన ప్రారంభించవచ్చని సమాచారం. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Mg motor india updates hector lineup super trim discontinued
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X