భారత్‌లో మినీ ఇండియా లాంచ్ చేసిన మూడు కొత్త కార్లు; పూర్తి వివరాలు

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మినీ ఇండియా, తన సరికొత్త మినీ 3-డోర్ హ్యాచ్, ఆల్-న్యూ మినీ కన్వర్టిబుల్ మరియు సరికొత్త మినీ జాన్ కూపర్ వర్క్స్ హ్యాచ్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ సరికొత్త మినీ రేంజ్ కార్లను పెట్రోల్ ఇంజిన్‌లో కంప్లీట్లీ బిల్ట్-అప్ యూనిట్లుగా భారతదేశానికి అందిస్తున్నారు. త్రీ డోర్స్ హ్యాచ్‌బ్యాక్, కన్వర్టిబుల్ మరియు జాన్ కూపర్ వర్క్స్ (జెసిడబ్ల్యు) ఎడిషన్లను విడుదల చేయడంతో, కొత్త బుకింగ్ ప్రక్రియ కూడా అధికారికంగా ప్రారంభించబడింది.

భారత్‌లో మినీ ఇండియా లాంచ్ చేసిన మూడు కొత్త కార్లు; పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త మినీ 3-డోర్ హ్యాచ్ ధర ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 38,00,000 కాగా, మినీ కన్వర్టిబుల్ ధర రూ. 44,00,000 వరకు ఉంటుంది. అంతే కాకుండా మినీ జాన్ కూపర్ వర్క్స్ హ్యాచ్ ధర ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 45,50,000 గా ఉంది.

భారత్‌లో మినీ ఇండియా లాంచ్ చేసిన మూడు కొత్త కార్లు; పూర్తి వివరాలు

ఆల్-న్యూ మినీ 3-డోర్ హ్యాచ్ మరియు సరికొత్త మినీ కన్వర్టిబుల్ మునుపటికంటే కూడా చాలా మెరుగైన డిజైన్‌తో సరళమైన మరియు ఆధునిక డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో అప్‌డేట్ చేసిన ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్, ఎల్‌ఇడి టైల్ లాంప్, హుడ్ స్కోప్, సరౌండ్ బాడీ క్లాంపింగ్, ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌ఎస్ తో టర్న్ ఇండికేటర్ మరియు 17 ఇంచెస్ అల్లాయ్ వీల్‌హౌస్‌లు ఉన్నాయి.

భారత్‌లో మినీ ఇండియా లాంచ్ చేసిన మూడు కొత్త కార్లు; పూర్తి వివరాలు

హై-ఎండ్ మోడల్, జాన్ కూపర్ వర్క్స్ వెర్షన్, ఇతర కార్ వెర్షన్ల కంటే అధిక స్థాయి సాంకేతిక లక్షణాలను కలిగి ఉంది, ఇందులో బోనెట్ స్ట్రిప్, కాంట్రాస్ట్ ఫినిష్, రూఫ్, మిర్రర్ క్యాప్స్, 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మరియు స్పోర్టి ఎడ్జ్ డిజైన్ వంటివి ఉన్నాయి.

భారత్‌లో మినీ ఇండియా లాంచ్ చేసిన మూడు కొత్త కార్లు; పూర్తి వివరాలు

ఈ కొత్త కార్ల లోపలి భాగంలో రౌండ్ షాఫ్ట్ థీమ్ క్యాబిన్, స్పోర్టి సీట్లు, డార్క్ ఇంటీరియర్ మరియు రెడ్ కాంట్రాస్ట్ వంటి కొన్ని పెద్ద మార్పులు చేయబడ్డాయి. దీనితో పాటు 8.8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 5 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్ప్లే, యాంబియంట్ లైటింగ్స్, హార్మోన్ కార్డోన్ ఆడియో సిస్టమ్ మరియు క్రూయిజ్ కంట్రోల్, నావిగేషన్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు అధునాతన బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉన్నాయి.

భారత్‌లో మినీ ఇండియా లాంచ్ చేసిన మూడు కొత్త కార్లు; పూర్తి వివరాలు

మినీ 3-డోర్ హ్యాచ్ మరియు మినీ కన్వర్టిబుల్ నాలుగు కొత్త కలర్స్ లో ప్రవేశపెట్టబడ్డాయి. అవి రూప్ గ్రే మెటాలిక్, ఐలాండ్ బ్లూ మెటాలిక్, ఎనిగ్మాటిక్ బ్లాక్ మరియు జెస్టి ఎల్లో (మినీ కన్వర్టిబుల్స్ లో మాత్రమే). ఇది కాకుండా, ఆప్సనల్ పియానో ​​బ్లాక్ ఎక్స్టీరియర్ ఆప్సన్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.

భారత్‌లో మినీ ఇండియా లాంచ్ చేసిన మూడు కొత్త కార్లు; పూర్తి వివరాలు

ఇక ఈ మినీ 3-డోర్ హ్యాచ్ మరియు మినీ కన్వర్టిబుల్ 2.0 లీటర్, ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో ట్విన్‌పవర్ టర్బో టెక్నాలజీతో పనిచేస్తాయి, ఇది 192 బిహెచ్‌పి శక్తిని మరియు 280 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మినీ 3-డోర్ హ్యాచ్ 7-స్పీడ్ డబుల్ క్లచ్ స్టెప్ట్రానిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

భారత్‌లో మినీ ఇండియా లాంచ్ చేసిన మూడు కొత్త కార్లు; పూర్తి వివరాలు

ఇక మినీ కన్వర్టిబుల్‌ మాత్రం 8-స్పీడ్ స్టెప్ట్రానిక్ స్పోర్ట్ గేర్‌బాక్స్ కలిగి ఉంటుంది. మినీ జాన్ కూపర్ వర్క్స్ హ్యాచ్ మరింత స్పోర్టి డ్రైవింగ్ అనుభవం కోసం తెడ్డు షిఫ్టర్లను కలిగి ఉంది. ఇందులో స్టాండర్డ్ ఎమ్ఐడి మోడ్ కాకుండా, స్పోర్ట్ మరియు గ్రీన్ మోడ్ ఆప్సన్ కూడా లభిస్తుంది. ఏది ఏమైనా ఇవి వాటి మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం వల్ల వాహనదారులకు హలా అనుకూలంగా ఉంటాయి.

Most Read Articles

Read more on: #మినీ #mini
English summary
MINI India Launches Three New Cars In India. Read in Telugu.
Story first published: Wednesday, June 23, 2021, 9:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X