మే నెలలో కొత్త 2021 మారుతి సెలెరియో లాంచ్; కొత్త డిజైన్ మరియు కొత్త ఫీచర్స్

భారతదేశపు నెంబర్ వన్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న తమ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ సెలెరియోలో ఓ నెక్స్ట్ జనరేషన్ వెర్షన్‌ను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసినదే. ఇప్పుడు ఈ కారుకు సంబంధించిన మరిన్ని కొత్త వివరాలు వెల్లడయ్యాయి.

మే నెలలో కొత్త 2021 మారుతి సెలెరియో లాంచ్; కొత్త డిజైన్ మరియు కొత్త ఫీచర్స్

మారుతి సుజుకి ఇప్పటికే తమ నెక్స్ట్ జనరేషన్ సెలెరియో కారును భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తుండటాన్ని పలు సందర్భాల్లో గుర్తించడం జరిగింది. తాజాగా ఎక్స్‌ప్రెస్‌డ్రైవ్స్ లీక్ చేసిన సమాచారం ప్రకారం, ఈ కొత్త 2021 సెలెరియో మే మధ్య భాగం నాటికి భారత మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది.

మే నెలలో కొత్త 2021 మారుతి సెలెరియో లాంచ్; కొత్త డిజైన్ మరియు కొత్త ఫీచర్స్

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న సెలెరియో కారుతో పోల్చుకుంటే, కొత్తగా రానున్న 2021 సెలెరియో ప్రస్తుత మోడల్ కన్నా మరింత పెద్దదిగా మరియు సురక్షితమైనదిగా ఉంటుంది. పెరిగిన కొలతల కారణంగా, ఈ చిన్న కారులోని క్యాబిన్ స్పేస్ మునుపటి కంటే మరింత విశాలంగా ఉంటుంది.

మే నెలలో కొత్త 2021 మారుతి సెలెరియో లాంచ్; కొత్త డిజైన్ మరియు కొత్త ఫీచర్స్

ఈ హ్యాచ్‌బ్యాక్‌లో చేయబోయే మార్పుల విషయానికి వస్తే, ఈ కొత్త తరం సెలెరియో కారును ఇప్పుడు బ్రాండ్ యొక్క హార్ట్‌టెక్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారు చేయనున్నారు. ఇదే ప్లాట్‌ఫామ్‌పై కంపెనీ విక్రయిస్తున్న స్విఫ్ట్, వ్యాగన్ఆర్ మరియు డిజైర్‌తో సహా పలు ఇతర మోడళ్లను కూడా తయారు చేస్తున్నారు.

మే నెలలో కొత్త 2021 మారుతి సెలెరియో లాంచ్; కొత్త డిజైన్ మరియు కొత్త ఫీచర్స్

కొత్త ప్లాట్‌ఫామ్‌పై తయారు కానున్న కొత్త 2021 సెలెరియోను మునుపటి కంటే మరింత సురక్షితంగా ఉంటుందని తెలుస్తోంది. మారుతి సుజుకి నుండి రాబోయే ఈ కొత్త తరం హ్యాచ్‌బ్యాక్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, స్పీడ్ అలర్ట్స్, సీట్ బెల్ట్ రిమైండర్‌లు మరియు ఏబిఎస్ వంటి సేఫ్టీ ఫీచర్లను అన్ని వేరియంట్‌లలో స్టాండర్డ్‌గా అందించే అవకాశం ఉంది.

మే నెలలో కొత్త 2021 మారుతి సెలెరియో లాంచ్; కొత్త డిజైన్ మరియు కొత్త ఫీచర్స్

స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో పాటుగా ఈ 2021 మోడల్ డిజైన్, ఫీచర్స్ మరియు ఇంటీరియర్లలో కూడా కంపెనీ పలు మార్పులు చేర్పులు చేయనుంది. ఈ అప్‌గ్రేడెడ్ ఫీచర్ల కారణంగా, ఈ కొత్త సెలెరియో ధర కూడా ప్రస్తుత మోడల్‌తో పోల్చుకుంటే, కాస్తంత అధికంగానే ఉంటుందని తెలుస్తోంది.

మే నెలలో కొత్త 2021 మారుతి సెలెరియో లాంచ్; కొత్త డిజైన్ మరియు కొత్త ఫీచర్స్

అప్‌గ్రేడ్ చేయబడే స్టైలింగ్ ఫీచర్లలో పూర్తి ఎల్‌ఈడీ లైటింగ్, కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్, అప్‌డేటెడ్ డాష్‌బోర్డ్ లేఅవుట్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి మరెన్నో ఫీచర్లు ఉండనున్నాయి.

మే నెలలో కొత్త 2021 మారుతి సెలెరియో లాంచ్; కొత్త డిజైన్ మరియు కొత్త ఫీచర్స్

ఇంజన్ పరంగా కొత్త తరం మారుతి సుజుకి సెలెరియోలో ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది. ఇందులో ఇదివరకటి 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే స్వల్పంగా అప్‌డేట్ చేసి ఉపయోగించే అవకాశం ఉంది. దీని పవర్ మరియు టార్క్ గణాంకాల్లో కూడా ఎలాంటి మార్పు ఉండబోదని సమాచారం.

మే నెలలో కొత్త 2021 మారుతి సెలెరియో లాంచ్; కొత్త డిజైన్ మరియు కొత్త ఫీచర్స్

ఈ ఇంజన్ అదే 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో ఆప్షనల్ ఏజిఎస్ (ఆటో గేర్ షిఫ్ట్) ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ కూడా లభ్యం కానుంది. ఇటీవలి రూమర్ల ప్రకారం, మారుతి సుజుకి తమ కొత్త సెలెరియోలో శక్తివంతమైన 1.2-లీటర్ ఇంజన్‌ను ఆఫర్ చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. స్విఫ్ట్ వాగన్ఆర్ వంటి మోడళ్లలో ఇప్పటికే ఈ ఇంజన్‌ను అందిస్తున్నారు.

మే నెలలో కొత్త 2021 మారుతి సెలెరియో లాంచ్; కొత్త డిజైన్ మరియు కొత్త ఫీచర్స్

కొత్త తరం మారుతి సుజుకి సెలెరియో రాకతో, మార్కెట్లో ఈ బ్రాండ్ అమ్మకాలు మరింత పెరుగుతాయని కంపెనీ ఆశిస్తోంది. ఇది ఈ విభాగంలో టాటా టియాగో, రెనో క్విడ్ మరియు ఫోర్డ్ ఫిగో వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Maruti Suzuki India To Launch New 2021 Celerio In May, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X