భారత్‌లో కొత్త Jaguar XF Facelift విడుదల: ధర & వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ Jaguar (జాగ్వార్) భారతీయ మార్కెట్లో తన కొత్త లగ్జరీ సెడాన్ అయిన 2021 Jaguar XF Facelift (2021 జాగ్వార్ ఎక్స్‌ఎఫ్ ఫేస్‌లిఫ్ట్‌) ను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త సెడాన్ ప్రారంభ ధర రూ. 71.6 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త లగ్జరీ సెడాన్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. Jaguar XF Facelift పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో డీజిల్ వేరియంట్ ధర రూ. 76 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

భారత్‌లో కొత్త Jaguar XF Facelift విడుదల: ధర & వివరాలు

కొత్త 2021 Jaguar XF Facelift మంచి డిజైన్ కలిగి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో చాలా అరకు అప్డేటెడ్ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులోని ప్రెస్టీజ్ ట్రిమ్ స్థానంలో స్పోర్టియర్ లుకింగ్ ఆర్-డైనమిక్ ట్రిమ్ వచ్చింది. అలాగే, సెడాన్ ఇప్పుడు తేలికపాటి హైబ్రిడ్ టెక్నాలజీతో డీజిల్ ఇంజిన్‌తో కూడా అందుబాటులో ఉంది.

భారత్‌లో కొత్త Jaguar XF Facelift విడుదల: ధర & వివరాలు

ఈ కొత్త లగ్జరీ సెడాన్ ఇప్పుడు రెండు ఇంజన్ ఎంపికలలో అందుబాటులో ఉంది. ఇందులో మొదటిది 2-లీటర్ మైల్డ్-హైబ్రిడ్ డీజిల్ ఇంజన్ కాగా, రెండవది 2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్.

భారత్‌లో కొత్త Jaguar XF Facelift విడుదల: ధర & వివరాలు

ఇందులోని 2-లీటర్ మైల్డ్-హైబ్రిడ్ డీజిల్ ఇంజన్ 203 బిహెచ్‌పి పవర్‌ మరియు 430 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది, అదేవిధంగా ఇందులోని 2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 250 బిహెచ్‌పి పవర్‌ మరియు 365 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. రెండు ఇంజన్లు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడ్డాయి మరియు కారు RWD (రియర్-వీల్ డ్రైవ్) సిస్టమ్‌తో వస్తుంది.

భారత్‌లో కొత్త Jaguar XF Facelift విడుదల: ధర & వివరాలు

కొత్త 2021 జాగ్వార్ XF ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు కొత్త మెష్ గ్రిల్, పెద్ద మరియు మరింత దూకుడుగా ఉండే బంపర్‌లు, కొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ మరియు లేటెస్ట్ ఎల్ఈడీ హెడ్‌లైట్ సెటప్‌ను పొందింది. అంతే కాకుండా ఇది స్పోర్టీ లుక్ కోసం బ్లాక్ 'R-డైనమిక్' ఎక్స్‌టీరియర్ యాక్సెంట్స్ కూడా పొందుతుంది.

భారత్‌లో కొత్త Jaguar XF Facelift విడుదల: ధర & వివరాలు

కొత్త XF ఫేస్‌లిఫ్ట్ అద్భుతమైన ఇంటీరియర్ ఫీచర్స్ కూడా పొందుతుంది. కావున క్యాబిన్ లోపల కొత్త మరియు మరింత ప్రీమియం లుకింగ్ డాష్‌బోర్డ్‌ను పొందింది. ఇది చాలా ఆకర్షనీయంగా ఉంది. లోపల 11.4 ఇంచెస్ పివి ప్రో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ చేయబడ్డాయి.

భారత్‌లో కొత్త Jaguar XF Facelift విడుదల: ధర & వివరాలు

అంతే కాకుండా ఇందులో క్లైమేట్ కంట్రోల్ కోసం కొత్త యూనిట్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రోటరీ నాబ్‌కు బదులుగా గేర్ లివర్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన 12-వే పవర్డ్ ఫ్రంట్ సీట్లు మరియు 10-కలర్ యాంబియంట్ లైటింగ్‌ వంటివి కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారునికి చాలా అనుకూలంగా ఉంటాయి.

భారత్‌లో కొత్త Jaguar XF Facelift విడుదల: ధర & వివరాలు

కంపెనీ ఈ కొత్త 2021 జాగ్వార్ XF ఫేస్‌లిఫ్ట్‌లో లేటెస్ట్ డ్రైవర్ అసిస్ట్ అనే కొత్త సిస్టం కూడా అందించింది. డ్రైవర్ అసిస్ట్ సిస్టం లో మీకు 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ అసిస్ట్, ఆటో-బీమ్ అసిస్ట్ మరియు స్పీడ్ లిమిటర్‌తో క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు అందించబడ్డాయి. ఏది ఏమైనా ఈ సెడాన్ అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత్‌లో కొత్త Jaguar XF Facelift విడుదల: ధర & వివరాలు

Jaguar (జాగ్వార్) ఇటీవల తన జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌విఆర్ ను ధర రూ. 1.51 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఇండియా) వద్ద విడుదల చేసింది. ఈ కొత్త లగ్జరీ కారు యొక్క బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే కంపెనీ ఇప్పుడు ఈ లగ్జరీ కారు యొక్క డెలివరీలను ప్రారంభించింది.

భారత్‌లో కొత్త Jaguar XF Facelift విడుదల: ధర & వివరాలు

జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌విఆర్ బ్రాండ్ యొక్క 5.0-లీటర్ సూపర్ ఛార్జ్డ్ వి8 పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ 543 బిహెచ్‌పి పవర్ మరియు 700 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. కొత్త జాగ్వార్ ఎఫ్-పేస్ SVR SUV మునుపటి మోడల్‌తో పోలిస్తే 20 ఎన్ఎమ్ టార్క్ అధికంగా ఉత్పత్తి చేయగలదు. ఈ SUV కేవలం 0.3 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వేగవంతం చేయగలదు. అంతే కాకుండా ఈ జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌విఆర్ యొక్క గరిష్ట వేగం గంటకు 286 కి.మీ.జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌విఆర్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
New 2021 jaguar xf facelift luxury sedan launched at rs 71 6 lakh features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X