హైబ్రిడ్ ఎనర్జీని ఉపయోగించే మొదటి కంపెనీగా MG Motor: పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థ ఎంజి మోటార్ (MG Motor). ఈ కంపెనీ దేశీయ మార్కెట్లో ఆధునిక SUV లను మరియు ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టి దినదినాభివృద్ధి చెందుతోంది. ఇటీవల కాలంలో కంపెనీ ఎంజి ఆస్టర్ SUV ని కూడా విడుదల చేసింది. ఇదిలా ఉండగా, కంపెనీ ఇటీవల ఒక అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది.

హైబ్రిడ్ ఎనర్జీని ఉపయోగించే మొదటి కంపెనీగా MG Motor: పూర్తి వివరాలు

ఎంజి మోటార్ కంపెనీ ఇప్పుడు విండ్-సోలార్ హైబ్రిడ్ ఎనర్జీని వినియోగించడానికి శ్రీకారం చుట్టింది. విండ్-సోలార్ హైబ్రిడ్ ఎనర్జీని అవలంబిస్తున్న దేశంలోనే మొదటి కార్ బ్రాండ్‌గా MG Motor అవతరించింది. ఇది నిజంగా ప్రశంసనీయం. దీని గురించి కంపెనీ ఈ రోజు ప్రకటిచింది.

హైబ్రిడ్ ఎనర్జీని ఉపయోగించే మొదటి కంపెనీగా MG Motor: పూర్తి వివరాలు

ఎంజి మోటార్ కంపెనీ తన హలోల్ ప్లాంట్‌లో వినియోగించే శక్తిలో 50 శాతం పునరుత్పాదక ఇంధన వనరుల నుండి వస్తుందని పేర్కొంది. గ్రీన్ ఎనర్జీ సాధించేందుకు కంపెనీ రాజ్‌కోట్‌లోని క్లీన్‌మాక్స్ విండ్ సోలార్ హైబ్రిడ్ పార్క్‌తో చేతులు కలిపింది. ఎంజి మోటార్స్ తన హలోల్ ఉత్పత్తి సౌకర్యం కోసం 4.85 MW విండ్-సోలార్ హైబ్రిడ్ పవర్‌ను పొందనున్నట్లు తెలిపింది.

హైబ్రిడ్ ఎనర్జీని ఉపయోగించే మొదటి కంపెనీగా MG Motor: పూర్తి వివరాలు

విండ్-సోలార్ హైబ్రిడ్ ఎనర్జీ పొందటం వల్ల కంపెనీ 15 సంవత్సరాలలో సుమారు రెండు లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ (CO2) ఉత్పత్తిని తగ్గించవచ్చని పేర్కొంది. అంటే ఇది సుమారుగా 13 లక్షల చెట్లను నాటడానికి సమానం అవుతుంది. దీని వల్ల పర్యావరణం కాలుష్యం కోరలనుంచి కొంతవరకు తప్పించుకోవచ్చు.

హైబ్రిడ్ ఎనర్జీని ఉపయోగించే మొదటి కంపెనీగా MG Motor: పూర్తి వివరాలు

దీని గురించి ఎంజి మోటార్ ఇండియా ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ 'రాజీవ్ చాబా' మాట్లాడుతూ.. ఇది స్థిరమైన భవిష్యత్తు పట్ల బ్రాండ్ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుందని, అంతే కాకుండా సుస్థిర భవిష్యత్తు కోసం కంపెనీ తన నిబద్ధతను ఎప్పుడూ చాటుతుందని తెలిపారు. ఇది మాత్రమే కాకుండా ఇతర కంపెనీలు కూడా దీనిని ఆదర్శంగా తీసుకోవడానికి కూడా ఒక మార్గదర్శకం అవుతుంది అని ఆయన ప్రస్తావించారు.

క్లీన్‌మాక్స్‌తో మా అనుబంధం స్వచ్ఛమైన తయారీ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో చాలా దోహదపడుతుంది. ఈ చర్యతో మా శక్తి ఖర్చులను తగ్గించుకుంటూ స్థిరమైన వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మా పాత్రను పెంచుకోవాలని మేము ఆశిస్తున్నామని కూడా ఆయన అన్నారు. రానున్న కాలంలో మరిన్ని కంపెనీలు ఇలాంటి చర్యను స్వీకరించే అవకాశం ఉందని కూడా భావిస్తున్నాము.

హైబ్రిడ్ ఎనర్జీని ఉపయోగించే మొదటి కంపెనీగా MG Motor: పూర్తి వివరాలు

దీని క్లీన్‌మాక్స్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ కులదీప్ జైన్ మాట్లాడుతూ, ఎంజి మోటార్స్ తన విద్యుత్ అవసరాలలో 50 శాతం హైబ్రిడ్ ఫామ్ నుండి సరఫరా చేయబడుతోందని చెప్పారు. ఇది ఎంజి మోటార్ ఇండియా నిర్వహణ ఖర్చులలో గణనీయమైన పొదుపును పొందటానికి వీలు కల్పిస్తుంది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పర్యావరణంలో CO2 ఉద్గారాలను కూడా గణనీయంగా తగ్గించవచ్చు. ఇది రానున్న తరాలకు చాలా క్షేమదాయకంగా ఉంటుంది.

హైబ్రిడ్ ఎనర్జీని ఉపయోగించే మొదటి కంపెనీగా MG Motor: పూర్తి వివరాలు

ఎంజి మోటార్ కంపెనీకి ఇబ్బంది లేని పరిష్కారాన్ని అందించడానికి మేము విద్యుత్తును సరఫరా చేస్తున్నాము. స్వతంత్ర సౌర శక్తి లేదా విండ్ పవర్ వలె కాకుండా, విండ్-సోలార్ హైబ్రిడ్ పవర్ రౌండ్-ది-క్లాక్ విద్యుత్ సరఫరాను అందిస్తుంది. వినియోగదారులు తమ రోజువారీ విద్యుత్ అవసరాలలో ఇది అధిక శాతం పునరుత్పాదక శక్తితో తీర్చుకునేలా చేస్తుంది.

ఎంజి మోటార్స్ ఇండియా ఇటీవల సెక్టార్-30, గురుగ్రామ్‌లో రెసిడెన్షియల్ కమ్యూనిటీ ఛార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి నివాస ప్రదేశాలలో సులభంగా ఉపయోగించగల ఛార్జింగ్ స్టేషన్‌లను మరియు ఛార్జింగ్ పాయింట్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేస్తోంది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న కారణంగా ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి ప్రజలు ఆసక్తి చూపుతారు, తద్వారా ఎలక్ట్రిక్ వాహన వినియోగం క్రమంగా పెరుగుతుంది.

హైబ్రిడ్ ఎనర్జీని ఉపయోగించే మొదటి కంపెనీగా MG Motor: పూర్తి వివరాలు

ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ సంఖ్యలో వినియోగించకపోవడానికి ప్రధాన కారణం, సరైన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకుండా పోవడం. కావున ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్‌ను పెంచడంలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాల లభ్యత అత్యంత ముఖ్యమైన దోహదకారి. దేశంలో ఎంత త్వరగా ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయబడితే, దేశంలో కార్బన్ ఉద్గారాలు అంత త్వరగా తగ్గించవచ్చు.

హైబ్రిడ్ ఎనర్జీని ఉపయోగించే మొదటి కంపెనీగా MG Motor: పూర్తి వివరాలు

రాబోయే కొద్ది సంవత్సరాలలో, భారతదేశం గ్రీన్ మొబిలిటీకి ప్రాతినిధ్యం వహిస్తుందని మరియు ఎలక్ట్రిక్ వాహనాల పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని కంపెనీ పేర్కొంది. ఎంజి మోటార్స్ తన ఛార్జింగ్ స్టేషన్లలో ఫాస్ట్ ఛార్జింగ్‌ను సులభతరం చేయడానికి టాటా పవర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కంపెనీ తన ఎలక్ట్రిక్ SUV, ZS EV యొక్క కస్టమర్ల ఇళ్ల వద్ద ఛార్జింగ్ పాయింట్లను కూడా ఇన్‌స్టాల్ చేస్తుంది.

ఎంజి మోటార్స్ ZS EV కి రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సర్వీస్‌ను కూడా అందిస్తుంది. MG ZS EV యొక్క కొత్త మోడల్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రారంభించబడింది. ఈ ఎలక్ట్రిక్ కారు ఎక్సైట్ మరియు ఎక్స్‌క్లూజివ్ అనే రెండు ట్రిమ్‌లలో అందుబాటులోకి వచ్చింది. ఎక్సైట్ ధర రూ. 20.99 లక్షలు కాగా, ఎక్స్‌క్లూజివ్ ధర రూ. 24.18 లక్షలు (ఎక్స్-షోరూమ్).

హైబ్రిడ్ ఎనర్జీని ఉపయోగించే మొదటి కంపెనీగా MG Motor: పూర్తి వివరాలు

MG ZS ఎలక్ట్రిక్ కారు 44.5 kWh IP6 సర్టిఫైడ్ బ్యాటరీతో శక్తిని పొందింది, ఇది పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6 నుంచి 8 గంటలు పడుతుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 419 కి.మీల పరిధిని అందిస్తుంది. అంతే కాకుండా ఇది కేవలం 8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న కార్లలో ఒకటిగా ఉంది.

హైబ్రిడ్ ఎనర్జీని ఉపయోగించే మొదటి కంపెనీగా MG Motor: పూర్తి వివరాలు

దేశంలో రోజురోజుకి కాలుష్యం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇది భవిష్యత్ తరాలకు అంత మంచిది కాదు. ప్రస్తుతం ఢిల్లీ నగరంలో కాలుష్యం కోరల్లో నలుగుతోంది. ఈ కారణంగానే ఢిల్లీ ప్రభుత్వం అనేక కఠినమైన చర్యలను తీసుకుంటోంది. ఇందులో భాగంగానే పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల వినియోగానికి బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు. కేవలం వాహనాలు మాత్రమే కాకుండా కంపెనీలు కూడా ఎంజి మోటార్ కంపెనీ తీసుకున్నటువంటి నిర్ణయాలను తీసుకుంటే కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చు.

Most Read Articles

English summary
Mg motors adopts wind solar hybrid energy to power its halol plant
Story first published: Thursday, November 25, 2021, 17:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X