Just In
- 8 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 19 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 21 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 22 hrs ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- Movies
బీజేపీలో చేరిన డిస్కో డ్యాన్సర్.. ప్రధాని మోదీతో మిథున్ చక్రవర్తి కలిసి..
- Sports
ఐపీఎల్ 2021 షెడ్యూల్ వచ్చేసింది.. వేదికల్లో హైదరాబాద్‌కు దక్కని చోటు !
- Finance
ట్విట్టర్ సీఈవో 15 ఏళ్ల క్రితం తొలి ట్వీట్‌కు రూ.కోట్లు
- News
viral video: బాలుణ్ని మింగిన భారీ మొసలి -దాన్ని బంధించి, పొట్ట చీల్చి చూడగా...
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
ప్రస్తుతం భారతదేశంలో ఆఫ్-రోడింగ్ వాహనాలకు డిమాండ్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఇప్పటి వరకూ ఆఫ్-రోడింగ్ ఔత్సాహికులను మాత్రమే ఆకర్షించిన ఈ బాక్స్ టైప్ వాహనాలు, ఇప్పుడు సాధారణ కార్ ప్రియులను సైతం ఆకట్టుకుంటున్నాయి.

ఇందుకు ప్రధాన కారణం, వాటి లేటెస్ట్ డిజైన్ మరియు ఆ కార్లలో లభిస్తున్న లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లు. ఇప్పటికే, ఈ విభాగంలో కొత్తగా వచ్చిన మహీంద్రా థార్ అన్ని రకాల కార్ ప్రియులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, థార్‌కి గట్టి పోటీ ఇచ్చేందుకు ఫోర్స్ మోటార్స్ కంపెనీ కూడా సిద్ధమవుతోంది.

ఫోర్స్ మోటార్స్ కంపెనీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ త్వరలోనే భారత రోడ్లపైకి రానుంది. ఈ కారుకి సంబంధించిన టెస్టింగ్ ప్రక్రియను కంపెనీ పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా, ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా మహారాష్ట్ర రోడ్లపై టెస్టింగ్ చేస్తున్న గుర్ఖా ఎస్‌యూవీని ఓ యూట్యూబర్ తన కెమెరాలో బంధించాడు.
MOST READ:బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
ఈ వీడియోలో కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా డిజైన్ మరియు ఇంటీరియర్ ఫీచర్లు స్పష్టంగా వెల్లడయ్యాయి. ఫోర్స్ మోటార్స్ తమ కొత్త గుర్ఖా ఎస్‌యూవీ గతేడాది ప్రారంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా ప్రదర్శనకు ఉంచింది. ఈ కాన్సెప్ట్ ఆధారంగానే కొత్త ఎస్‌యూవీని తయారు చేస్తున్నారు.

కొత్త ఫోర్స్ గుర్ఖా ఫేస్‌లిఫ్ట్ మోడల్ గుండ్రటి ఎల్ఈడి హెడ్‌లైట్స్, గుండ్రటి ఫాగ్ ల్యాంప్స్, హై గ్రౌండ్ క్లియరెన్స్ మరియు పెద్ద వీల్ ఆర్చెస్‌తో రగ్గడ్ ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది. ఇదివరకు చూసిన ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీల కన్నా ఇది చాలా భిన్నంగా మరియు స్టైలిష్‌గా కనిపిస్తుంది.
MOST READ:ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!

అంతేకాకుండా, ఇందులో సరికొత్త గ్రిల్ డిజైన్, రెండు చివర్లలో రీడిజైన్ చేసిన బంపర్స్, ఎస్‌యూవీ చుట్టూ బాడీ క్లాడింగ్ మరియు స్కర్ట్స్ వంటి మార్పులు కూడా ఉన్నాయి. టాప్-ఎండ్ వేరియంట్లలో 245/70 టైర్ ప్రొఫైల్స్‌తో కొత్త 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను అందించనున్నారు. ఇది మునుపటి కన్నా మరింత మెరుగైన రోడ్-ప్రెజెన్స్‌ను అందిస్తుంది.

ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకొని, ఫోర్స్ మోటార్స్ తమ కొత్త ఫేస్‌లిఫ్టెడ్ గుర్ఖా ఎస్‌యూవీలో ఇంటీరియర్ ఫీచర్లను కూడా భారీగా అప్‌గ్రేడ్ చేసింది. ఇప్పుడు డాష్‌బోర్డ్ మధ్యలో సరికొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎమ్ఐడి డిస్‌ప్లేతో కూడిన కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి లేటెస్ట్ ఫీచర్లు లభిస్తాయి.
MOST READ:జాబ్ చేస్తూ.. జీవితాన్ని, అనుభవించు రాజా..

ఇంకా ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీలు కూడా ఉండనున్నాయి. అంతేకాకుండా, రెండవ వరుసలో ప్రయాణీకుల కోసం వ్యక్తిగత సీట్లు మరియు కొత్తగా డిజైన్ చేసిన గుండ్రటి ఏసి వెంట్స్ వంటి మార్పులు ఉండన్నాయి.

ఇంజన్ పరంగా చూసుకుంటే, కొత్త ఫోర్స్ గూర్ఖాలో బిఎస్-6 కంప్లైట్ 2.6-లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 బిహెచ్‌పి శక్తిని మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
MOST READ:రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శించనున్న యుద్ధ విమానాలు ఇవే, చూసారా..!

కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా స్టాండర్డ్ ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభ్యం కావచ్చని సమాచారం. ఇందులో మాన్యువల్ లాకింగ్ డిఫరెన్షియల్స్ మరియు కష్టతరమైన భూభాగాలపై ప్రయాణించేందుకు వీలుగా లో-రేంజ్ గేర్‌బాక్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది.

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్ మరియు వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయి. నిజానికి మహీంద్రా థార్‌తో పోలిస్తే, ఫోర్స్ గుర్ఖాలో అనేక విశిష్టమైన ఫీచర్లు ఉంటాయి.

ప్రత్యేకించి ఇందులోని క్యాబిన్ మహీంద్రా థార్ కన్నా చాలా విశాలంగా ఉంటుంది. గుర్ఖా ఎస్‌యూవీ కోసం అనేక కస్టమైజేషన్ ఆప్షన్లు, ఆఫ్-రోడింగ్ యాక్ససరీలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇది ఈ విభాగంలో కొత్త తరం మహీంద్రా థార్ మరియు మారుతి సుజుకి జిమ్నీ వంటి ఆఫ్-రోడ్ ఎస్‌యూవీలకు పోటీగా నిలుస్తుంది.