కొత్త 2021 కియా సోనెట్ మరియు కియా సెల్టోస్ డెలివరీలు ప్రారంభం

కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ తమ కొత్త లోగో మరియు కొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసిన కొత్త 2021 మోడల్ కియా సోనెట్ మరియు కియా సెల్టోస్ ఎస్‌యూవీల డెలివరీలను కంపెనీ ప్రారంభించింది. ఈ కొత్త మోడళ్లలో చేసిన అప్‌గ్రేడ్స్ కారణంగా వీటి ధరలు కూడా పెరిగాయి.

కొత్త 2021 కియా సోనెట్ మరియు కియా సెల్టోస్ డెలివరీలు ప్రారంభం

కియా సోనెట్ మరియు కియా సెల్టోస్ మోడళ్ల పట్ల ఆసక్తిగల కస్టమర్లు కంపెనీ డీలర్‌షిప్‌లో కానీ లేదా ఆన్‌లైన్‌లో కానీ రూ.25,000 టోకెన్ అమౌంట్ చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. అయితే, కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్ ఈ వాహనాల వెయిటింగ్ పీరియడ్ సుమారు 20 వారాల వరకు ఉంటోంది.

కొత్త 2021 కియా సోనెట్ మరియు కియా సెల్టోస్ డెలివరీలు ప్రారంభం

ఈ కొత్త ఎస్‌యూవీలు ఇప్పుడు కొత్త లోగోతో పాటుగా కొత్త ఫీచర్లు మరియు టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చాయి. ఇందులో భాగంగా, కియా సోనెట్ మరియు సెల్టోస్ ఎస్‌యూవీలలో పాడిల్ షిఫ్టర్‌లను జోడించారు. ఈ పాడిల్ షిఫ్టర్లు కారు స్టీరింగ్ వెనుకన అమర్చబడి ఉంటాయి. ఇది గేర్ లివర్ మాదిరిగా పనిచేస్తుంది. డ్రైవింగ్ సమయంలో సులువుగా గేర్లను పెంచడానికి లేదా తగ్గించడానికి ఇది సహాయపడుతుంది.

MOST READ:వావ్.. అమేజింగ్ ట్యాలెంట్.. వీడియో చూస్తే హవాక్కవ్వాల్సిందే

కొత్త 2021 కియా సోనెట్ మరియు కియా సెల్టోస్ డెలివరీలు ప్రారంభం

ఈ పాడిల్ షిఫ్టింగ్ ఫీచర్ కొత్త సెల్టోస్ జిటిఎక్స్ ప్లస్ 1.5డి 6 ఏటి మరియు 1.4 టి-జిడిఐ 7 డిసిటి వేరియంట్లలో మాత్రమే లభిస్తాయి. అదే కియా సొనెట్ విషయంలో అయితే, ఇందులోని అన్ని ఆటోమేటిక్ వేరియంట్లలో ఈ ఫీచర్ లభిస్తుంది.

కొత్త 2021 కియా సోనెట్ మరియు కియా సెల్టోస్ డెలివరీలు ప్రారంభం

కాగా, కియా సెల్టోస్ యొక్క 1.5-లీటర్ పెట్రోల్ హెచ్‌టికె వేరియంట్ ఇప్పుడు ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (ఐఎమ్‌టి)తో లభిస్తుంది. ఇది ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) లేదా ఏజిఎస్ (ఆటో గేర్ షిఫ్ట్) టెక్నాలజీ మాదిరిగానే పనిచేస్తుంది.

MOST READ:ఈ వాహనాలు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI

కొత్త 2021 కియా సోనెట్ మరియు కియా సెల్టోస్ డెలివరీలు ప్రారంభం

ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (ఐఎమ్‌టి)లో మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది కానీ క్లచ్ పెడల్ మాత్రం ఉండదు. గేర్ మార్చాలనుకున్నప్పుడు క్లచ్ అవసరం లేకుండా సులువుగా గేర్లను మార్చుకోవచ్చు. వాహన వేగాన్ని బట్టి క్లచ్‌ను కారులోని హైడ్రాలిక్స్ ఆటోమేటిక్‌గా కంట్రోల్ అయ్యేలా చేస్తాయి.

కొత్త 2021 కియా సోనెట్ మరియు కియా సెల్టోస్ డెలివరీలు ప్రారంభం

ఈ మార్పులే కాకుండా, కొత్త కియా సెల్టోస్‌లో ఇప్పుడు కొత్తగా ఓ ప్రీమియం వేరియంట్‌ను కూడా జోడించారు. ఇది 1.4 టి-జిడిఐ పెట్రోల్ జిటిఎక్స్ (ఓ) రూపంలో లభిస్తుంది. అలాగే, కొత్త సొనెట్ యొక్క హెచ్‌టిఎక్స్ ట్రిమ్‌లో 1.0-లీటర్ టి-జిడిఐ పెట్రోల్ ఇంజన్‌లో 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్ మరియు 1.5 డీజిల్ ఇంజన్‌లో 6 ఏటి గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా ఉంటుంది.

MOST READ:వావ్.. అమేజింగ్ ట్యాలెంట్.. వీడియో చూస్తే హవాక్కవ్వాల్సిందే

కొత్త 2021 కియా సోనెట్ మరియు కియా సెల్టోస్ డెలివరీలు ప్రారంభం

కొత్త అప్‌డేటెడ్ కియా సెల్టోస్ మరియు సొనెట్ కార్లలో కొత్తగా జోడించిన పాడిల్ షిఫ్టర్ ఫీచర్ చాలా ప్రత్యేకమైనదని, ఇది డ్రైవర్‌కు ఎటువంటి సమస్యలు లేకుండా గేర్‌లను మార్చడానికి సహాయపడుతుందని కంపెనీ పేర్కొంది.

కొత్త 2021 కియా సోనెట్ మరియు కియా సెల్టోస్ డెలివరీలు ప్రారంభం

కియా సొనెట్ (ఐఎమ్‌టి) ట్రాన్స్‌మిషన్‌కు కస్టమర్ల నుండి మంచి స్పందన వస్తోందని, ఈ నేపథ్యంలో, కొత్త సెల్టోస్‌లో కూడా ఇప్పుడు ఐఎమ్‌టి గేర్‌బాక్స్‌ను పరిచయం చేశామని కియా మోటార్స్ తెలిపింది. కొత్త సెల్టోస్ ఐఎమ్‌టి వేరియంట్‌కు ఇప్పుడు కొత్త ఇంటీరియర్‌తో లభిస్తుంది.

MOST READ:నడి రోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు పోలీసులు[వీడియో].. కారణం ఏమిటంటే?

కొత్త 2021 కియా సోనెట్ మరియు కియా సెల్టోస్ డెలివరీలు ప్రారంభం

ఈ వేరియంట్ లోపలి భాగంలో బీజ్ అండ్ బ్లాక్ కలర్‌లో అప్‌హోలెస్ట్రీ ఉంటుంది. ఇంటీరియర్‌ను మరింత ఆధునికంగా మరియు విలాసవంతంగా మార్చడానికి కంపెనీ ఇందులోని ఎయిర్ కండీషనర్ వెంట్స్‌కు సిల్వర్ యాక్సెంట్‌ను జోడించింది.

కొత్త 2021 కియా సోనెట్ మరియు కియా సెల్టోస్ డెలివరీలు ప్రారంభం

కియా సెల్టోస్ తక్కువ వేరియంట్లలో కూడా కంపెనీ అనేక కొత్త ఫీచర్లను జోడించింది. సెల్టోస్ హెచ్‌టికె వేరియంట్లో కంపెనీ వైర్‌లెస్ ఫోన్ ప్రొజెక్షన్ సిస్టమ్, రిమోట్ ఇంజన్ స్టార్ట్ / స్టాప్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ప్రీమియం బీజ్ ఫాబ్రిక్ సీట్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

Image Courtesy: Nagarjuna

Most Read Articles

English summary
New 2021 Kia Sonet And Kia Seltos Deliveries Started, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X