సెప్టెంబర్‌లో బెస్ట్ మిడ్-సైజ్ ఎస్‌యూవీలు: సెల్టోస్, క్రెటా, స్కార్పియో..

ఇటీవలి కాలంలో భారతదేశంలో ఎస్‌యూవీలకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ప్రత్యేకించి మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ఈ డిమాండ్ మరియు కార్ల మధ్య పోటీ కూడా అధికంగా ఉంది. ప్రస్తుతం, దేశీయ ప్యాసింజర్ కార్ మార్కెట్లో అత్యంత పోటీతో కూడుకున్న విభాగాలలో మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగం కూడా ఒకటి. ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా హారియర్, ఎమ్‌జి హెక్టర్, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ మరియు మహీంద్రా స్కార్పియో వంటి అనేక మోడళ్లు అందుబాటులో ఉన్నాయి.

సెప్టెంబర్‌లో బెస్ట్ మిడ్-సైజ్ ఎస్‌యూవీలు: సెల్టోస్, క్రెటా, స్కార్పియో..

గడచిన సెప్టెంబర్ 2021 నెలలో ప్రతికూల మార్కెట్ పరిస్థితులు ఉన్నప్పటికీ, మిడ్-సైజ్ ఎస్‌యూవీల అమ్మకాలు ప్రోత్సాహకరంగానే ఉన్నాయి. గత నెలలో అత్యధికంగా అమ్ముడైన మిడ్-సైజ్ ఎస్‌యూవీల వివరాలు వెల్లడయ్యాయి. ఈ జాబితాలో కియా సెల్టోస్ మొదటి స్థానంలో ఉండగా, హ్యుందాయ్ క్రెటా రెండవ స్థానానికి పడిపోయింది. ఆ తరువాతి స్థానాల్లో టాటా హారియర్, ఎమ్‌జి హెక్టర్ మరియు మహీంద్రా స్కార్పియో వంటి మోడళ్లు నిలిచాయి. మొత్తంగా చూస్తే, గత నెల మిడ్-సైజ్ ఎస్‌యూవీ అమ్మకాలు 16 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

సెప్టెంబర్‌లో బెస్ట్ మిడ్-సైజ్ ఎస్‌యూవీలు: సెల్టోస్, క్రెటా, స్కార్పియో..

1. కియా సెల్టోస్ (Kia Seltos)

సెప్టెంబర్ 2021 లో కియా సెల్టోస్ అమ్మకాలు 9,583 యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా, సెప్టెంబర్ 2020లో కంపెనీ 9,079 యూనిట్ల సెల్టోస్ కార్లను విక్రయించింది. ఈ సమయంలో సెల్టోస్ అమ్మకాలు 6 శాతం వృద్ధిని నమోదు చేశాయి. గత కొన్ని నెలలుగా, కియా సెల్టోస్ ఈ విభాగంలో రెండవ స్థానంలో ఉండేది. అయితే గత నెలలో ఇది ప్రధాన పోటీదారు అయిన హ్యుందాయ్ క్రెటాను అధిగమించి మొదటి స్థానాన్ని చేరుకుంది.

సెప్టెంబర్‌లో బెస్ట్ మిడ్-సైజ్ ఎస్‌యూవీలు: సెల్టోస్, క్రెటా, స్కార్పియో..

2. హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta)

హ్యుందాయ్ మోటార్ ఇండియా 2020 ఆరంభంలో కొత్త ఫేస్‌లిఫ్టెడ్ క్రెటాను మార్కెట్లో విడుదల చేసినప్పటి నుండి ఈ మోడల్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకూ దాదాపు ఎక్కువ కాలం నెంబర్ వన్ స్థానంలో నిలిచిన హ్యుందాయ్ క్రెటా ఇప్పుడు అమ్మకాల పరంగా రెండవ స్థానానికి పడిపోయింది. సెప్టెంబర్ 2020 లో క్రెటా అమ్మకాలు 12,325 యూనిట్లుగా ఉంటే, సెప్టెంబర్ 2021 నెలలో అవి 8,193 యూనిట్లకు తగ్గాయి. ఈ సమయంలో క్రెటా అమ్మకాలు 34 శాతం క్షీణించాయి.

సెప్టెంబర్‌లో బెస్ట్ మిడ్-సైజ్ ఎస్‌యూవీలు: సెల్టోస్, క్రెటా, స్కార్పియో..

3. టాటా హారియర్ (Tata Harrier)

ఈ జాబితాలో టాటా హారియర్ మూడవ స్థానంలో ఉంది. సెప్టెంబర్ 2021 లో టాటా మోటార్స్ మొత్తం 2,821 యూనిట్ల హారియర్ ఎస్‌యూవీలను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (సెప్టెంబర్ 2020 లో) ఇవి 1,755 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంతో పోలిస్తే హారియర్ అమ్మకాలలో 61 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇదిలా ఉంటే, తక్కువ అమ్మకాల కారణంగా, కంపెనీ ఈ మోడల్ లోని క్యామో ఎడిషన్‌ను నిలిపివేసింది - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

సెప్టెంబర్‌లో బెస్ట్ మిడ్-సైజ్ ఎస్‌యూవీలు: సెల్టోస్, క్రెటా, స్కార్పియో..

4. ఎమ్‌జి హెక్టర్ (MG Hector)

సెప్టెంబర్ 2021 నెలలో 2,722 యూనిట్ల అమ్మకాలతో ఎమ్‌జి హెక్టర్ నాల్గవ స్థానంలో నిలిచింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ 2,410 యూనిట్లను విక్రయించింది. ఈ సమయంలో హెక్టర్ అమ్మకాలు 13 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇదిలా ఉంటే, ఎమ్‌జి హెక్టర్ వేరియంట్ లైనప్‌లో కంపెనీ మార్పులు చేసింది. ఇప్పుడు ఇందులో బేస్ ట్రిమ్ (స్టైల్) కి ఎగువన అందిస్తున్న సూపర్ ట్రిమ్ ను కంపెనీ నిలిపివేసింది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

సెప్టెంబర్‌లో బెస్ట్ మిడ్-సైజ్ ఎస్‌యూవీలు: సెల్టోస్, క్రెటా, స్కార్పియో..

5. మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio)

గత నెలలో మొదటి 5 స్థానాల్లో నిలిచిన ఎస్‌యూవీలలో మహీంద్రా స్కార్పియో కూడా ఉంది. సెప్టెంబర్ 2021లో మహీంద్రా స్కార్పియో అమ్మకాలు 2,588 యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా, సెప్టెంబర్ 2020 లో ఈ మోడల్ అమ్మకాలు 3,527 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో మహీంద్రా స్కార్పియో అమ్మకాలు 27 శాతం తగ్గాయి. ఇదిలా ఉంటే, మహీంద్రా స్కార్పియోపై అందించే వారంటీని కంపెనీ సవరించింది - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

సెప్టెంబర్‌లో బెస్ట్ మిడ్-సైజ్ ఎస్‌యూవీలు: సెల్టోస్, క్రెటా, స్కార్పియో..

6. స్కోడా కుషాక్ (Skoda Kushaq)

స్కోడా ఆటో ఇటీవల మార్కెట్లో ప్రవేశపెట్టిన మిడ్-సైజ్ ఎస్‌యూవీ కుషాక్ గడచిన సెప్టెంబర్ 2021 నెలలో 2,158 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. దీంతో, ఇది స్కోడా నుండి అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా మారింది. ఈ కొత్త మోడల్ కస్టమర్లను బాగా ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే, స్కోడా కుషాక్ 1.5 టిఎస్ఐ స్టైల్ యొక్క ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్‌ లో కంపెనీ కొన్ని మార్పులు చేసింది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

సెప్టెంబర్‌లో బెస్ట్ మిడ్-సైజ్ ఎస్‌యూవీలు: సెల్టోస్, క్రెటా, స్కార్పియో..

7. హ్యుందాయ్ అల్కజార్ (Hyundai Alcazar)

హ్యుందాయ్ నుండి తాజాగా వచ్చిన 6/7-సీటర్ ఎస్‌యూవీ అల్కజార్ గత నెలలో 1,929 యూనిట్ల విక్రయాలతో ఏడవ స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే, అల్కజార్ 7-సీటర్ ఎస్‌యూవీలో కంపెనీ కొత్తగా మరో వేరియంట్ ను ప్రవేశపెట్టింది. మిడ్-స్పెక్ వేరియంట్ గా కంపెనీ ప్లాటినం (ఆప్షనల్) (Platinum (O)) అనే వేరియంట్‌ ను హ్యుందాయ్ విడుదల చేసింది. - ఈ వేరియంట్‌కు సంబంధించిన మరింత సమాచారం కోస ఈ లింకుపై క్లిక్ చేయండి.

సెప్టెంబర్‌లో బెస్ట్ మిడ్-సైజ్ ఎస్‌యూవీలు: సెల్టోస్, క్రెటా, స్కార్పియో..

గత నెలలో మారుతి సుజుకి ఎస్-క్రాస్ అమ్మకాలు 1,529 యూనిట్లుగా నమోదై, గతేడాదితో పోలిస్తే 27 శాతం క్షీణతను నమోదు చేసి 8వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో (9వ స్థానంలో) 1,500 యూనిట్లతో టాటా మోటార్స్ కొత్తగా వచ్చిన సఫారీ ఎస్‌యూవీ నిలిచింది. ఫోక్స్‌వ్యాగన్ నుండి లేటెస్ట్‌గా వచ్చిన టైగన్ ఎస్‌యూవీ గత నెలలో 1461 యూనిట్ల విక్రయాలతో 10వ స్థానంలో నిలిచింది.

సెప్టెంబర్‌లో బెస్ట్ మిడ్-సైజ్ ఎస్‌యూవీలు: సెల్టోస్, క్రెటా, స్కార్పియో..

ఇకపోతే, గత నెలలో 1370 యూనిట్ల మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలు వివిధ డీలర్‌షిప్ కేంద్రాలకు పంపబడ్డాయి. దాని తర్వాతి స్థానాల్లో జీప్ కంపాస్ 1311 యూనిట్లు, నిస్సాన్ కిక్స్ 371 యూనిట్లు, రెనో డస్టర్ 275 యూనిట్లు, ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ 227 యూనిట్లు, మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ 160 యూనిట్లు మరియు హ్యుందాయ్ కోనా 1 యూనిట్ చొప్పున అమ్ముడయ్యాయి.

Most Read Articles

English summary
Mid size suv sales in september 2021 seltos creta scorpio and more
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X