MG Hector Plus ఎస్‌యూవీలో రెండు వేరియంట్లు డిస్‌కంటిన్యూ!

ఎమ్‌జి మోటార్ ఇండియా (MG Motor India) తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని మరోసారి అప్‌డేట్ చేసింది. దేశీయ విపణిలో కంపెనీ విక్రయిస్తున్న 7-సీటర్ ఎస్‌యూవీ ఎమ్‌జి హెక్టర్ ప్లస్ (MG Hector Plus) లో కంపెనీ రెండు వేరియంట్ల అమ్మకాలను నిలిపివేసింది. ఆ వివరాలేంటో చూద్దాం రండి.

MG Hector Plus ఎస్‌యూవీలో రెండు వేరియంట్లు డిస్‌కంటిన్యూ!

ఎమ్‌జి మోటార్ ఇటీవల హెక్టర్ ప్లస్ యొక్క అప్‌డేటెడ్ బ్రోచర్ ను విడుదల చేసింది. ఈ బ్రోచర్‌లో, ఎమ్‌జి హెక్టర్ ప్లస్ యొక్క స్టైల్ 1.5 పెట్రోల్ టర్బో హైబ్రిడ్ మ్యాన్యువల్ 7-సీటర్ వేరియంట్ మరియు సూపర్ 2.0 డీజిల్ టర్బో మ్యాన్యువల్ 6-సీటర్ వేరియంట్లను నిలిపివేసింది. అంటే, దీని అర్థం హెక్టర్ ప్లస్ 7-సీటర్ పెట్రోల్ ఇప్పుడు ఒక సూపర్ ట్రిమ్‌లో మాత్రమే లభిస్తుంది మరియు దీని ధర రూ. 15.47 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

MG Hector Plus ఎస్‌యూవీలో రెండు వేరియంట్లు డిస్‌కంటిన్యూ!

ఎమ్‌జి హెక్టర్ ప్లస్ డీజిల్ మాన్యువల్ కాంబినేషన్ విషయానికి వస్తే, ఇది నాలుగు ట్రిమ్‌లలో మాత్రమే లభిస్తుంది. అవి: స్టైల్, సూపర్, స్మార్ట్ మరియు సెలెక్ట్ ట్రిమ్ లు. మార్కెట్లో వీటి ధరలు రూ. 15.39 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి రూ. 19.36 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

MG Hector Plus ఎస్‌యూవీలో రెండు వేరియంట్లు డిస్‌కంటిన్యూ!

ఈ వేరియంట్ లైనప్ మార్పుల తర్వాత, ఇప్పుడు 6-సీటర్ వేరియంట్ కోసం ఆప్షన్లు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ లలో కేవలం రెండు ట్రిమ్ లకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి. సమాచారం ప్రకారం, 1.5 లీటర్ టర్బో మరియు టర్బో హైబ్రిడ్ పెట్రోల్ స్మార్ట్ మరియు షార్ప్ వేరియంట్ల కోసం ప్రారంభ ధర రూ. 17.92 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి మొదలువుతుంది.

MG Hector Plus ఎస్‌యూవీలో రెండు వేరియంట్లు డిస్‌కంటిన్యూ!

ఇందులో సూపర్ వేరియంట్ నిలిపివేయబడినందున, డీజిల్ మాన్యువల్‌ను స్మార్ట్ మరియు షార్ప్ వేరియంట్‌ ల ధరలు వరుసగా రూ. 18.60 లక్షలు మరియు రూ. 20 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి. పైన పేర్కొన్న రెండు వేరియంట్లను నిలిపివేయడం మినహా, ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలో ఎలాంటి మార్పులు చేయలేదు మరియు దాని ఫీచర్లలో కూడా ఎలాంటి మార్పులు లేవు.

MG Hector Plus ఎస్‌యూవీలో రెండు వేరియంట్లు డిస్‌కంటిన్యూ!

హెక్టర్ 5-సీటర్ మాదిరిగానే హెక్టర ప్లస్ 6/7-సీటర్ ఎస్‌యూవీ కూడా రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో మొదటిది 2.0 లీటర్ డీజిల్ ఇంజన్, ఇది 168 బిహెచ్‌పి పవర్ ను మరియు 350 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఇక రెండవది 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్, ఇది 141 బిహెచ్‌పి పవర్ ను మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్, సివిటి మరియు డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

MG Hector Plus ఎస్‌యూవీలో రెండు వేరియంట్లు డిస్‌కంటిన్యూ!

MG Hector సూపర్ ట్రిమ్ డిస్‌కంటిన్యూ.. కొత్త షైన్ వేరియంట్ లాంచ్..

ఇదిలా ఉంటే, గడచిన సెప్టెంబర్ 2021 నెలలో ఎమ్‌జి మోటార్ తమ పాపులర్ 5-సీటర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఎమ్‌జి హెక్టర్ (MG Hector) వేరియంట్ లైనప్ ను కూడా అప్‌డేట్ చేసింది. కంపెనీ ఇందులో బేస్ ట్రిమ్ (స్టైల్) కి ఎగువన అందిస్తున్న సూపర్ ట్రిమ్ ను నిలిపివేసింది.

MG Hector Plus ఎస్‌యూవీలో రెండు వేరియంట్లు డిస్‌కంటిన్యూ!

మార్కెట్లో ఎమ్‌జి హెక్టర్ సూపర్ ట్రిమ్ (MG Hector Super Trim) 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌ ఆప్షన్లతో లభ్యమయ్యేది. ఇందులో సూపర్ ట్రిమ్ ని నిలిపివేసిన తరువాత, ఇకపై హెక్టర్ నాలుగు ట్రిమ్‌ లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అవి: స్టైల్, షైన్, స్మార్ట్ మరియు షార్ప్ ట్రిమ్స్.

MG Hector Plus ఎస్‌యూవీలో రెండు వేరియంట్లు డిస్‌కంటిన్యూ!

ఎమ్‌జి హెక్టర్ సూపర్ ట్రిమ్ ను నిలిపివేయడానికి ప్రధాన కారణం, కంపెనీ ఇటీవల ఇందులో ఓ కొత్త మిడ్-స్పెక్ షైన్ వేరియంట్ ను ప్రవేశపెట్టడమే అని భావిస్తున్నారు. గడచిన ఆగస్ట్ 2021 నెలలో కంపెనీ 'హెక్టర్ షైన్ వేరియంట్' ను విడుదల చేసింది. దేశీయ విపణిలో కొత్త ఎమ్‌జి హెక్టర్ షైన్ వేరియంట్ ధర రూ. 14.51 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది. షైన్ వేరియంట్ ఇప్పుడు హెక్టర్ యొక్క కొత్త మిడ్-స్పెక్ వేరియంట్ గా ఉంటుంది.

MG Hector Plus ఎస్‌యూవీలో రెండు వేరియంట్లు డిస్‌కంటిన్యూ!

ఈ కొత్త (షైన్) వేరియంట్ లో క్రోమ్-స్టడ్డెడ్ ఫ్టంట్ గ్రిల్, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, కారు చుట్టూ బాడీ క్లాడింగ్, షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు రూఫ్ రైల్స్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ వేరియంట్‌లో అదనపు ఫీచర్లు మరియు పరికరాల మినహా యాంత్రికంగా ఎలాంటి మార్పులు లేవు.

MG Hector Plus ఎస్‌యూవీలో రెండు వేరియంట్లు డిస్‌కంటిన్యూ!

హెక్టర్ షైన్ వేరియంట్ క్యాబిన్ లోపల ఆండ్రాయిడ్ ఆటో మరియ ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ తో కూడిన 10.4 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 3.5 ఇంచ్ సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, ఎమ్ఐడి ఇరు వైపులా అనలాగ్ డయల్స్, ఫాబ్రిక్ అప్‌హోలెస్ట్రీ, మాన్యువల్ ఏసి, పవర్ అడ్జస్టబుల్ సైడ్ మిర్రర్స్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ ఏసి వెంట్స్ మరియు హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు మొదలైనవి ఉన్నాయి.

Most Read Articles

English summary
Mg motor updates hector plus variant lineup two variants discontinued details
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X