MG Astor లోని మరో సూపర్ ఫీచర్ ఇదే.. వీడియో

MG Motor (ఎంజి మోటార్) దేశీయ మార్కెట్లో MG Astor అనే కొత్త SUV ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగానే కంపెనీ MG Astor ని మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కొత్త SUV అనేక అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుందని మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. కంపెనీ ఈ కొత్త Astor గురించి రోజు రోజుకి కొత్త కొత్త అప్డేట్స్ అందిస్తోంది. అయితే ఇప్పుడు ఈ SUV గురించి మరో ఫీచర్ వెల్లడిచింది. ఏ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

MG Astor లోని మరో సూపర్ ఫీచర్ ఇదే.. వీడియో

MG Motor కొత్త MG Astor SUV లో 'ఆటోమాటిక్ బ్రేకింగ్ ఫీచర్' అందింస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. మీరు ఈ వీడియోలో గమనించినట్లయితే వాహనదారుడు అప్రమత్తంగా లేని సమయంలో ముందు ప్రమాదం ఉంటె ఈ కారు వెంటనే ఆగుతుంది. ఇది ఇందులోని ఆటోమాటిక్ బ్రేకింగ్ ఫీచర్ వల్ల సాధ్యమవుతుంది.

MG Astor లోని మరో సూపర్ ఫీచర్ ఇదే.. వీడియో

ఈ ఫీచర్ వల్ల చాలా వరకు ప్రమాదాల సంఖ్య తగ్గడమే కాకుండా ప్రమాదంలో మరణించే వారి సంఖ్యను కూడా బాగా తగ్గించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు దేశీయ మార్కెట్లో విడుదలకు సిద్ధమవుతున్న కొత్త కార్లలో కూడా ఈ ఫీచర్ అందించే అవకాశం ఉంటుంది.

MG Astor లోని మరో సూపర్ ఫీచర్ ఇదే.. వీడియో

ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో మాత్రమే కాకుండా మొట్ట మొదటి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిస్టంతో రానున్న బ్రాండ్ యొక్క మొట్టి SUV ఈ MG Astor అవుతుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ సహాయంతో మీ వాయిస్ కమాండ్స్ ద్వారా అనేక పనులను నిర్వహించవచ్చు. అంటే కారులో వాయిస్ కమాండ్ ద్వారా మ్యూజిక్ ప్లే చేయడం మరియు ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడం వంటివి కూడా చేయవచ్చు.

MG Astor లోని మరో సూపర్ ఫీచర్ ఇదే.. వీడియో

పారాలింపిక్ క్రీడాకారిణి మరియు ఖేల్ రత్న విజేత దీపా మాలిక్ వాయిస్ ఈ ఎస్‌యూవీలో దీని కోసం ప్రత్యేకంగా ఉపయోగించబడింది. ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటివి కూడా MG Astor యొక్క అన్ని వేరియంట్లలోనూ స్టాండర్డ్ గా అందుబాటులో ఉంటుంది.

MG Astor లోని మరో సూపర్ ఫీచర్ ఇదే.. వీడియో

MG Astor యొక్క ఇంటీరియర్‌ చాలా సరళమైన డిజైన్ కలిగి ఉంటాయి. ఇందులో రెండు వైపులా రౌండ్ ఏసీ వెంట్‌లు ఉన్నాయి. డాష్‌బోర్డ్‌ కూడా చాలా కు చాలా సరళమైన డిజైన్ ఇవ్వబడింది మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మధ్యలో ఉంచబడింది మరియు గేర్‌బాక్స్ దాని దిగువన ఉంచబడింది.

MG Astor లోని మరో సూపర్ ఫీచర్ ఇదే.. వీడియో

MG Astor SUV లో అటానమస్ లెవల్-2 సిస్టమ్‌ తీసుకురాబడుతుంది. కంపెనీ రిలయన్స్ జియో రియల్ టైమ్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు టెలిమాటిక్స్ కోసం భాగస్వామిగా ఉంది, దీని కోసం ఈ-సిమ్ ఇవ్వబడుతుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ కోసం ఒక చిన్న రోబోట్ ఉంటుంది. MG Astor యొక్క అటానమస్ లెవల్-2 కింద, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్ మరియు స్పీడ్ అసిస్ట్ ఇవ్వబడుతుంది.

MG Astor లోని మరో సూపర్ ఫీచర్ ఇదే.. వీడియో

MG Astor కు ఐ-స్మార్ట్ హబ్ కింద పార్కింగ్ అసిస్ట్ అందించబడుతుంది, ఇది దేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో పార్కింగ్ స్థలాన్ని కనుగొనడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కొత్త SUV దేశీయ మార్కెట్లో విడుదలైతే అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉన్న మొదటి SUV కానుంది.

MG Astor లోని మరో సూపర్ ఫీచర్ ఇదే.. వీడియో

MG Astor SUV వాహన వినియోగారులకు అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. వాహన వినియోగదారుల సౌలభ్యం కోసం ఇది ఖచ్చితమైన కొలతలతో తీసుకురానుంది. MG Astor పొడవు 4,323 మిమీ, వెడల్పు 1,809 మిమీ మరియు ఎత్తు 1,650 మిమీ వరకు ఉంటుంది.

ఈ ఎస్‌యూవీ రెండు ఇంజన్ ఆప్షన్‌ లతో అందుబాటులోకి రానుంది. వీటిలో మొదటిది 220 టర్బో, 1349 సిసి పెట్రోల్ ఇంజన్. ఇది గరిష్టంగా 140 బిహెచ్‌పి పవర్ ను మరియు 220 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో లభిస్తుంది.

ఇక రెండవది 1498 సిసి పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్ ను మరియు 144 న్యూటన్ మీటర్ టార్క్ ఆడిస్తుంది. ఈ ఇంజన్ మాన్యువల్ మరియు 8 స్పీడ్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇవి మంచి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

MG Astor లోని మరో సూపర్ ఫీచర్ ఇదే.. వీడియో

MG Astor 6 ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీ కెమెరా, రియర్ డ్రైవ్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి 27 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను కంపెనీ అందిస్తోంది. ఈ కొత్త SUV భారతదేశంలో పండుగ సీజన్ లో విడుదల కానున్నట్లు సమాచారం. కావున బుకింగ్స్ కూడా 2021 అక్టోబర్ 07 నుంచి ప్రారంభం కానున్నాయి.

Most Read Articles

English summary
Mg reveals new tvc for astor video highlighted automatic braking feature
Story first published: Thursday, September 23, 2021, 15:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X