మాట నిలబెట్టుకున్న జగన్‌మోహన్‌రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యాక్రమాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. పాదయాత్రలో చేసిన హామీలన్నీ నెరవేర్చడంలో భాగంగా ఇప్పుడు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశంలోనే తొలిసారిగా ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రారంభిస్తున్నారు. ఈ వ్యవస్థ ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేకపోవడం గమనార్హం.

మాట నిలబెట్టుకున్న జగన్‌మోహన్‌రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం

ప్రతినెల ప్రభుత్వం అందించే రేషన్ సరుకులను తీసుకోవడానికి కార్డు దారులు ఎక్కువ శ్రమ పాడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు కార్డుదారులు ముఖ్యంగా రోజువారీ కూలీలు, వృద్ధులు మొదలైన వారికి ఈ డోర్ డెలివరీ రేషన్ పంపిణీ చాలా బాగా ఉపయోగపడుతుంది.

మాట నిలబెట్టుకున్న జగన్‌మోహన్‌రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం

డోర్ డెలివరీ రేషన్ పంపిణీ కోసం ఈ రోజు కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి 2,500 రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద ముఖ్యమంత్రి‌ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల మంత్రి కొడాలి నాని తదితరులు పాల్గొంటున్నారు. రాష్ట్రంలో మిగిలిన జిల్లాలకు కేటాయించిన వాహనాలను మంత్రులు ప్రారంభిస్తారు.

MOST READ:అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్ ఉపయోగించే 'దెయ్యం' కారు గురించి తెలుసా?

మాట నిలబెట్టుకున్న జగన్‌మోహన్‌రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం

రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 1వతేదీ నుంచి నాణ్యమైన రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీ చేయడం కోసం 9,260 వాహనాలు సిద్ధమయ్యాయి. కార్డు దారులకు రేషన్ సరుకులను డోర్ డెలివరీ చేయడానికి ప్రతి సంవత్సరం రూ. 830 కోట్లు వెచ్చించాల్సి ఉంది.

మాట నిలబెట్టుకున్న జగన్‌మోహన్‌రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులకు బియ్యం ఇంటివద్దే పంపిణీ చేస్తారు. మొబైల్‌ ఆపరేటర్‌ (వాహనదారుడు) రోజూ ఉదయం బియ్యంతో పాటు ఈ-పాస్‌ మిషన్ రేషన్‌ డీలర్‌ నుంచి తీసుకుని మొత్తం పంపిణీ చేసిన తరువాత ఈ పాస్ మిషన్ రేషన్ డీలర్ కి అందజేస్తారు. ఇందుకోసం రేషన్‌ డీలర్లు, వలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందిని కలిసి పనిచేయాల్సి ఉంటుంది.

MOST READ:బైక్ మ్యూజియంలో అగ్నికి ఆహుతైన అరుదైన వాహనాలు

మాట నిలబెట్టుకున్న జగన్‌మోహన్‌రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం

ఆంధ్రప్రదేశ్ సీఎం ప్రవేశపెట్టిన ఈ వినూత్న కార్యక్రమం ద్వారా చాలామందికి ఉపాధి చేకూరుతుంది. డోర్ డెలివరీకి ఉపయోగించే ఈ మొబైల్ వాహనాలలో వేయింగ్‌ స్కేల్‌, కొలతల పరికరాలు, ఎల్‌ఈడీ ల్యాంప్స్, ఈ-పాస్‌ మిషన్ ఛార్జింగ్‌ పాయింట్లు, మినీ ఫ్యాన్, చిన్న మైక్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, క్యాష్ బాక్స్, నోటీసు బోర్డు వంటివి ఏర్పాటు చేయబడి ఉంటుంది.

మాట నిలబెట్టుకున్న జగన్‌మోహన్‌రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం

ఆంధ్రప్రదేశ్ లో డోర్ డెలివరీ రేషన్ కోసం టాటా ఎస్ గోల్డ్ వెహికల్స్ ఉపయోగిస్తారు. ఇవి రేష డెలివరీ చేయడానికి అనుకూలంగా తయారుచేయబడ్డాయి. టాటా ఏస్ గోల్డ్ వెహికల్ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ నేపథ్యంలో టాటా గోల్డ్ ఏస్ వాహనాలను ప్రజా సేవలకు ఉపయోగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.

MOST READ:బువ్వ తిను, బుల్లెట్ బైక్ పట్టుకెళ్లు: రాయల్ ఎన్‌ఫీల్డ్ 'బుల్లెట్' థాలి ఛాలెంజ్

మాట నిలబెట్టుకున్న జగన్‌మోహన్‌రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం

టాటా ఏస్ గోల్డ్ డీజిల్, పెట్రోల్ మరియు సిఎన్జి ఇంజన్లతో విక్రయించబడింది. ఈ ఇంజిన్‌లన్నీ బిఎస్ 6 నిబంధనలకు అనుగుణంగా నవీకరించబడ్డాయి. టాటా మోటార్స్ యొక్క అత్యంత విశ్వసనీయ వాహనాల్లో ఏస్ గోల్డ్ ఒకటి. టాటా ఏస్ గోల్డ్ చాలా సంవత్సరాలుగా దేశీయ మార్కెట్లో అమ్మబడుతోంది.

Most Read Articles

English summary
YSR rice vehicles Start in Andhra Pradesh. Read in Telugu.
Story first published: Thursday, January 21, 2021, 16:00 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X