2021 లో టాప్ 5 పనోరమిక్ సన్‌రూఫ్ కలిగిన కార్లు ; ధరలు & పూర్తి వివరాలు

భారత మార్కెట్లో రోజురోజుకి కొత్త కార్లు పుట్టుకొస్తున్నాయి. ఈ కొత్త వాహనాలలో లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలు ఉంటాయి. వాహన కొనుగోలు దారులు కూడా మంచి ఫీచర్స్ ఉన్న వాహనాలను కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇటీవల కాలంలో కారులో అందించే అత్యంత ముఖ్యమైన ఫీచర్స్ లో ఒకటి పనోరమిక్ సన్‌రూఫ్. దేశీయ మార్కెట్లో ఉన్న చాలామంది వాహనదారులు కూడా ఈ సన్‌రూఫ్ కార్లనే ఎక్కువ ఇష్టపడతారు.

2021 లో టాప్ 5 పనోరమిక్ సన్‌రూఫ్ కలిగిన కార్లు ; ధరలు & పూర్తి వివరాలు

ఇంతకు ముందు కేవలం లగ్జరీ కార్లలో మాత్రమే పనోరమిక్ సన్‌రూఫ్‌ ఫీచర్ ఉండేది. కానీ ఇప్పుడు చాలా కార్లు సన్‌రూఫ్ ఫీచర్ ని కలిగి ఉన్నాయి. వాహన కొనుగోలుదారులలో కేవలం యువకులు మాత్రమే కాకుండా దాదాపు అన్ని వయసుల వారు ఈ ఫీచర్ ని ఎక్కువగా ఇష్టపడతారు.

2021 లో టాప్ 5 పనోరమిక్ సన్‌రూఫ్ కలిగిన కార్లు ; ధరలు & పూర్తి వివరాలు

భారతదేశంలో కారు కొనుగోలు చేసేటప్పుడు సన్‌రూఫ్ ఫీచర్‌ ఉన్న వాహనాలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. కొన్ని కొత్త కార్లలో పెద్ద డ్యూయల్ పెయింట్ పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందిస్తున్నాయి. ఇప్పటికి కూడా చాలా ప్రసిద్ధ ఎస్‌యూవీలు మరియు ఎమ్‌పివిలకు సన్‌రూఫ్ ఫీచర్ లేదు. ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో సరసమైన ధర వద్ద లభించే పనోరమిక్ సన్‌రూఫ్ కార్ల గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

MOST READ:భారతదేశంలో మొట్టమొదటి స్ట్రీట్ లైట్ ఈవి ఛార్జింగ్ స్టేషన్ ఇదే.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

2021 లో టాప్ 5 పనోరమిక్ సన్‌రూఫ్ కలిగిన కార్లు ; ధరలు & పూర్తి వివరాలు

హ్యుందాయ్ క్రెటా :

ప్రస్తుతం భారతదేశంలో పనోరమిక్ సన్‌రూఫ్‌తో అందిస్తున్న ఉత్తమ కార్లలో హ్యుందాయ్ క్రెటా ఒకటి. పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్లు హ్యుందాయ్ క్రెటా మిడ్ ఎస్‌యూవీ యొక్క ఎస్ఎక్స్ మరియు ఎస్ఎక్స్ (ఓ) వేరియంట్లలో అందించబడతాయి. ఈ హ్యుందాయ్ క్రెటా మిడ్ ఎస్‌యూవీ ధర దేశీయ మార్కెట్లో రూ. 13.79 లక్షల నుంచి రూ. 17.53 లక్షల వరకు ఉంటుంది.

2021 లో టాప్ 5 పనోరమిక్ సన్‌రూఫ్ కలిగిన కార్లు ; ధరలు & పూర్తి వివరాలు

ఎంజీ హెక్టర్:

ఎంజి మోటార్ కంపెనీ యొక్క ఎంజి హెక్టర్ రేంజ్-టాపింగ్ షార్ప్ ట్రిమ్ లో మాత్రమే పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందించబడుతుంది. ఈ వేరియంట్ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ హైబ్రిడ్ ఎమ్‌టి కలిగి ఉంటుంది. దీని ధర రూ. 17.10 లక్షలు. అదేవిధంగా ఇందులో టర్బో-పెట్రోల్ డిసిటి లేదా సివిటి ధర రూ. 18.10 లక్షల వారికి ఉంది. ఇక ఇందులో ఉన్న 2.0 లీటర్ మోడల్ ధర రూ.18.43 లక్షలు.

MOST READ:పబ్లిక్ రోడ్డుపై బైక్ స్టంట్ ; వీడియో చూసి పోలీసులకు పట్టుబడ్డ బైకర్

2021 లో టాప్ 5 పనోరమిక్ సన్‌రూఫ్ కలిగిన కార్లు ; ధరలు & పూర్తి వివరాలు

ఎంజీ హెక్టర్ ప్లస్:

ఎంజి మోటార్ ఇప్పుడు హెక్టర్ ప్లస్ వేరియంట్లో కూడా పనోరమిక్ సన్‌రూఫ్‌ అందిస్తుంది. 6-సీట్ల వెర్షన్‌లో, షార్ప్ ట్రిమ్ మరియు 7-సీట్ల మోడల్ సెలక్ట్ ట్రిమ్ ఈ పనోరమిక్ సన్‌రూఫ్ పొందుతుంది.

ఎంజి హెక్టర్ ప్లస్ పెట్రోల్-హైబ్రిడ్ ఎంటీ, పెట్రోల్ సివిటి, పెట్రోల్ డిసిటి మరియు డీజిల్ ఎంటి కాన్ఫిగరేషన్లతో లభిస్తుంది, వీటి ధర రూ. 17.85 నుండి రూ. 19.23 లక్షల వరకు ఉంటుంది.

2021 లో టాప్ 5 పనోరమిక్ సన్‌రూఫ్ కలిగిన కార్లు ; ధరలు & పూర్తి వివరాలు

టాటా హారియర్:

టాటా హారియర్ ఎక్స్‌జెడ్ ప్లస్ మరియు ఎక్స్‌జెడ్ఏ ప్లస్ వేరియంట్లలో డ్యూయల్-పెయింట్ సన్‌రూఫ్‌తో పాటు స్పెషల్ ఎడిషన్ కామో మరియు డార్క్ ఎడిషన్‌లో కూడా అందించబడుతుంది. పనోరమిక్ సన్‌రూఫ్ అమర్చిన వేరియంట్ల ధరలు ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 19.05 లక్షల నుండి రూ. 20.45 లక్షల వరకు ఉన్నాయి.

MOST READ:కార్లలో ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్ అంటే ఏమిటి, అదెలా పనిచేస్తుంది?

2021 లో టాప్ 5 పనోరమిక్ సన్‌రూఫ్ కలిగిన కార్లు ; ధరలు & పూర్తి వివరాలు

టాటా సఫారి:

ఇటీవల ప్రారంభించిన న్యూ-జెన్ సఫారి, పైన పేర్కొన్న హారియర్ యొక్క మూడు-లైన్ వెర్షన్. అందువల్ల, 5 సీట్ల ఎస్‌యూవీలోని ఫీచర్స్ కూడా ఇందులో ఉంటాయి. ఈ ఎస్‌యూవీకి చెందిన ఎక్స్‌టి +, ఎక్స్‌జెడ్‌డి +, ఎక్స్‌జెడ్‌డి + వేరియంట్‌లకు పనోరమిక్ సన్‌రూఫ్ లభిస్తుంది. దీని ధర రూ .18.25 లక్షల నుంచి రూ. 21.45 లక్షల మధ్య ఉంటుంది.

2021 లో టాప్ 5 పనోరమిక్ సన్‌రూఫ్ కలిగిన కార్లు ; ధరలు & పూర్తి వివరాలు

వాహనాలలో ఉన్న పనోరమిక్ సన్‌రూఫ్ బయటి వాతావరణాన్ని వీక్షించడానికి, మరియు మంచి గాలి లోపలి రావడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ కారణంగా ఈ పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్న వాహనాలు మార్కెట్లో ఎక్కువ అమ్మకాలను జరుపుతున్నాయి.

MOST READ:విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించిన పిల్లి.. ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజమే

Most Read Articles

English summary
5 Most Affordable Cars With Panoramic Sunroof In 2021. Read in Telugu.
Story first published: Saturday, March 6, 2021, 15:31 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X