హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ విడుదల; ఇప్పుడు కొత్త ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో..

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్, భారతదేశంలో విక్రయిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ క్రెటాను పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయిస్తోంది. హ్యుందాయ్ గతేడాది ఆరంభంలో సెకండ్ జనరేషన్ 2020 క్రెటా ఎస్‌యూవీని అనేక కొత్త అప్‌డేట్‌లతో భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ విడుదల; ఇప్పుడు కొత్త ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో..

కాగా, ఈ కొరియన్ కంపెనీ ఇప్పుడు రష్యా మార్కెట్లో తమ కొత్త తరం క్రెటా ఎస్‌యూవీలో తాజాగా ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. రష్యన్ మార్కెట్లో విక్రయించే హ్యుందాయ్ క్రెటా ఇప్పుడు ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో రానుంది. దీని ఇంటీరియర్ చూడటానికి కంపెనీ ఇటీవల విడుదల చేసిన అల్కజార్ 7-సీటర్ ఎస్‌యూవీలా అనిపిస్తుంది.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ విడుదల; ఇప్పుడు కొత్త ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో..

రషన్ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ రెండు ఇంజన్ ఆప్షన్స్‌తో పాటుగా ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ను కూడా పొందుతుంది. కానీ, భారత మార్కెట్లో లభిస్తున్న హ్యుందాయ్ క్రెటాలో మాత్రం ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ అందుబాటులో లేదు.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ విడుదల; ఇప్పుడు కొత్త ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో..

కొత్త తరం హ్యుందాయ్ క్రెటాలో క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్, స్ప్లిట్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్ క్లస్టర్, అర్ధచంద్రాకారంలో ఉన్న ఎల్‌ఇడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఫాగ్‌ల్యాంప్స్‌తో కూడిన వ్యక్తిగత కార్నరింగ్ లైట్లు, ఉబ్బినట్లుగా ఉండే వీల్ ఆర్చెస్ మరియు బాడీ చుట్టూ ఫ్లోటింగ్ క్రీజ్ లైన్స్ ఉంటాయి.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ విడుదల; ఇప్పుడు కొత్త ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో..

అంతేకాకుండా, ఇంకా ఇందులో కొత్త ఎల్‌ఇడి టెయిల్ లాంప్స్, సిల్వర్ రూఫ్ రైల్స్, స్పోర్టీ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్స్, ఫ్రంట్ గ్రిల్ చుట్టూ క్రోమ్ సరౌండింగ్, షార్క్ ఫిన్ యాంటెన్నా, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ మరియు హై-మౌంటెడ్ స్టాప్ లాంప్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ విడుదల; ఇప్పుడు కొత్త ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో..

ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ కొలతలను గమనిస్తే, ఇది 4,300 మిమీ పొడవును మరియు 1,790 మిమీ వెడల్పును కలిగి ఉంటుంది. దీని వీల్ బేస్ పొడవు 2,610 మిమీ మరియు ఎత్తు 1,620 మిమీగా ఉంటుంది.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ విడుదల; ఇప్పుడు కొత్త ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో..

ఇండియన్ వెర్షన్ క్రెటాతో పోల్చుకుంటే, ఈ రష్యన్ వెర్షన్ క్రెటా 30 మిమీ ఎక్కువ పొడవు, 10 మిమీ ఎక్కువ వెడల్పు మరియు 10 మిమీ తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. అలాగే, వీల్‌బేస్ కూడా 20 మిమీ ఎక్కువగా ఉంటుంది. పెరిగిన కొలత కారణంగా, ఇందులో ఇంటీరియర్ స్పేస్ కూడా పెరుగుతుంది.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ విడుదల; ఇప్పుడు కొత్త ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో..

ఇక ఇందులోని ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, లోపలి భాగంలో కొత్త సెంటర్ కన్సోల్ మరియు డాష్‌బోర్డ్‌తో మరింత సమగ్ర స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో D-ఆకారపు 4-స్పోక్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ మరియు గేర్ సెలెక్టర్, ఎనిమిది స్పీకర్లతో కూడిన బోస్ ఆడియో సిస్టమ్, లేటెట్ బ్లూలింక్ టెక్నాలజీతో కూడిన ఆప్షనల్ 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ విడుదల; ఇప్పుడు కొత్త ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో..

క్యాబిన్ లేఅవుట్ డ్యూయెల్ టోన్ థీమ్‌ను కలిగి ఉంటుంది. ఇది చూడటానికి హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్ టాప్-ఎండ్ వేరియంట్ ఇంటీరియర్ థీమ్‌ను పోలి ఉంటుంది. క్రెటా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో స్పోర్ట్, నార్మల్ మరియు ఎకో అనే డ్రైవింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి. ఈ డ్రైవింగ్ మోడ్‌లను ఎంచుకునేందుకు కొత్త డ్రైవ్ మోడ్ సెలెక్టర్ డయల్ కూడా ఉంటుంది.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ విడుదల; ఇప్పుడు కొత్త ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో..

ఇక చివరిగా ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, రష్యన్ మార్కెట్లో కొత్త హ్యుందాయ్ క్రెటా రెండు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో మొదటి 1.6-లీటర్ ఎమ్‌పిఐ పెట్రోల్ ఇంజన్ మరియు రెండవది 2.0-లీటర్ ఎమ్‌పిఐ పెట్రోల్ ఇంజన్.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ విడుదల; ఇప్పుడు కొత్త ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో..

వీటిలో మొదటి ఇంజన్ 123 హెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది ఫ్రంట్-వీల్-డ్రైవ్, ఆల్-వీల్-డ్రైవ్ కాన్ఫిగరేషన్లను కలిగి ఉంటుంది. ఇకపోతే, రెండవ ఇంజన్ 150 హెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అన్ని ఇంజన్లు కూడా సిక్స్-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి.

Most Read Articles

English summary
New 2021 Hyundai Creta Facelift Launched In Russia With All Wheel Drive Option, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X