దక్షిణాసియా దేశాలపై పడిన MG Motor చూపు.. అప్పుడే ఆ దేశంలో అడుగెట్టేసింది

భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన వాహన తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన ఎంజి మోటార్ (MG Motor) కంపెనీ ఇప్పుడు దక్షిణ ఆసియా దేశాలలో కూడా అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ తన ప్రముఖ SUV అయిన ఎంజి హెక్టర్ ని నేపాల్ కి పంపడంతో దీనికి శ్రీకారం చుట్టింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

దక్షిణాసియా దేశాలపై పడిన MG Motor చూపు.. అప్పుడే ఆ దేశంలో అడుగెట్టేసింది

ఎంజి మోటార్ యొక్క ఎంజి హెక్టర్ SUV కంపెనీ యొక్క హలోల్ ప్లాంట్‌లో తయారు చేయబడుతుంది. ఈ SUV భారతీయ మార్కెట్లో మంచి స్పందనను పొందింది. ఈ కారణంగానే ఇతరదేశాలకు కూడా పంపిస్తోంది. కంపెనీ తన ఉనికిని మరియు తన పరిధిని ఇతర దేశాల్లో కూడా విస్తరించడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది.

దక్షిణాసియా దేశాలపై పడిన MG Motor చూపు.. అప్పుడే ఆ దేశంలో అడుగెట్టేసింది

MG మోటార్ మొదటసారి భారతీయ మార్కెట్లో హెక్టర్ SUV తో అడుగుపెట్టింది. అయితే ఇప్పటికి కంపెనీ భారతదేశంలో మొత్తం నాలుగు వాహనాలను విక్రయిస్తుంది. కంపెనీ విడుదల చేసిన అన్ని వాహనాలకు దేశీయ మార్కెట్లో అద్భుతమైన స్పందన ఉంది. ఈ కారణంగానే దేశంలో చాలామంది ఈ కంపెనీ యొక్క కార్లను కొనడానికి ఆసక్తి చూపుతారు.

దక్షిణాసియా దేశాలపై పడిన MG Motor చూపు.. అప్పుడే ఆ దేశంలో అడుగెట్టేసింది

ఎంజి మోటార్ కంపెనీ ఇటీవల దేశీయ మార్కెట్లో ఆస్టర్ (Astor) అనే కొత్త SUV ని విడుదల చేసింది. ఈ SUV దేశీయ మార్కెట్లో మంచి బుకింగ్స్ పొందింది. అంతే కాకుడా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కూడా తిరుగులేని పట్టును సాధించింది. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో కంపెనీ యొక్క జెడ్ఎస్ ఈవి అమ్మకాల పరంగా రెండవ స్థానంలో ఉంది.

దక్షిణాసియా దేశాలపై పడిన MG Motor చూపు.. అప్పుడే ఆ దేశంలో అడుగెట్టేసింది

అంతే కాకూండా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తన పట్టును మరింత పటిష్టం చేసుకునేందుకు, త్వరలో రూ. 15 లక్షల ధర కలిగిన ఎలక్ట్రిక్ కారును తీసుకురాబోతోంది. ఎంజి మోటార్ ఇండియా కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ కారును మరింత సరసమైన ధరలో విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది. కంపెనీ తన గ్లోబల్ పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే ఉన్న మోడల్‌లలో ఒకదానిని భారతదేశానికి తీసుకురావచ్చని ఊహాగానాలు ఉన్నాయి.

దక్షిణాసియా దేశాలపై పడిన MG Motor చూపు.. అప్పుడే ఆ దేశంలో అడుగెట్టేసింది

ఎంజి మోటార్ కంపెనీ భారతీయ మార్కెట్లో ముఖ్యంగా SUV సెగ్మెంట్‌లపై దృష్టి సారిస్తోంది. ఏ కారణంగానే కంపెనీ ఈ విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాలు కూడా తీసుకురాబడ్డాయి. భారతీయ మార్కెట్లో కంపెనీ యొక్క వాహనాలకు మంచి డిమాండ్ ఉన్న కారణంగా దేశీయ మార్కెట్లో ఒక సుస్థిరమైన స్థానం ఏర్పర్చుకుంటోంది.

దక్షిణాసియా దేశాలపై పడిన MG Motor చూపు.. అప్పుడే ఆ దేశంలో అడుగెట్టేసింది

ఇదిలా ఉండగా కంపెనీ ఇటీవల 2021 నవంబర్ నెల అమ్మకాల నివేదికలను విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం కంపెనీ యొక్క అమ్మకాలు మునుపటికంటే కూడా నవంబర్ నెలలో తగ్గినట్లు తెలుస్తోంది. గణాంకాల ప్రకారం గత నెల అమ్మకాల్లో 40 శాతం తగ్గుదల నమోదైంది.

దక్షిణాసియా దేశాలపై పడిన MG Motor చూపు.. అప్పుడే ఆ దేశంలో అడుగెట్టేసింది

కంపెనీ యొక్క అమ్మకాలలో హెక్టర్ మొదటి స్థానంలో ఉండగా, ఎంజి ఆస్టర్ తర్వాతి స్థానంలో ఉంది. అయితే జెడ్ఎస్ ఈవి మరియు గ్లోస్టర్ వరుసగా మూడు మరియు నాలుగవ స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో సెమీకండక్టర్ చిప్ కొరత కారణంగా ఉత్పత్తి మరియు అమ్మకాలు కూడా చాలా వరకు తగ్గాయని కంపెనీ తెలిపింది.

దక్షిణాసియా దేశాలపై పడిన MG Motor చూపు.. అప్పుడే ఆ దేశంలో అడుగెట్టేసింది

MG Hector కంపెనీ యొక్క అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది. కంపెనీ యొక్క ఈ SUV నవంబర్ నెలలో 1210 యూనిట్లను విక్రయించింది, ఇది గత సంవత్సరం ఇదే నెలలో 3426 యూనిట్లను విక్రయించింది. 2021 అక్టోబర్‌లో కంపెనీ 2,478 యూనిట్లతో అమ్మకాలతో పోలిస్తే 51 శాతం క్షీణత నమోదైంది.

దక్షిణాసియా దేశాలపై పడిన MG Motor చూపు.. అప్పుడే ఆ దేశంలో అడుగెట్టేసింది

ఇక కంపెనీ యొక్క యొక్క కొత్త Astor SUV యొక్క అమ్మకాల విషయానికి వస్తే, ఇది 2021 నవంబర్ నెలలో 1,018 యూనిట్లను విక్రయించింది. ఈ SUV అమ్మకాలలో ఇది మొదటి నెల మరియు కంపెనీ ఈ సంవత్సరానికి కేవలం 5000 యూనిట్లను మాత్రమే అందుబాటులో ఉంచింది. అయితే రానున్న రోజుల్లో ఇది మరింత అమ్మకాలను పొందే అవకాశం ఉంటుంది.

దక్షిణాసియా దేశాలపై పడిన MG Motor చూపు.. అప్పుడే ఆ దేశంలో అడుగెట్టేసింది

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఎంజి మోటార్ కంపెనీ దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే ఇప్పుడు కంపెనీ దక్షిణాసియా దేశాల్లో అడుగుపెట్టడం ద్వారా తన అమ్మకాలను మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా దక్షిణాసియా దేశాల్లో కంపెనీ ఎలాంటి ఆదరణ పొందుతుంది అనే విషయాలు త్వరలో తెలుస్తాయి.

Most Read Articles

English summary
Mg motor to export cars in south asian countries details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X