కరోనా నేపథ్యంలో కలర్ స్టిక్కర్స్.. ఏ వాహనానికి ఏ స్టిక్కర్ అంటే?

భారతదేశంలో రోజురోజుకి కరోనా మహమ్మరి అధికంగా వ్యాపిస్తోంది. ఈ కారణంగా ఇప్పటికే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక మొదలైన ప్రాంతాలలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. అయినప్పటికీ మరింత పెరుగుతున్న కరోనా వైరస్ ని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని అమలులోకి తెచ్చింది.

కరోనా నేపథ్యంలో కలర్ స్టిక్కర్స్.. ఏ వాహనానికి ఏ స్టిక్కర్ అంటే?

మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలకోసం వాహనాలను ఒక గుర్తింపు కోసం కలర్ స్టిక్కర్స్ ఉపయోగించాల్సిందిగా నిర్ణయించింది. కర్ఫ్యూ సమయంలో పనిచేసే అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాల కోసం కలర్ స్టిక్కర్లను ఉపయోగించాలని ముంబై ప్రభుత్వం ఇటీవల ఒక ఉత్తర్వు జారీ చేసింది.

కరోనా నేపథ్యంలో కలర్ స్టిక్కర్స్.. ఏ వాహనానికి ఏ స్టిక్కర్ అంటే?

ఈ కొత్త చట్టం రోడ్డుపై వాహనాల రాకపోకలను పరిమితం చేయడంలో సహాయపడుతుందని ముంబై పోలీసులు తెలిపారు. ఈ అత్యవసర సమయంలో ఉపయోగించే వాహనాలకు ముంబై పోలీసులు రెడ్, గ్రీన్ మరియు ఎల్లో కలర్ స్టిక్కర్లను జారీ చేశారు.

MOST READ:మహీంద్రా బొలెరో యాక్ససరీస్ వచ్చేశాయ్.. ధర, వివరాలు ఇక్కడ చూడండి

కరోనా నేపథ్యంలో కలర్ స్టిక్కర్స్.. ఏ వాహనానికి ఏ స్టిక్కర్ అంటే?

పెరుగుతున్న కరోనా మహమ్మారి కేసులను అరికట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం రూల్స్ కఠినంగా అమలు చేయడానికి ఇది దోహదపడుతుందని ముంబై పోలీసులు చెప్పారు. ఇది అత్యవసర వాహనాలు మరియు అనవసరమైన వాహనాల మధ్య తేడాను గుర్తిచడానికి ఉపయోగపడుతుంది.

కరోనా నేపథ్యంలో కలర్ స్టిక్కర్స్.. ఏ వాహనానికి ఏ స్టిక్కర్ అంటే?

ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడం కూడా సులభం అవుతుందని పోలీసులు తెలిపారు. ముంబైలోని ప్రతి టోల్ ప్లాజాలో ఈ స్టిక్కర్లను ఉచితంగా అందిస్తున్నారు. ఇక్కడ జరీ చేసే స్టిక్కర్లు 6 ఇంచెస్ పరిమాణంలో రౌండ్ షేప్ లో ఉంటాయి. ఈ స్టిక్కర్లు నిర్దేశిత వాహనం యొక్క ముందు భాగంలో అతికించాలి.

MOST READ:భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్‌లో‌ చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు

కరోనా నేపథ్యంలో కలర్ స్టిక్కర్స్.. ఏ వాహనానికి ఏ స్టిక్కర్ అంటే?

ఆరోగ్య సంబంధిత నిపుణులు, వైద్యులు, వైద్య సిబ్బంది, అంబులెన్సులు, వైద్య పరికరాల సరఫరాదారులు ఉపయోగించే వాహనాలకు రెడ్ స్టిక్కర్లు ఇవ్వబడతాయి. ఆహారం, కూరగాయలు, పండ్లు, కిరాణా, పాల ఉత్పత్తులు వంటి నిత్యావసర వస్తువుల రవాణాలో పాల్గొనే వాహనాలు గ్రీన్ స్టిక్కర్స్ ఇవ్వబడతాయి.

కరోనా నేపథ్యంలో కలర్ స్టిక్కర్స్.. ఏ వాహనానికి ఏ స్టిక్కర్ అంటే?

చివరగా నిత్యావసర సేవలు, విద్యుత్ మరియు టెలికాం విభాగం సిబ్బంది, ముంబై మునిసిపల్ కార్పొరేషన్ లేదా బిఎంసి అధికారుల వాహనాలకు మరియు మీడియా సభ్యులు వాహనాలకు ఆరంజ్ కలర్ స్టిక్కర్లు ఇవ్వబడతాయి.

MOST READ:రూ. 9 కోట్ల విలువైన కారు కొన్న కుమార మంగళం బిర్లా; పూర్తి వివరాలు

కరోనా నేపథ్యంలో కలర్ స్టిక్కర్స్.. ఏ వాహనానికి ఏ స్టిక్కర్ అంటే?

దీని గురించి ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నాగ్రాలే మాట్లాడుతూ, ఈ కొత్త కలర్ స్టిక్కర్ విధానం వల్ల సంబంధిత వాహనాలను చాలా సులభంగా గుర్తించవచ్చు, అంతే కాకుండా అనవసరమైన వాహనాలపై చర్యలు తీసుకోవడం కూడా చాలా సులభంగా ఉంటుంది.

కరోనా నేపథ్యంలో కలర్ స్టిక్కర్స్.. ఏ వాహనానికి ఏ స్టిక్కర్ అంటే?

మహారాష్ట్రలో చాలా ఎక్కువ సంఖ్యలో కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ కారణంగా కరోనా వైరస్ ని అరికట్టడానికి మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలో సెక్షన్ 144 విధిచబడింది. ఈ కఠినమైన నిర్ణయాల వల్ల కొంతమేరకు అయిన వాహనదారులను ఆరికట్టవచ్చని ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

MOST READ:భాగ్యనగరంలో సైకిల్‌పై కనిపించిన సోనూసూద్ [వీడియో]

కరోనా నేపథ్యంలో కలర్ స్టిక్కర్స్.. ఏ వాహనానికి ఏ స్టిక్కర్ అంటే?

ముంబైలోని పూణే, నాగ్‌పూర్ వంటి నగరాలు ప్రపంచంలో ఎక్కువగా ప్రభావితమైన పట్టణ ప్రాంతాలలో ఒకటిగా ఉన్నాయి. ఈ సమయంలో ఈ కలర్ స్టిక్కర్ పాలసీ చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈ స్టిక్కర్స్ సహాయంతో వాహనాలను సులభంగా గుర్తించవచ్చు.

Most Read Articles

English summary
Mumbai Administration Issues Colour Coded Stickers For Emergency Vehicles. Read in Telugu.
Story first published: Monday, April 19, 2021, 11:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X