Ford India ఫ్యాక్టరీలను కొనేందుకు ఆసక్తి చూపుతున్న MG Motor!

అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ (Ford) త్వరలోనే భారతదేశంలో తమ వ్యాపార కార్యకలాపాలకు స్వస్తి పలికి, దేశం విడిచి వెళ్లిపోనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, భారతదేశంలో ఫోర్డ్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ (MG Motor) ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

Ford India ఫ్యాక్టరీలను కొనేందుకు ఆసక్తి చూపుతున్న MG Motor!

ఈ మేరకు ఫోర్డ్ ఇండియా (Ford India) యొక్క గుజరాత్‌లోని సనంద్ మరియు తమిళనాడులోని మరైమలై నగర్ ఫ్యాక్టరీలను కొనుగోలు చేయడానికి MG ఆసక్తిని వ్యక్తం చేసినట్లు ఎకనామిక్ టైమ్స్ ఓ కథనంలో ప్రచురించింది. అయితే, ప్రస్తుతం ఈ చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని ఈ కథనంలో నివేదించబడింది. కాబట్టి, MG Motor ఈ ప్రశ్నార్థకమైన ఫ్యాక్టరీలను కొనుగోలు చేస్తుందో లేదో ఇంకా ఖచ్చితంగా తెలియదు.

Ford India ఫ్యాక్టరీలను కొనేందుకు ఆసక్తి చూపుతున్న MG Motor!

ప్రస్తుతం ఫోర్డ్ ఇండియా సంస్థకు వేరే ఆప్షన్ లేదు. గడచిన కొన్ని సంవత్సరాలుగా ఈ అమెరికన్ బ్రాండ్ భారతదేశంలో భారీ నష్టాలను చవిచూస్తూ వస్తోంది. ఈ నష్టం సుమారు 2 బిలియన్ డాలర్లు ఉంటుందని కంపెనీ అంచనా వేసింది. కరోనా ఫస్ట్ వేవ్‌కి ముందు దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) సంస్థతో ఫోర్డ్ ఇండియా (Ford India) కుదుర్చుకున్న జాయింట్ వెంచర్ కూడా ఆదిలోనే ఆగిపోయింది.

Ford India ఫ్యాక్టరీలను కొనేందుకు ఆసక్తి చూపుతున్న MG Motor!

ఈ నేపథ్యంలో, ఫోర్డ్ ఇండియా భవిష్యత్తులో మరిన్ని నష్టాలను ఎదుర్కునే బదులుగా ఉన్న ఆస్తులను అమ్ముకొని, కొంతమేర అయినా నష్టాలను పూడ్చుకుంటే మంచిదనేది నిపుణుల అభిప్రాయం. భారతదేశంలో ఫోర్డ్ తమ కార్ల ఉత్పత్తిని నిలిపివేసి తర్వాత, దేశంలోని ఈ రెండు ప్లాంట్‌లు త్వరలో మూసివేయబడతాయి. కాబట్టి, వీటిని ఎమ్‌జి వంటి అభివృద్ధి చెందుతున్న ఆటోమొబైల్ బ్రాండ్లకి విక్రయిస్తే ఇరు కంపెనీలకు లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది.

Ford India ఫ్యాక్టరీలను కొనేందుకు ఆసక్తి చూపుతున్న MG Motor!

గతంలో, MG కాంట్రాక్ట్ తయారీ కోసం Ford ప్లాంట్‌లపై ఆసక్తిని కనబరిచింది. కానీ, కరోనా మహమ్మారి కారణంగా, ఈ చైనీస్ బ్రాండ్ తమ విస్తరణ ప్రణాళికలను వదులుకోవలసి వచ్చింది. ప్రస్తుత పరిస్థిల్లో ఫోర్డ్ నుండి కాంట్రాక్ట్ తయారీ మరియు కర్మాగారాల పూర్తి అమ్మకం రెండు ఆప్షన్లు ఎమ్‌జి కోసం అందుబాటులో ఉన్నాయి.

Ford India ఫ్యాక్టరీలను కొనేందుకు ఆసక్తి చూపుతున్న MG Motor!

ఈ ప్లాంట్ విక్రయాల కోసం ఫోర్డ్ ఇప్పుడు దేశంలోని పాపులర్ ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్ ఓలా ఎలక్ట్రిక్ మరియు యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రాలతో మరికొన్ని ఇతర కంపెనీలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఫోర్డ్-ఎమ్‌జి డీల్ గురించి మాట్లాడేందుకు ఎమ్‌జి మోటార్ ఇండియా అధ్యక్షుడు మరియు సీఈఓ రాజీవ్ చాబా నిరాకరించారు.

Ford India ఫ్యాక్టరీలను కొనేందుకు ఆసక్తి చూపుతున్న MG Motor!

ఫోర్డ్ ఇండియా (Ford India) తమ గుజరాత్ మరియు తమిళనాడు ప్లాంట్లలో ఉత్పత్తిని వేగంగా తగ్గిస్తోంది. ఇందుకు ప్రధాన కారణంగా, ఫోర్డ్ కార్లకు పెద్దగా ఆర్డర్లు లేకపోవడమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికానికి గుజరాత్‌లోని సనంద్ ప్లాంట్ మూసివేయబడుతుందని మరియు వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నాటికి తమిళనాడులో మరైమలై నగర్ ప్లాంట్‌లో ఉత్పత్తి కార్యకలాపాలను ముగించనున్నట్లు ఫోర్డ్ ప్రకటించింది.

Ford India ఫ్యాక్టరీలను కొనేందుకు ఆసక్తి చూపుతున్న MG Motor!

ప్రస్తుతం, ఈ ప్లాంట్లలో నిర్వహిస్తున్న ఉత్పత్తి పెండింగ్‌లో ఉన్న అంతర్జాతీయ ఆర్డర్‌ల (ఎగుమతి మార్కెట్) కోసం మాత్రమే అని తెలుస్తోంది మరియు భారత మార్కెట్‌లో అమ్మకాలు ఇప్పటికే ముగిసినట్లు కూడా సమాచారం. కంపెనీ ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

Ford India ఫ్యాక్టరీలను కొనేందుకు ఆసక్తి చూపుతున్న MG Motor!

భారత మార్కెట్లో ఫోర్డ్ ఇండియా విక్రయిస్తున్న ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ఫిగో (Figo), ఆస్పైర్ (Aspire), ఫ్రీస్టైల్ (Freestyle), ఎకోస్పోర్ట్ (EcoSport) మరియు ఎండీవర్ (Endeavour) మోడళ్లు ఉన్నాయి. మార్కెట్ సమాచారం, ఫోర్డ్ డీలర్‌షిప్‌లలో ఎక్కువ స్టాక్ ఉన్న మోడళ్ల యొక్క స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు కంపెనీ వాటిపై భారీ తగ్గింపులను అందిస్తున్నట్లు తెలుస్తోంది.

Ford India ఫ్యాక్టరీలను కొనేందుకు ఆసక్తి చూపుతున్న MG Motor!

ఫోర్డ్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు 4,000 ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, తమ ఉద్యోగ భద్రత కోసం Ford India చెన్నై ప్లాంట్ ఉద్యోగులు ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తమిళనాడు రాష్ట్ర మంత్రి టిఎమ్ అన్బరసన్ కు లేఖ రాశారు. ఫోర్డ్ ఆకస్మిక ప్రకటన వల్ల 2,600 మందికి పైగా శాశ్వత కార్మికులు మరియు 1,000 మంది కాంట్రాక్ట్ సిబ్బంది యొక్క జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని యూనియన్ సభ్యులు తమ లేఖలో తెలిపారు.

Ford India ఫ్యాక్టరీలను కొనేందుకు ఆసక్తి చూపుతున్న MG Motor!

కాగా, ఫోర్డ్ ఇండియా దేశంలో తమ వాహనాల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, తమ ప్రస్తుత వినియోగదారులకు సర్వీస్ సదుపాయాలు, విడిభాగాలు మరియు వారంటీ సేవలను అందించడం మాత్రం కొనసాగిస్తూనే ఉంటామని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా, భారతదేశంలో తమ హై-ఎండ్ లగ్జరీ కార్లను కూడా దిగుమతి చేసుకొని విక్రయిస్తామని పేర్కొంది.

Ford India ఫ్యాక్టరీలను కొనేందుకు ఆసక్తి చూపుతున్న MG Motor!

అంటే, ఫోర్డ్ ఇండియా దేశంలో తమ ప్రత్యక్ష వ్యాపారానికి స్వస్తి పలికి, పరోక్షంగా తమ వ్యాపారాన్ని కొనసాగించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఫోర్డ్ తమ Mustang Mach-e (మస్టాంగ్ మాక్-ఇ) ఎలక్ట్రిక్ కారును ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. భారత్‌లో దీని అమ్మకాలు 2022 నుండి ప్రారంభమవుతాయని సమాచారం.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Mg motor interested to buy ford india manufacturing facilities
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X