భారత్‌లో జూన్ 24న బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ, భారత మార్కెట్లో విక్రయిస్తున్న లగ్జరీ సెడాన్ బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్‌లో కంపెనీ ఓ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను జూన్ 24వ తేదీన విడుదల చేయనుంది. మునుపటి వెర్షన్‌తో పోలిస్తే, కొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ ఫేస్‌లిఫ్ట్ కొత్త డిజైన్ మరియు సరికొత్త స్టైలింగ్‌తో పాటుగా అనేక కొత్త ఫీచర్లను కలిగి ఉంటుంది.

భారత్‌లో జూన్ 24న బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

కొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో డిజైన్ పరంగా స్వల్ప మార్పులు, అనేక ఫీచర్ చేర్పులు మరియు టెక్నాలజీ అప్‌గ్రేడ్స్ కూడా ఉన్నాయి. అయితే, ఇంజన్ పరంగా మాత్రం ఇందులో ఎలాంటి మార్పులు లేవు. మునుపటి వెర్షన్‌లో ఉపయోగించిన అదే ఇంజన్‌ను ఇందులోనూ కొనసాగిస్తున్నారు.

భారత్‌లో జూన్ 24న బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

ఈ మోడల్‌లో చేసిన డిజైన్, ఫీచర్ అప్‌గ్రేడ్స్ కారణంగా దీని ధర కూడా అధికంగా ఉండొచ్చని అంచనా. బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్‌లో 2017 తర్వాత ఇదే మేజర్ అప్‌గ్రేడ్. బహుశా ఈ మోడల్‌లో ఇదే చివరి ఫేస్‌లిఫ్ట్ కావచ్చని తెలుస్తోంది. నిజానికి అంతర్జాతీయ మార్కెట్ల కోసం ఈ ఫేస్‌లిఫ్ట్‌ను బిఎమ్‌డబ్ల్యూ మే 2020 లోనే వెల్లడించింది.

భారత్‌లో జూన్ 24న బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

భారతదేశంలో ఇది జూన్ 24, 2021వ తేదీన విడుదల కానుంది. కొత్త బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్‌తో అతిపెద్ద మార్పు కాస్మెటిక్ అప్‌గ్రేడ్ రూపంలో వస్తుంది. ఇందులో ముందు వైపు కొత్త క్రోమ్ గ్రిల్ ఇప్పుడు మరింత పెద్దదిగా ఉంటుంది.

భారత్‌లో జూన్ 24న బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

అంతేకాకుండా, ఇందులో ఇరువైపులా బంపర్లను రీడిజైన్ చేశారు. కొత్త హెడ్‌ల్యాంప్ డిజైన్ మరియు టాప్-ఎండ్ వేరియంట్లలో బిఎమ్‌డబ్ల్యూ యొక్క లేజర్‌లైట్ హెడ్‌ల్యాంప్ టెక్నాలజీ ఉపయోగించబడింది. ఇందులోని ఎల్ఈడి డిఆర్ఎల్‌లు కూడా ఇప్పుడు పూర్తిగా కొత్త స్టయిలింగ్‌తో డిజైన్ చేయబడ్డాయి.

భారత్‌లో జూన్ 24న బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

వెనుక వైపు రీడిజైన్ చేయబడిన టెయిల్ లాంప్స్ మరియు రివైజ్ చేసిన బంపర్ ఉన్నాయి. ఎగ్జాస్ట్ పైప్ అవుట్లెట్లు ఇప్పుడు అన్ని వేరియంట్లలో ట్రాపెజోయిడల్ ఆకారంలో ఉంటాయి. కొత్త ఫేస్‌లిఫ్టెడ్ 5 సిరీస్‌లోని ఇంటీరియర్స్‌లో సరికొత్త ఐడ్రైవ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఆఫర్ చేస్తున్నారు.

భారత్‌లో జూన్ 24న బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

ఇందులోని 10.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అన్ని వేరియంట్లలో స్టాండర్డ్ ఎక్విప్‌మెంట్‌గా లభిస్తుంది. ఈ కారులో కొత్త ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ మరియు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ఉంటుంది. కారు లోపల ఉపయోగించిన పదార్థాలను కూడా అప్‌గ్రేడ్ చేశారు.

భారత్‌లో జూన్ 24న బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లోని 530ఐ మరియు 530ఐ ఎమ్ స్పోర్ట్ వేరియంట్లలో 2.0-లీటర్, ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 5200 ఆర్‌పిఎమ్ వద్ద 248 బిహెచ్‌పి శక్తిని మరియు 1450-4800 ఆర్‌పిఎమ్ వద్ద 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

భారత్‌లో జూన్ 24న బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

కాగా, ఇందులోని బిఎమ్‌డబ్ల్యూ 520డి లగ్జరీ లైన్ వేరియంట్‌లో 2.0-లీటర్, ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 4000 ఆర్‌పిఎమ్ వద్ద 187.7 బిహెచ్‌పి శక్తిని మరియు 1750-2500 ఆర్‌పిఎమ్ వద్ద 400 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

భారత్‌లో జూన్ 24న బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

అలాగే, బిఎమ్‌డబ్ల్యూ 520డి ఎమ్ స్పోర్ట్ వేరియంట్‌లో 3.0-లీటర్, ఇన్‌లైన్ సిక్స్ సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 4000 ఆర్‌పిఎమ్ వద్ద 261.4 బిహెచ్‌పి శక్తిని మరియు 2000-2500 ఆర్‌పిఎమ్ వద్ద 620 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

భారత్‌లో జూన్ 24న బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

ఈ మూడు ఇంజన్లు కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో స్టాండర్డ్‌గా జతచేయబడి ఉంటాయి, ఇది ఇంజన్ నుండి వెలువడే శక్తిని వెనుక చక్రాలకు పంపిణీ చేస్తుంది. బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ప్రస్తుత ధర రూ.56 లక్షల నుంచి రూ.69 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంది. కాగా, కొత్త 2021 మోడల్ ధర దీని కన్నా ఎక్కువగా ఉంటుందని అంచనా.

కొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్ ఈ విభాగంలో ఆడి ఏ6, మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్, జాగ్వార్ ఎక్స్‌ఎఫ్, వోల్వో ఎస్90 మరియు లెక్సస్ ఈఎస్ వంటి మోడళ్లతో పోటీ పడనుంది.

Most Read Articles

English summary
New 2021 BMW 5 Series Facelift India Launch Scheduled For 24th June, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X